స్త్రీలలో సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడానికి.. కారణాలేంటో మీకు తెలుసా?

స్త్రీలలో సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడానికి.. కారణాలేంటో మీకు తెలుసా?

సెక్స్ (Sex).. ఈ మాట వినగానే ప్రతి ఒక్కరి మనసులో తమదంటూ ఓ కల లేదా కోరిక గుర్తుకు వస్తుంది. ప్రతి జంట తమ లైంగిక జీవితం ఎంతో ఆనందంగా ఉండాలని.. తామిద్దరం సంతోష సాగరంలో తేలియాడాలని కోరుకుంటుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే ప్రతి పురుషుడు తన భాగస్వామి ఆనందంగా ఉండేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మగవారిలో కోరికలు (desire or sexual interest) ఎక్కువగా ఉంటాయి.

కానీ ఆడవారిలో కోరికలు పుట్టాలంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాదు.. సెక్స్ పట్ల కోరికలు తగ్గడం ఇప్పుడు చాలామందిలో మనం గమనిస్తున్నాం. కొందరిలో ముందు నుంచి తక్కువగా ఉంటే.. మరికొందరిలో పెళ్లైన కొద్ది కాలానికి ఆడవారిలో సెక్స్ పట్ల కోరికలు తగ్గుతూ ఉంటాయి. అసలు స్త్రీలలో సెక్స్ పట్ల కోరికలు తక్కువగా ఉండడానికి కారణమేంటో తెలుసుకుందాం..

ఒత్తిడి

Shutterstock

బిజీ బిజీ జీవితాల్లో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ మగవారితో పోల్చితే స్త్రీలకు ఈ ఒత్తిడి రెండింతలు ఉంటుంది. ఎందుకంటే అటు ఆఫీస్ బాధ్యతలతో పాటు.. ఇటు ఇంటి పనులు కూడా వారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పని ఒత్తిడి పెరగడం వల్ల.. వారి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల సెక్స్ కోరికలు కూడా తగ్గుతాయి.

రోజూ సెక్సా?

Shutterstock

పెళ్లయ్యాక రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల కూడా.. కొందరిలో సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలు తమ ఆసక్తులేంటో చెప్పుకునే పరిస్థితి కూడా వారికి ఉండదు. భాగస్వామి ఒత్తిడి వల్ల సెక్స్‌కి ఒకే చెప్పినా వారు ఎంజాయ్ చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వామి కూడా కొంతకాలం దూరంగా ఉండడం, వారిని అర్థం చేసుకోవడం.. మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ ఉండడం వంటివి చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా వారి మనసులోని కోరికలను అర్థం చేసుకొని దానికి తగినట్లుగా వ్యవహరించాల్సిన బాధ్యత భాగస్వామిపై ఉంటుంది.

మానసికంగా దూరమవ్వడం

Shutterstock

చాలామంది జంటలు శారీరకంగా రోజూ కలుస్తున్నా.. మానసికంగా మాత్రం వారి మధ్య చాలా దూరం ఉంటుంది. ఇద్దరి మధ్య గొడవలు, వాగ్వాదాలు, భాగస్వామి తమ మాటలకు విలువనివ్వకపోవడం వంటివన్నీ ఆడవారిలో సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. ఇలా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా.. మగవారు సెక్స్ కావాలని కోరుకుంటారు. కానీ స్త్రీలు మాత్రం.. అసలు దాని గురించి ఆలోచించేందుకే ఆసక్తి చూపించరు. వీటితో పాటు ఇంట్లో జరిగే గొడవలు వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గుతాయి.

పిల్లలు పుట్టిన తర్వాత..

Shutterstock

తల్లి కావడం ఏ మహిళకైనా పెద్ద బాధ్యత. కేవలం బాధ్యత మాత్రమే కాదు.. అదో పెద్ద వరం కూడా. అయితే తల్లి కాబోయే సమయంలో, పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలకు హార్మోన్లలో ఎన్నో మార్పులొస్తాయి. ఇలాంటప్పుడు ఒక్కోసారి సెక్స్ కోరికలు ఎక్కువయ్యే అవకాశాలుంటే.. మరికొన్ని సార్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే కోరికలు తగ్గినా, పెరిగినా.. కొత్తగా తల్లైన వారు తమ జీవితాన్ని బిడ్డ చుట్టూ పెనవేసుకుంటారు. అంతేకాకుండా రాత్రి బిడ్డ మాటిమాటికీ లేవడం వల్ల కూడా.. వారు అలసిపోతారు. ఈ సమయంలో వారు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. కానీ సెక్స్ విషయంలో మాత్రం అస్సలు బలవంతం చేయడం సరికాదు.

నిద్ర లేకపోవడం వల్ల..

Shutterstock

నిద్ర లేకపోవడం కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి ఓ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. రోజంతా కష్టపడి అన్ని పనులు చేసిన తర్వాత.. స్త్రీలు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు.  భాగస్వామికి సెక్స్ కావాలనుకుంటే వారికి ఆ కోరిక పుట్టకపోవచ్చు. ఇదే పరిస్థితి ఎక్కువ రోజుల పాటు కొనసాగితే.. సెక్స్ పట్ల కోరికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజంతా కష్టపడిన వారిని రాత్రి ప్రశాంతంగా నిద్ర పోనిచ్చి.. ఉదయాన్నే సెక్స్‌లో పాల్గొనే ప్రయత్నం చేయడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.