ప్లస్ సైజ్ అయితేనేం.. వీళ్లు తమ మోడలింగ్‌తో కేక పుట్టిస్తున్నారు..!

ప్లస్ సైజ్ అయితేనేం.. వీళ్లు తమ మోడలింగ్‌తో కేక పుట్టిస్తున్నారు..!

మోడలింగ్ (Modelling).. బయట ప్రపంచంలో అస్సలు కుదరని.. రియలిస్టిక్‌గా లేని స్టాండర్డ్స్‌తో అందరినీ ఇబ్బంది పెడుతుందని ఈ పరిశ్రమ ఎంతో చెడ్డ పేరు మూటకట్టుకుంది. పొడవుగా, సైజ్ జీరో ఫిగర్‌తో మోడల్స్ ర్యాంప్ మీద నడుస్తుంటే.. అందం అంటే అలాగే ఉండాలని అమ్మాయిలు అనుకొని వారిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ లేని పోని ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు.

అయితే పరిస్థితులు ఇప్పుడు మారుతున్నాయి.. జీరో సైజ్ మోడల్స్‌ని దూరంగా ఉంచి.. సరైన సైజ్‌లో ఉంటేనే మోడలింగ్‌కి తీసుకుంటున్నాయి మోడలింగ్ సంస్థలు. అంతేకాదు.. బాడీ పాజిటివిటీ మూవ్ మెంట్‌లో భాగంగా మోడలింగ్ ఇండస్ట్రీలో ప్లస్ సైజ్ మోడల్స్ (plus size models) రావడం ఎక్కువైంది. సాధారణంగా మోడల్స్ సైజ్ పది లోపల ఉండాలని భావిస్తుంటారు. అంతకంటే లావున్నవారిని ప్లస్ సైజ్ మోడల్స్‌గా పరిగణిస్తారు. వీటితో పాటు వెయిస్ట్ హిప్ రేషియో ఎనిమిది నుంచి పది అంగుళాలు ఉండాలని కొన్ని సంస్థలు కోరుతుంటాయి.

అలాగే.. ఎత్తు విషయంలో కనీసం 5 అడుగుల 8 అంగుళాలు ఉండాలని మోడలింగ్ సంస్థలు చెబుతుంటాయి. ఇలా ప్లస్ సైజ్‌లో ఉన్నా మోడలింగ్ రంగంలో తమదైన పేరు సంపాదించుకున్న మోడల్స్ ఇంటర్నేషనల్‌గానే కాదు.. మన దేశంలోనూ తమ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ అందరికీ స్పూర్తినిస్తున్నారు.

1. ఆష్లే గ్రాహమ్

Instagram

ఆష్లే ఓ అమెరికన్ మోడల్. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన గురించి చాలామందికి ఇప్పటికే తెలుసు. స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్‌తో పాటు మరెన్నో మ్యాగజైన్ల కవర్లపై వచ్చిన మొదటి ప్లస్ సైజ్ మోడల్ తను. ప్రస్తుతం హై ఫ్యాషన్ రన్ వే షోలలో ర్యాంప్ వాక్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ మోడల్స్‌గా పేరు సాధించిన కెండాల్ జెన్నర్, కైయా గెర్బర్ వంటివారితో కలిసి మోడలింగ్ చేస్తోంది. అంతేకాదు.. రెవ్లాన్, మరీనా రినార్డీ, స్విమ్ సూట్స్ ఫర్ ఆల్ వంటి ప్రముఖ సంస్థలకు కూడా మోడలింగ్ చేస్తోంది.

2. డెనైస్ బిడోట్

Instagram

డెనైస్ 33 సంవత్సరాల అమెరికన్ మోడల్. 2014లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో నడిచి.. అలా నడిచిన మొదటి ప్లస్ సైజ్ మోడల్‌గా పేరు సాధించింది. నార్డ్ స్ట్రామ్, టార్గెట్, ఓల్డ్ నేవీ, లేన్ బ్రియాంట్, లెవీస్, మేసీస్ వంటి పేరున్న బ్రాండ్లకు మోడల్‌గా ఆమె వ్యవహరించింది. 2016లో ఆమె మహిళగా ఉండడానికి ఒక పద్ధతి అంటూ ఉండదు (నో రాంగ్ వే టూ బి ఎ వుమన్) అంటూ క్యాంపెయిన్‌ని ప్రారంభించి బాడీ పాజిటివిటీని ప్రోత్సహించింది. అంతేకాదు.. తను ఎన్నో టెలివిజన్ షోలలో కూడా కనిపించింది.

3. కాండైస్ హఫ్ఫిన్

Instagram

34 సంవత్సరాల ప్లస్ సైజ్ మోడల్ కాండైస్. అంతకు ముందు టీనేజ్ బ్యూటీ క్వీన్. తన మొదటి మోడలింగ్ కాంట్రాక్ట్‌ని ఆమె 2000 సంవత్సరంలోనే ఒప్పుకుంది. హై ఫ్యాషన్ మోడల్స్‌లో తనకంటూ ఓ గొప్ప పేరు సంపాదించుకుంది. ఎన్నో సంవత్సరాలు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న ఆమె.. రన్ వే పై ఎంతో పేరున్న డిజైనర్ల దుస్తులను ధరించి నడవడం విశేషం.

4. ఇస్క్రా లారెన్స్

Instagram

ఇస్క్రా 28 సంవత్సరాల బ్రిటిష్ ప్లస్ సైజ్ మోడల్. 2016లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ పై నడిచి పేరు సాధించింది. అయితే అంతకు 13 సంవత్సరాలకు ముందే ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ ర్యాంప్ పై హొయలొలికించింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉపయోగించి బాడీ పాజిటివిటీని ప్రమోట్ చేసే.. ఎవ్రీబాడీవిత్ ఇస్క్రా అనే యూట్యూబ్ ఛానల్‌ని కూడా ఏర్పాటు చేసిన ఆమె.. అందులో వర్కవుట్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

5. టిండర్ బడేషా

Instagram

టిండర్ కేవలం మన దేశంలో గొప్ప పేరు సంపాదించుకున్న ప్లస్ సైజ్ మోడల్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించింది. అమెరికాలో ర్యాంప్ వాక్ చేసిన మొదటి ప్లస్ సైజ్ మోడల్ తను. తను వివిధ అంతర్జాతీయ బ్రాండ్ల క్యాంపెయిన్లలో పాల్గొని.. ఆ తర్వాత ర్యాంప్ పై నడిచి ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి పేరు సాధించింది. ప్లస్ సైజ్‌లో ఉండడం అనేది ఆలోచించాల్సిన విషయమే. అయితే అది శరీర తీరును బట్టి మాత్రం కాదు. ఎదుటివారు మనల్ని ఎలా చూస్తారన్న దాని గురించి మాత్రమే ఆలోచించాలి అంటుందామె.

6. అంజనా బాపట్

Instagram

ఇంతకుముందు ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేసిన ముంబైకి చెందిన అంజనా ఇప్పుడు ప్లస్ సైజ్ మోడల్‌గా పనిచేస్తోంది. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. మోడల్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేదట. తన కోరిక నెరవేర్చుకోవడానికి బరువు తగ్గడానికి ప్రయత్నించింది. కానీ ఆ తర్వాత తాను ఎలా ఉన్నా.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానని గుర్తించి తను తనలానే ఉన్నానని ఒప్పుకుంది. ఆ తర్వాత ఇక మోడలింగ్‌లో ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు.

7. నేహా పారుల్కర్

Instagram

నేహా తనని తాను ప్లస్ అండ్ ప్రైడ్‌గా చెప్పుకుంటుంది. తనో ప్లస్ సైజ్ మోడల్, బాడీ పాజిటివిటీ యాక్టివిస్ట్. లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసిన ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు.. మన దేశంలో ప్లస్ సైజ్ మోడల్స్ గురించి మాట్లాడే విషయంలో తను ముందుంటుంది. మోడలింగ్‌తో పాటు తన ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తోందామె. "ఫుల్ టైం మోడల్, ఇన్‌ఫ్లైయెన్సర్ గా ఉండడం నాక్కూడా ఇష్టమే. కానీ కేవలం దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించడం నాకు కష్టం.. అందుకే ఉద్యోగం చేస్తూ వాటిని కంటిన్యూ చేస్తున్నా" అంటుందామె.

8. నీలాక్షి సింగ్

Instagram

నీలాక్షి ఓ ఫ్యాషన్ బ్లాగర్. బాడీ పాజిటివిటీ యాక్టివిస్ట్, ప్లస్ సైజ్ మోడల్. తను హాఫ్ ఫుల్ కర్వ్ సంస్థ కోసం లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ పై నడిచింది. ఆరు సంవత్సరాల నుంచి మోడలింగ్ చేస్తున్న తను.. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కూడా బాడీ పాజిటివిటీని చాటడానికి ప్రయత్నిస్తుంటుంది.దీని గురించి మాట్లాడుతూ ఇంటర్నెట్లో చాలామంది ఎన్నో కామెంట్లు చేస్తుంటారు. కానీ నా గురించి మాత్రం అలా మాట్లాడకపోవడం నా అదృష్టం అని చెప్పుకోవాలి. నేను నా ఫాలోవర్ల గురించి తెలుసుకోవడానికి వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటా. వారికి నా వంతు సహాయం చేస్తుంటా. నాలాంటి వారిలో భయాలు, అసంతృప్తులు తొలగిస్తుంటా అని చెప్పింది నీలాక్షి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.