ప్రేమలోని లోతైన అర్థాన్ని తెలిపిన గీతం... "తలచి తలచి చూశా"..!

ప్రేమలోని లోతైన అర్థాన్ని తెలిపిన గీతం... "తలచి తలచి చూశా"..!

7/జి బృందావన్ కాలనీ సినిమా చూశారా.. అందులో ప్రముఖ గీత రచయిత శివ గణేష్ (sivaganesh) రాసిన "తలచి తలచి చూశా" పాట మీకు గుర్తుండే ఉంటుంది. ప్రేమలో ఎంతో లోతైన అర్థాన్ని తెలిపే గీతమది. ఒక ప్రియుడి విరహ వేదనకు.. ప్రేమ తన మనసులో రేపిన గాయానికి ప్రియుడు బాధతో తల్లడిల్లే వైనానికి ఆ గీతం దర్పణం పడుతుంది. శివగణేష్‌కు ఇలాంటి గీతాలు రాయడం కొత్త కాదు. అనేక డబ్బింగ్ సినిమాలకు పాటలు రాసిన అనుభవం తనకుంది. 

హైదరాబాద్ ప్రాంతంలో పుట్టినా కూడా.. ఎక్కువకాలం చెన్నైలోనే ఆయన గడిపారు. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించినా కూడా.. సినీ పరిశ్రమ పై మక్కువతో ఇదే రంగంలో స్థిరపడడానికి ప్రయత్నించారు. ఒకే ఒక్కడు చిత్రానికి ఆయన రాసిన "నెల్లూరి నెరజాణ" తనకు మంచి పేరు తీసుకువచ్చింది. అంతకు ముందే ఆయన జీన్స్, ప్రేమికుల రోజు, నరసింహా లాంటి సినిమాలలో పాటలు రాశారు. ప్రేమ పాటలను మనకు హత్తుకొనేలా రాయడంలో శివ గణేష్ దిట్ట.

ఎంతవాడు గానీ, ఉల్లాసంగా, బ్రహ్మచారి, లవర్స్‌ డే..  మొదలైన సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు. ఏడు భాషల్లో అనర్గళంగా మాట్లడగలిగే శివ గణేష్.. సంస్కృతంలో కూడా ఎన్నో భక్తి గీతాలు రాశారు. తెలుగు (telugu), తమిళ, కన్నడ.. ఇలా అన్ని చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలను ఆయన రాశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం గ్రామం ఆయన సొంతవూరు.

ఈ రోజు గుండెపోటు రావడం వల్ల.. హైదరాబాద్‌లోనే శివగణేష్ తన తుది శ్వాస విడిచారు.  శివగణేష్ కుమారుడు సుహాస్ కూడా ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో గేయ రచయితగా రాణిస్తున్నారు. ఎక్కువగా శ్రీ సూర్య మూవీస్ సంస్థ చిత్రాలకు శివ గణేష్ పాటలను అందించారు. అయితే ఈ సినిమాలలో ఆయన పేరుతో పాటు.. సంయుక్తంగా ఏ.ఎం.రత్నం పేరు కూడా గేయ రచయితగా క్రెడిట్స్‌లో ఉండడం గమనార్హం.

తలచి తలచి చూశా (పాట పూర్తి లిరిక్స్)

తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకొంటిని
తెరిచి చూసి చదువువేళా
కాలి పోయే లేఖ బాలా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకోంటి నీ

కొలువు తీరు తరువుల నీడ
నిన్ను అడిగే ఏమని తెలుప
రాలిపోయినా పూల మౌనమా
ఆ… రాక తెలుపు మువ్వల సడిని
దారులడిగె ఏమని తెలుప
పగిలిపోయిన గాజులు పలుకునా
ఆ… అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ
వొడిన వాలి కధలను తెలుప
సఖియ నేడు ఏదీ
తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరేలే

తలచి తలచి చూశా
వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటినీ
ఓ... నీలో నన్ను చూసుకోంతినీ

మధురమైన మాటలు ఎన్నో
మారుమ్రోగె చెవిలో నిత్యం
కట్టే కాలు మాటే కాలునా
ఆ… చెరిగి పోనీ చూపులు నన్ను
ప్రశ్నలదిగే రేయి పగలు
ప్రాణం పోవు రూపం పోవునా
ఆ… వెంట వచ్చు నీడ కూడా
మంట కలిసి పోవు
కళ్ళ ముందు సాక్షాలున్నా
నమ్మ లేదు నేను
ఒక సారి కనిపిస్తావనీ నే బ్రతికే ఉంటినీ

ఇవి కూడా చదవండి

సంగీతం నుండి నటన వైపు.. (నాడు ఎస్పీ బాలు, ఆర్పీ పట్నాయక్.. నేడు రఘు కుంచె)

ఈ దేశ‌భ‌క్తి పాట‌లు వింటే.. మిమ్మల్ని మీరే మైమ‌రచిపోతారు..!

"మదర్స్ డే" సందర్భంగా.. అమ్మ ప్రేమను తెలిపే సినీ గీతాలు మీకోసం