మీ పేరును బట్టి.. మీరెంత రొమాంటిక్ అనేది చెప్పేస్తాం.. వింటారా..?

మీ పేరును బట్టి.. మీరెంత రొమాంటిక్ అనేది చెప్పేస్తాం.. వింటారా..?

మన పేరును (Name) బట్టి మన లక్ ఆధారపడి ఉంటుందని చెబుతుంది న్యూమరాలజీ (numerology).. ఈ శాస్త్రం ప్రకారం మన పేరే కాదు.. పేరులోని మొదటి అక్షరం కూడా మన జీవితం ఎలా ఉంటుందో చెప్పేస్తుందట.

అవును.. దీన్ని ప్రకారం మన పేరులోని మొదటి అక్షరం ద్వారా మన ఇష్టాలు, అయిష్టాలు, స్వభావం.. వంటివి తెలుస్తాయట. అలాగే ప్రేమ పట్ల మీ వ్యవహార శైలి వంటివి కూడా అంచనా వేయవచ్చంట. ఇంగ్లిష్ అక్షరాల్లో ఏ నుంచి జడ్ వరకూ చూస్తే.. ఒక్కో అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఒక్కోలా ప్రవర్తిస్తారట. అయితే ప్రేమ విషయంలో నమ్మకంగా ఉండే వ్యక్తుల కోసం మీరు వెతుకుతుంటే మాత్రం.. కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారిని మీరు లిస్టులో నం. 1 స్థానంలో ఉంచడం మంచిది.

ఎందుకంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా నమ్మకంగా ఉంటారట. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ జీవిత భాగస్వామి తోడు వదలరు.. వారిని మోసం చేయరు. మరి, ఆ వ్యక్తులు ఎవరో.. ఎలాంటివారో తెలుసుకుందాం రండి.

facebook

బి ( B) అక్షరం తో పేరు మొదలయ్యేవారు

B అక్షరంతో తమ పేరు మొదలయ్యే వ్యక్తులు.. మెదడు కంటే మనసు మాటే ఎక్కువగా వింటారట. ఒకవేళ ఇలాంటి వారు మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెడితే.. వీరు మొదటి రోజులోనే మీతో జీవితం మొత్తం ప్లాన్ చేసుకుంటారు. అంతేకాదు.. ప్రేమించుకొని కొన్నాళ్లపాటు తిరగాలి అన్న కోరికలు వీళ్లకు ఉండవు. అందుకే నేరుగా పెళ్లి చేసుకోవడానికే వీళ్లు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు.

ఇలాంటివారు తమ భాగస్వామి, కుటుంబం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్లకు ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ. ప్రేమిస్తే చాలా లోతుగా ప్రేమిస్తారు. అంతేకాదు.. వీరికి జాలి కూడా ఎక్కువే. వీరు ప్రేమ విషయంలో ఇలా ఉన్నా.. మిగిలిన విషయాల్లో అన్నీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. కలలో కాకుండా నిజ జీవితంలా ఆలోచించి నిర్ణయించుకుంటారు.

ఐ (I) అక్షరం తో పేరు మొదలయ్యేవారు

I అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుందట. తమ మనసులో ఉన్న ప్రేమను కేవలం.. మనసైన వారికి మాత్రమే తెలియజేస్తారట. అందరి ముందు తమ ప్రేమను చూపడం, ఇతరులు చూస్తున్నారని నటించడం వీరికి తెలీదు. అయితే తాము ప్రేమించిన వారి కోరికను నెరవేర్చేందుకు.. వీళ్లు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. వీళ్లు ఎవరిని ప్రేమించినా చాలా గాఢంగా ప్రేమిస్తుంటారు. వీళ్లు తమ వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని వేర్వేరుగా చూస్తారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు భాగస్వాములకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు.

facebook

జె ( J) అక్షరం తో పేరు మొదలయ్యేవారు

J అక్షరంతో పేరు మొదలయ్యే వారు.. తమ భాగస్వామి గురించి అన్నివేళలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని వేళలా వారిని పట్టించుకుంటూ.. వారిని సంతోషంగా చూసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అలాగే తరచూ గిఫ్టులు ఇస్తూ డేట్ నైట్స్‌కి తీసుకువెళ్తుండడం చేస్తుంటారట. ఈ వ్యక్తులు తమ ప్రేమను మాటల్లో కంటే చేతల్లో చూపేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అంతేకాదు.. తాము తమ భాగస్వామి పట్ల చూపించే ప్రేమ పట్ల వీళ్లు చాలా ఆనందంగా, గర్వంగా ఫీలవుతుంటారు. వీళ్లు తమ ఆనందం కంటే తమ భాగస్వామి ఆనందం గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారంటే అతిశయోక్తి కాదు.

పి ( P) అక్షరం తో పేరు మొదలయ్యేవారు

P అక్షరంతో పేరు మొదలయ్యే వారు.. తాము ఇష్టపడిన వ్యక్తిని ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తుంటారు. వీళ్లు ప్రేమను, ప్రేమించినవాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి చూడరు. ఒకవేళ వీళ్లు మిమ్మల్ని ప్రేమిస్తుంటే.. మిమ్మల్ని చాలా ఆనందంగా చూసుకుంటారు. అంతేకాదు.. ఒకవేళ వీళ్లు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే.. మీకు తోడుగా నిలుస్తారు. మీరు మాత్రమే కాదు.. మీ కుటుంబం, మీ స్నేహితులు.. ఇలా మీకు సంబంధించిన ప్రతి విషయం గురించి వీళ్లు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారట. వీళ్లు ప్రేమిస్తున్నానని చెప్పకపోయినా సరే.. వాళ్లు మీపై చూపే ప్రత్యేక శ్రద్దను చూసి మీకు వారి ప్రేమ విషయం తెలిసిపోతుంది.

టి (T) అక్షరం తో పేరు మొదలయ్యేవారు

T అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ ఎవరూ బాధపడుతుంటే చూడలేరు. వీళ్లు ప్రేమించిన వాళ్లను ఎప్పటికీ ఒంటరిగా వదిలేయరు. అది ఎలాంటి సందర్భమైనా సరే. వాళ్లకు తోడుగా నిలుస్తారు. అంతేకాదు.. వీళ్లు చాలా అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవారు. మీరు మీ మనసులో ఏముందో చెప్పకపోయినా మీ ఫీలింగ్స్‌ని గ్రహించి దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంటారు. అంతేకాదు.. వారి మనసులోని భావాలను కూడా తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. వీరి ప్రేమంతా వీరి కళ్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. వీళ్లు అన్ని విషయాల్లోనూ చాలా పద్ధతిగా నడుచుకుంటారు. ప్రేమను వెల్లడించే విషయంలో కూడా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.