తండ్రీ, కొడుకులతో.. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్స్ వీరే..!

తండ్రీ, కొడుకులతో.. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్స్ వీరే..!

మన భారతీయ చిత్ర పరిశ్రమలో వారసత్వం కొనసాగుతుందనేది ఎవరూ కాదనలేని విషయం. ప్రముఖ హీరోలుగా పేరు గడించిన వారి వారసులు సైతం హీరోలుగానే కొనసాగుతారు. ఫ్యాన్స్ కూడా తమ హీరో కొడుకు కూడా హీరో (hero) కావాలనే కోరుకుంటారు.

అలాగే స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్సే (Actresses) నటిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తండ్రి పక్కన హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. మళ్లీ కొడుకుతో కథానాయికగా  నటించడం.. అలాగే కొడుకుతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన కథానాయిక.. మళ్లీ తండ్రి సరసన హీరోయిన్‌గా నటించే సందర్భాలు కూడా అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి.

తెలుగులో కూడా.. తండ్రీకొడుకులతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం అంటే తొలుత గుర్తొచ్చేవి నందమూరి, అక్కినేని, కొణిదెల కుటుంబాలే. ఈ క్రమంలో మనం కూడా  ఏ హీరోయిన్.. ఏ తండ్రీ, కొడుకులతో కలసి నటించిందో ఓసారి తెలుసుకుందామా..

కాజల్

Instagram

టాలీవుడ్ దివా కాజల్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించి.. వీరిద్దరితోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. రామ్ చరణ్ సరసన మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో ఆమె నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా "ఖైదీ నెం 150"లో ఆయన సరసన ఆడి పాడి అలరించింది.

రకుల్ ప్రీత్

Instagram

ప్రస్తుత జనరేషన్‌లో ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఎక్కువగా ఉన్న కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె నాగార్జున, ఆయన కొడుకు నాగ చైతన్య.. ఇద్దరి సరసన కూడా హీరోయిన్‌గా నటించింది. నాగ చైతన్య సరసన "రారండోయ్ వేడుక చూద్దాం " సినిమాలో  రకుల్ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా "మన్మథుడు – 2"లో నాగ్ సరసన హీరోయిన్‌గా కూడా ఆమె ఆడి పాడింది.  ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది.

లావణ్య త్రిపాఠి

Instagram

అక్కినేని తండ్రీ కొడుకుల సరసన నటించిన మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తొలుత నాగ్ సరసన "సోగ్గాడే చిన్ని నాయన" సినిమాలో నటించింది లావణ్య. ఆ తర్వాత "యుద్ధం శరణం" సినిమాలో నాగ చైతన్య సరసన ఆడిపాడింది.

శ్రీదేవి

Movie still

అతిలోక సుందరి శ్రీదేవి కూడా తెలుగులో తండ్రీకొడుకుల సరసన నటించి మెప్పించింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు నాగార్జున సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రేమాభిషేకం, బంగారు కానుక, ముద్దుల మొగుడు, సత్యం శివం, ప్రేమ కానుక, శ్రీరంగనీతులు సినిమాల్లో అక్కినేని నాగేశరరావు పక్కన నటించింది శ్రీదేవి. అలాగే నాగార్జున సరసన హీరోయిన్‌గా ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాల్లో నటించింది. నాగ్, శ్రీదేవి హిందీ సినిమాల్లోనూ కలిసి నటించారు. గ్రేట్ రాబరీ, మిస్టర్ బెచరా, ఖుదా గవా సినిమాల్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు.

రాధ

ఈమె కూడా అక్కినేని వంశానికి చెందిన తండ్రీకొడుకులతో కలసి సినిమాల్లో నటించిన కథానాయికల జాబితాలో ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున సరసన నటించిన హీరోయిన్లలో రాధ కూడా ఒకరు. తండ్రి నాగేశ్వరరావు సరసన గోపాలకృష్ణుడు, వసంతగీతం, ఆదర్శవంతుడు సినిమాల్లో రాధ నటించింది. కొడుకు నాగార్జున సరసన "విక్కీ దాదా" కూడా నటించి తనకు సరైన జోడీగా మెప్పించింది.

రాధ నందమూరి తండ్రీ,కొడుకులతోనూ నటించింది. ఎన్టీఆర్ సరసన చండశాసనుడి సినిమాలో కథానాయికగా నటించిన రాధ, ఆయన కొడుకు బాలయ్య సరసన కూడా హీరోయిన్‌గా చేసింది. తండ్రి సరసన ఒక సినిమాలో మాత్రమే నటించిన రాధ.. కొడుకు సరసన మాత్రం ఆరు సినిమాల్లో నటించింది. నిప్పులాంటి మనిషి, ముద్దుల క్రిష్ణయ్య, రక్తాభిషేకం, కలియుగ కృష్ణుడు, రాముడు - భీముడు, దొంగ రాముడు సినిమాల్లో నటించింది.

తమన్నా

Movie Still

తమన్నా కూడా నాగార్జున, నాగచైతన్యలతో కలసి విడివిడిగా సినిమాలు చేసింది. అయితే కొడుకుతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన తమన్నా.. తండ్రి సరసన సహాయకురాలిగా కనిపించింది. నాగ చైతన్యతో కలసి 100 పర్సెంట్ లవ్, తడాఖా సినిమాల్లో నటించిన తమన్నా, నాగార్జునతో కలసి "ఊపిరి" సినిమాలో నటించింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది