ADVERTISEMENT
home / Food & Nightlife
మీరు సమోసా ప్రియులా.. అయితే ఈ టాప్ 10 స్పెషల్స్ వెంటనే టేస్ట్ చేసేయండి..!

మీరు సమోసా ప్రియులా.. అయితే ఈ టాప్ 10 స్పెషల్స్ వెంటనే టేస్ట్ చేసేయండి..!

సమోసాలంటే (samosa) పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఎంతో ఇష్టం. భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు దొరికే  స్నాక్స్ ఏవైనా ఉన్నాయంటే.. అవి సమోసాలు మాత్రమే. ఇండియన్ వంటకం అయినా కూడా.. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో స్థానంలో సంపాదించుకున్న అరుదైన హాట్ రెసిపీ “సమోసా”. భారత ఉపఖండంతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం సమోసా. “సంబోస్గ్” అనే పర్షియన్ పదం నుండి సమోసా పుట్టింది. 

9వ శతాబ్దంలో పర్షియన్ కవి ఇషక్ అల్ మవ్‌స్లీ రచనల్లో సమోసా ప్రస్తావన కనిపించింది. అంటే.. ఆ కాలం నుండే ఈ వంటకం అందుబాటులో ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. తొలుత నాన్ వెజ్ సమోసాలు కూడా తయారుచేసేవారట. తర్వాత కూరగాయలు.. ముఖ్యంగా బంగాళాదుంపలతో సమోసాలు చేయడం ఆనవాయతీగా రాసాగింది. మీకో విషయం తెలుసా..? ప్రముఖ ముస్లిం చక్రవర్తి మహ్మద్ బిన్ తుగ్లక్‌కు నచ్చిన వంటకాల్లో సమోసా ముందు స్థానంలో ఉంటుందట.

ఏంటీ.. సమోసాకి ఇంత చరిత్ర ఉందని అనుకుంటున్నారా..? పైగా.. ఈ కథనం చదువుతుంటే మీకు కూడా రుచికరమైన సమోసాలు తినేయాలని అనిపిస్తుందా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. మీకోసమే మేము టాప్ 10 సమోసా రెసిపీలను ప్రత్యేకంగా అందిస్తున్నాం.. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!

చోలే సమోసా – సాధారణంగా మనం సమోసాల్లో బాగా ఫ్రై చేసి ముద్దగా చేసిన బంగాళాాదుంపలను కూరి.. తర్వాత మళ్లీ నూనెలో వేయిస్తాం. కానీ కేవలం ఆలూ మాత్రమే కాకుండా ఆ మిశ్రమంలో బఠానీలు లేదా శనగలను కూడా కలిపి మిక్స్ చేసి వేయిస్తే.. అది చోలే సమోసా అవుతుంది. 

ADVERTISEMENT

జామ్ సమోసా –  కొన్ని అరబ్ దేశాలలో ఇప్పటికీ జామ్ సమోసా బాగా ఫేమస్. మనం బంగాళదుంప మిశ్రమాన్ని వాడితే.. వారు తియ్యటి జామ్‌ను మిశ్రమంగా వాడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో రకం స్వీట్ సమోసా.

చైనీస్ సమోసా: మనం రెగ్యులర్‌గా వాడే సమోసాల్లో వాడే బంగాళదుంప మిశ్రమానికి బదులు.. నూడిల్స్ లేదా చౌమీన్‌ను సమోసాల్లో వాడితే.. అదే చైనీస్ సమోసా.

ఫిష్ సమోసా –  సమోసాల్లో బాగా ఫ్రై చేసిన చేప ముక్కలను కలిపి మిక్స్ చేస్తే.. అది ఫిష్ సమోసా అవుతుంది. ఇందులో బాగా మసాలా దట్టించిన మిశ్రమాన్ని కలిపితే.. రుచి ఇంకా మెరుగ్గా ఉంటుంది. 

కీమా సమోసా – నాన్ వెజ్ ప్రియులకు బాగా ఇష్టమైన సమోసా “కీమా సమోసా”. రంజాన్ మాసంలో ముస్లిములు ఈ సమోసాలను స్నాక్స్‌గా ఎక్కువగా తింటుంటారు. 

ADVERTISEMENT

చీజ్ సమోసా : మూమూలుగా కార్న్, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కలిపిన మిశ్రమానికి.. కొంచెం ఎక్కువగా చీజ్ అద్దితే.. మీరు ఆ రుచి కచ్చితంగా మర్చిపోలేరు. ఉత్తరాదిలో చీజ్ సమోసా చాలా ఫేమస్. 

ఉల్లిపాయ సమోసా – ఈ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే సమోసా ఉల్లిపాయ సమోసా. కేవలం రూ. 3 ధరకే ఇది అన్నీ బస్తీల్లోనూ దొరుకుతుంది. కేవలం ఉల్లిపాయలను మాత్రమే బాగా వేయించి.. చిన్న చిన్న సమోసాలుగా చేసి అందిస్తుంటారు. 

ఎగ్ సమోసా – మీరు ఎగ్ బొండా గురించి విన్నారా..? అయితే దానికి ప్రత్యమ్నాయమే ఎగ్ సమోసా. ఉడికించిన కోడి గుడ్డు మిశ్రమానికి మసాలా అద్ది.. బంగాళాదుంపలకు బదులుగా ఈ సమోసాలో వాడతారు. 

చికెన్ సమోసా – బాగా కడిగిన బోన్‌లెస్ చికెన్‌‌ను బాాగా ఫ్రై చేశాక.. మసాలా అద్ది.. సమోసాలో మిశ్రమంగా వాడితే.. చాలా డిఫరెంట్ రుచిని మీరు చూడడం జరుగుతుంది. 

ADVERTISEMENT

ఇంకా అనేక రకాలు – ప్రయోగాలు చేయాలే గానీ.. సమోసాల్లో ఇంకా అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. క్యారెట్ సమోసా, బీట్రూట్ సమోసా, గోబీ సమోసా, మష్రూమ్ సమోసా.. ఇలా మిశ్రమం ఒక్కటే మారుతుంది. కానీ వీటిని సమోసా మాదిరిగా తినడంలో ఉన్న ఫీలింగ్ ఉంది చూడండి.. నిజంగానే సూపరో సూపర్ అని చెప్పవచ్చు.

Featured Image: Instagram.com/JuiceNRolls and Instagram.com/DesiTreatIndia

ఇవి కూడా చదవండి

హైదరాబాదీ బిర్యానికి.. గట్టి పోటీ ఇస్తున్న మండి రైస్ ..!

ADVERTISEMENT

భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యార‌డైజ్ బిర్యానీ

 

16 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT