బిగ్ బాస్ తెలుగు: జైలుకి వెళ్లిన వరుణ్ సందేశ్ & తమన్నా

బిగ్ బాస్ తెలుగు: జైలుకి వెళ్లిన వరుణ్ సందేశ్ & తమన్నా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu Season 3 ) రోజురోజుకి ప్రేక్షకుల ఆసక్తిని చూరగొంటోంది. ప్రస్తుతం రెండవ వారంలోకి ఎంటరైన ఈ షోలో.. ప్రతి ఎపిసోడ్‌ ఏదో ఒక అంశాన్ని హైలైట్ చేస్తూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్‌లో వరుణ్ సందేశ్  (Varun Sandesh) - శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క మధ్య జరిగిన వాదన చిత్రంగా సాగింది. అలాగే.. ఎపిసోడ్ చివరికి వరుణ్ సందేశ్ జైలుకి వెళ్ళడం మరో హైలైట్‌.

బిగ్ బాస్ తెలుగు: తమన్నా గేమ్ 'ప్లాన్స్'..!

ఇంతకీ నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిందేంటంటే -

ఇంటికి ముఖ్య అవసరాలైన నీరు, గ్యాస్, ఇంటిలోకి వెళ్ళేందుకు తలుపులు సక్రమంగా పనిచేయాలంటే ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన మూడు సైకిల్స్‌ని నిరంతరం తొక్కుతూ ఉండాలని బిగ్ బాస్ చెప్పడం విశేషం. ఇదే లగ్జరీ బడ్జెట్ టాస్క్ కూడా. ఈ టాస్క్‌కు సంబంధించిన లెవెల్ 2 నిన్న మొదలైంది. ఆ లెవెల్ 2 లో మొత్తం మూడు టాస్క్‌లు ఉండగా అందులో ఒకటి - బిగ్ బాస్ చెప్పేంత వరకు దీపం కొండెక్కకుండా చూసుకోవడం. అయితే ఈ టాస్క్‌ని గార్డెన్ ఏరియాలో చేయాల్సిందిగా.. బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

ఈ టాస్క్ చేయడానికి మహేష్ విట్టాని ఇంటి సభ్యులు ఎంపిక చేయడం.. అలాగే ఆ టాస్క్ చేయడానికి సంబంధించి శివ జ్యోతి చెప్పిన జాగ్రత్తలని బిగ్ బాస్ త్రోసిపుచ్చడం జరిగింది. దానికి అక్కడే ఉన్న వరుణ్ సందేశ్ చప్పట్లు కొట్టడంతో.. శివ జ్యోతి తన మాటలని వెక్కిరించినట్టుగా తీసుకుని బాధపడింది. దాంతో తోటి సభ్యులు ఆమెను ఓదార్చారు. అయితే తాను సరదాగా చప్పట్లు కొట్టాను తప్ప.. ఎగతాళి చేయడానికి కాదని వరుణ్ వివరణ ఇచ్చారు.  శివజ్యోతి చెప్పిన జాగ్రత్తలు తనతో పాటు.. చాలా మందికి నచ్చలేదని తెలిపారు.

ఇదిలావుండగా 'లెవెల్ 2'లో రెండవ టాస్క్ ఏంటంటే - ఇంటి సభ్యులలో ఇద్దరు గోడకి 100 పిడకలు కొట్టాలి. అయితే ఆ టాస్క్‌ని శ్రీముఖి, అలీ రెజాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇక లెవెల్ 2 లో మూడవ టాస్క్ కాస్త డిఫరెంట్‌గా సాగింది. ఈ టాస్క్‌లో చేప పిల్లలు ఉన్న ట్యాంక్‌లో నుండి 50 కాయిన్స్‌ను.. చేతులతో బయటకు తీయాల్సి ఉంటుంది.  ఈ టాస్క్‌లో తొలుత వరుణ్ సందేశ్ పాల్గొనాలని భావించినా.. చివరికి వితిక పాల్గొనడం.. ఆ టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.

బిగ్‌బాస్ తెలుగు: వరుణ్ సందేశ్ పై.. వితిక అలగడానికి అసలు కారణం ఇదేనా!

ఇక 'టాస్క్ 1'ని కూడా మహేష్ విట్టా విజయవంతంగా పూర్తిచేశారు. బిగ్‌బాస్ చెప్పేంత వరకు దీపం ఆరనివ్వకుండా ఉంచారు కాబట్టి.. ఆ టాస్క్ సైతం సక్సెస్ ఫుల్‌గా పూర్తయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. ఇకపై ఇంటి సభ్యులకి గ్యాస్, నీరు, ఇంటి తలుపుల సౌకర్య విషయంలో.. ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేశారు.

మొత్తం టాస్క్ పూర్తయ్యాక...  ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా.. సరిగా ఆడని ఇద్దరిని ఎంపిక చేసి చెప్పమని హౌస్ సభ్యులను బిగ్ బాస్ ఆదేశించారు. దానికి స్వతంత్రంగా వరుణ్ సందేశ్ & తమన్నా సింహాద్రిలు ముందుకు రాగా.. ఆ ఇరువురికి బిగ్‌బాస్ జైలుశిక్షను విధించారు.

ఇక శిక్షలో భాగంగా జైలులోకి వెళ్ళగానే "తాను టాస్క్‌లో పాల్గొనడానికి ప్రయత్నించానని.. అయితే తనకి అవకాశం రాలేదు కాబట్టే.. ఇలా చేయలేకపోయాను" అని కంటతడి పెట్టింది తమన్నా (Tamanna). అలాగే వరుణ్ సందేశ్ మాత్రం.. ఈ ఎపిసోడ్ మొత్తంలో చాలా డిస్టర్బ్‌గా ఉన్నట్టుగానే కనిపించారు.

ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులంతా జంబలకిడిపంబ గెటప్స్‌లో మనకి దర్శనమిస్తున్నారు. అలాగే వీరు పవర్ కోసం బిగ్ బాస్ నిర్వహించే టాస్క్‌లో పాల్గొంటున్నారనే విషయం ప్రోమోస్‌లో తెలుస్తోంది. ఏదేమైనా.. నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో.. వరుణ్ సందేశ్ ఎక్కువగా లైమ్ లైట్ తీసుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?