ADVERTISEMENT
home / Family
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు (pelli roju subhakankshalu) ఇలా చెప్పండి

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు (pelli roju subhakankshalu) ఇలా చెప్పండి

మన జీవితాల్లో ఏర్పడే అనేక బంధాల్లో ముఖ్యమైంది వివాహ బంధం. ఇద్దరు వ్యక్తులు వివాహం అనే బంధంతో ఏకమై తద్వారా వారు ఒక కుటుంబాన్ని ఈ సమాజానికి అందివ్వడం అనేది చాలా గొప్ప అంశం. అందుకే వివాహ బంధం పై మనకు ఉన్న నమ్మకం రోజురోజుకీ క్రమంగా పెరుగుతూనే ఉంటుంది.

ఇక మన భారతదేశంలో అయితే ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థని బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే వారు విశ్వసించడమే కాకుండా దానిని పాటిస్తున్నారు కూడా. కాకపోతే ఈ మధ్యకాలంలో విడాకుల శాతం పెరుగుతున్న వేళ దాదాపు 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు & 50 ఏళ్ళు వివాహ బంధంలో ఉన్న వారు వారికి వివాహ బంధాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.

ఈ తరుణంలో మన కుటుంబంలో వివాహ బంధం ద్వారా ఒకటైన వారికి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఇక్కడ కొన్ని సందేశాలు ఇస్తున్నాం. ప్రస్తుత తరుణంలో ప్రతి చిన్న అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా గడిపేందుకు అంతా ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మనకు తెలిసినవారు, స్నేహితులు లేదా బంధువుల పెళ్లి రోజు వచ్చినప్పుడు వారికి మీరు పంపదగిన విధంగా కొన్ని సందేశాలు, శుభాకాంక్షలు చూద్దాం..

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ (Friendship Day Gift Ideas In Telugu)

ADVERTISEMENT

మీరు కూడా మీ ప్రియమైన వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి ఈ క్రింద ఉన్న వాటిలో మీకు నచ్చినదాన్ని ఉపయాగించుకోవచ్చు.

మరింకెందుకు ఆలస్యం ఒకసారి చదివేయండి.

కొడుకుకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  1. కోడలిని & నిన్ను సంతోషంగా చూసాక… నేను & నాన్న చాలా సంతోషంగా ఉన్నాము. మీరిరువురు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాము.
  2. నా ఇంటికి కోడలి రూపంలో మరో కూతురిని తీసుకువచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పెళ్లి రోజులు మీరు ఇంకా చాలా జరుపుకోవాలని మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
  3. నిన్ను & కోడలిని చూస్తుంటే మంచి అవగాహన ఉన్న దంపతుల లాగా కనిపిస్తున్నారు. ఇక ముందు కూడా ఇటువంటి అవగాహనతోనే ముందుకి సాగిపోవాలని కోరుకుంటూ మీకు pelli roju subhakanshalu తెలియచేస్తున్నాము.
  4. నువ్వు ఎప్పుడూ హాయిగా భార్య పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
  5. ఇప్పటివరకు ఒక మంచి కొడుకుగా ఉన్నావు. ఇక పైన ఒక మంచి భర్త & తండ్రిగా ఉంటావు అని ఆశిస్తూ నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నాము.

    ఇవి మీ కొడుకు వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

 

ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

ADVERTISEMENT

కొడుకుకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

HappyWishes.net

  1. నీ ప్రేమ పెళ్లి పుణ్యమా అని మాకొక అల్లుడు రూపంలో ఉన్న కొడుకుని ఇచ్చావు. అందుకు ముందుగా థ్యాంక్స్ & అలాగే మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా…
  2. మన ఇంట్లో ఎలా అయితే మంచిగా మెలిగావో అలాగే అత్తవారింట్లో కూడా అంతే మంచి పేరు తెచ్చుకుంటున్నావు. ఇంతకన్నా ఒక తల్లిగా నాకు ఇంకేం ఆనందం ఉంటుంది. ఈ ఆనంద సమయంలో నీకు & అల్లుడికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  3. నాతోనే కాదు.. మీ మామగారితో కూడా నాకు కోడలు కాదు కూతురు అని అనిపించుకునేంతలా ఒదిగిపోయిన నిన్ను చూసి గర్విస్తున్నాను తల్లి. ఇంతటి ఆనందంలో మీ జంటకి pelli roju subhakankshalu తెలియచేస్తున్నాను.
  4. నువ్వు ఆనందంగా ఉండడం చూసి, పెళ్లితో నువ్వు మాకు దూరమయ్యావు అని బాధలేకుండా పోయింది. నువ్విలానే ఎప్పటికి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  5. ఈ రోజుకి నీకు పెళ్లి జరిగి అప్పుడే అయిదేళ్ళు అయిపొయింది అంటే నమ్మబుద్ది కావడం లేదు. నువ్వు నా కళ్ళముందే ఉంటున్నావు కాబట్టి నాకు సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. నువ్వు & అల్లుడు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    ఇవి మీ కూతురి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

కూతురికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

ADVERTISEMENT

Google

  1.  అవధులు లేని ప్రేమానురాగాలతో … మీ వైవాహిక జీవితం సాగిపోవాలని కోరుకుంటూ.. అమ్మానాన్నకి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  2. మా జంటకి ఎల్లప్పుడూ స్పూర్తినిస్తూ.. జీవితంలో సమస్యలని ఒకటిగా ఎలా ఎదుర్కోవాలి.. అనేది మీ ఇద్దరి నుంచే నేర్చుకోగలిగాము. మీలాంటి స్ఫూర్తివంతమైన జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  3. పెళ్లి చేసుకున్న తరువాత ఎదురయ్యే ఎన్నో అవాంతరాలను మీరిరువురూ అధిగమించిన విధానం మీ పిల్లలమైన మాకు స్ఫూర్తిగా నిలిచింది. ఎన్నో మంచి విషయాలను మాతో పంచుకున్న మీ ఇద్దరికీ హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  4.  పెళ్లికి ముందుగా కావాల్సింది నమ్మకం అని మీరు చెప్పిన మాట అక్షర సత్యం. అలా చెప్పడమే కాకుండా దానిని పాటిస్తోన్న మీ జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  5. మన కుటుంబంలో ఉన్న అన్ని జంటల్లో మీదే ఆదర్శమైన జంట అని పేరు తెచ్చుకున్న గొప్ప జంట మీరు. అటువంటి మీ జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

    ఇవి మీ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

తల్లిదండ్రులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

Legenddetails.blogspot.com

  1. ఎన్ని సంవత్సరాలు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ … నాన్నమ్మ & తాతయ్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  2. సంసారం అనే ఒక చదరంగంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ముందుకి సాగిపోతున్న ‘అమ్మమ్మ & తాతయ్య’కి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  3. మా అమ్మానాన్నలను సరైన దారిలో ప్రోత్సహించడమే కాకూండా వారి పిల్లలమైన మమ్మల్ని కూడా మంచి దారిలో నడిపిస్తున్న నాన్నమ్మ & తాతయ్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  4. మీ వైవాహిక జీవితంలో మరో వసంతం నిండిన సందర్భంగా ఆదర్శ దంపతులైన మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  5. నాయనమ్మ & తాతయ్య లేకపోతే మా బాల్యం నిస్సారంగా ఉండేది. కానీ ఈ ఇద్దరు మా అక్కచెల్లెలని ఎంతో చక్కగా పెంచి పెద్ద చేశారు. అటువంటి ఆత్మీయ దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ఇవి మీ అమ్మమ్మ/నాన్నమ్మ & తాతయ్య వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

అమ్మమ్మ/నాన్నమ్మ & తాతయ్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  1. మీ జంట మధ్య ఉన్న ప్రేమ ఎల్లప్పుడూ మీ ఇరువురికి సాంత్వనతో పాటు మంచి జీవితాన్ని కూడా ఇవ్వాలని నీ స్నేహితుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
  2. ఒరేయ్! నేను చూసిన భార్యభర్తలలో మీ జంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది. అంతటి మంచి జంట అయిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  3. స్నేహితులుగా మొదలైన మీరు ఆ తరువాత జంటగా మారారు. స్నేహం & ప్రేమ కలిసి ఉన్న మీ బంధం ఎప్పటికి ఇలానే ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
  4. నీ వైవాహిక జీవితం ఇప్పటిలాగే ఎప్పుడూ కూడా ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ నీకు & నీ భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  5. మీ వివాహ జీవితం ముగింపు లేకుండా సాగిపోవాలని నీ స్నేహితుడిగా నేను కోరుకుంటూ మీ ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  6. నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి రోజు సందర్భంగా మీ జంటకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  7. నా ప్రాణ స్నేహితుడికి అతని పెళ్లి రోజు సందర్భంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  8. నా కోసం ఏదైనా చేసే స్నేహితుడు ఒక ఇంటి వాడవుతున్న సందర్భంగా వాడి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  9. ప్రియమైన స్నేహితురాలికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  10. మన ఫ్రెండ్స్ గ్రూప్ లో మొట్టమొదట పెళ్లి పీటలు ఎక్కిన నీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

    ఇవి మీ స్నేహితుడి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!

ADVERTISEMENT

స్నేహితుడికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

www.teluguquotez.in

  1. మీ దంపతులిద్దరికీ మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  2. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు మీ ఇద్దరి జంట ఒక మంచి ఉదాహరణ అని చెప్పాలి. అటువంటి ఆదర్శ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  3. గొడవపడిన అనేకమంది జంటలకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ కలిపిన మీ ఇద్దరికీ “పెళ్లి రోజు శుభాకాంక్షలు”.
  4. పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ బంధాన్ని సరైన దారిలో నడుపుకుంటున్న మీ దంపతులకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  5. మీ వైవాహిక జీవితంలో సంతోషం, ప్రేమ & ఆనందం సంవృద్ధిగా ఉండాలి అని కోరుకుంటూ మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  6. మన కుటుంబంలో చూడచక్కని జంటగా పిలవబడే మీకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  7. ప్రేమను ఇంకొక మెట్టు ఎక్కించి పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  8. మన ఫ్రెండ్స్‌లో మీరిద్దరూ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి రోల్ మోడల్‌గా నిలుస్తున్న మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  9. ఎంతో సరదాగా ఉండే జంటకి వివాహ వార్షిక శుభాకాంక్షలు.
  10. వివాహ బంధాన్ని ఎంతో చక్కగా కొనసాగిస్తూ ముందుకి వెళుతున్న మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

 ఇవి ఎవరైనా జంటకి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

 

ADVERTISEMENT

జంటలకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  1. నా జీవితంలో సంతోషాన్ని నింపిన నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు..
  2. గమ్యం తెలియక సాగుతున్న నా జీవితాన్ని గాడిన పెట్టిన దేవతవి నీవే! అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  3. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత నాలో చాలా మంచి మార్పులు వచ్చాయి. అటువంటి మార్పులకి అంకురార్పణ జరిగింది మన పెళ్లి రోజే.. అందుకే ఆ రోజుని పురస్కరించుకుని నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.
  4. స్నేహితురాలు జీవిత భాగస్వామిగా మన జీవితంలో వస్తే ఆ ఆనందమే వేరు. అంతటి ఆనందాన్నిచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  5. మన పెళ్లి ద్వారా నాకు లభించిన ఒక మంచి స్నేహితురాలివి నీవు. అంతటి స్నేహాన్ని నాకు పంచుతున్న నీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  6.  నిన్ను చూసిన మొదటి రోజే అర్ధమైంది కచ్చితంగా నువ్వే నా భార్యవి అని… అంత బాగా ఆకట్టుకున్నావు నన్ను. మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  7. నా జీవితంలో అతిముఖ్యమైన రోజుగా ఎప్పటికి మన పెళ్లి రోజుని భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు నీ సహచర్యం నాకు దొరికింది కాబట్టి…
  8. ప్రేమ నాకు ప్రోత్సాహాన్నిస్తే… నీతో పెళ్లి నాకు ధైర్యాన్నిచ్చింది. అంతటి ధైర్యాన్ని ఇచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  9. పెళ్లి మండపంలో నిన్ను చూసాక కానీ నేను ఎంత అదృష్టవంతుడినో నాకు అర్ధం కాలేదు. అంతటి అదృష్టాన్ని ఇచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  10. నేను నీతో పెళ్ళికి ఒప్పుకోవడం… జీవితంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం. అంత మంచి నిర్ణయానికి ఆనందిస్తూ నీకు మన పెళ్లి రోజు శుభాకంక్షాలు.
     

ఇవి మీ భార్యకి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

www.bestquotesb4u.in

  1. నా జీవితంలో మా నాన్న తరువాత నేను చూసిన ఏకైక జెంటిల్మెన్ వి నువ్వే మై డియర్ హస్బెండ్. నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  2. జీవిత భాగస్వామిలో ఒక మంచి స్నేహితుడు ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. అంతటి అదృష్టం నాకిచ్చిన మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  3. మన పెళ్ళికి ముందు నా ఇష్టాయిష్టాలు తెలుసుకుని.. ఇప్పటికి కూడా వాటికి తగట్టుగా నడుచుకునే మీలాంటి వారు నాకు లభించడం నిజంగా నా అదృష్టమే. ఈ సందర్భంగా మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  4. మన మొదటి పెళ్లి రోజు నాడు నాకిష్టమైన ప్రదేశానికి మీరు నన్ను తీసుకెళ్ళడం నేనెప్పటికీ మర్చిపోలేను. అంతటి మధురజ్ఞాపకాన్ని ఈ పెళ్లి రోజు కూడా గుర్తు చేసుకుంటూ మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  5. జీవిత భాగస్వామి గురించి వెతుకుతున్న నాకు మీరు లభించడంతో హాయిగా ఉండగలుగుతున్నాను. నాకు ఇంతటి సంతోషానిస్తున్న మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  6. జీవితంలో పెళ్లి తరువాత కూడా కెరీర్ ని కొనసాగించేందుకు తోడ్పాటునందించిన నీకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలినే. అలాంటి మీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  7. జీవితంలో నేను మిమ్మల్ని భర్తగా పొందాక గాని అర్ధంకాలేదు నేను ఎంత లక్కీ అని.. నా లక్ కి కారణమైన మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  8. మన పెళ్లి రోజు మీరు ఇచ్చిన కానుక నేను ఎన్నటికీ మరువను. దానికి కారణం ఆ బహుమతి మీరే కావడం.
  9. మన మొదటి వివాహ వార్షికోత్సవం రోజున మీతో కలిసి చేసిన ప్రయాణం నేను ఎన్నటికి మరువలేను. అలాంటి రోజులు మరెన్నో రావాలని కోరుకుంటూ మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  10. ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇది మన పెళ్లి రోజు కాబట్టి..

ఇవి మీ భర్తకి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలపగలిగే శుభాకాంక్షలు.

ADVERTISEMENT

భర్తకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

www.bestquotesb4u.in

  1. 25 ఏళ్ళ మీ వైవాహిక జీవితం ఇప్పటితరం జంటలకు ఎంతో స్ఫూర్తి. మీ ఇరువురు మరో 25 ఏళ్ళు హాయిగా కలిసి ఉండాలని కోరుకుంటూ మీకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  2. మనిషి జీవితంలో 25 ఏళ్ళు అనేది చాలా ఎక్కువ సమయం. అటువంటిది ఇద్దరు కలిసి 25 ఏళ్ళు బ్రతకడమంటే అది వారిరువురి మధ్య ఉన్న అవగాహన అనే చెప్పాలి. అటువంటి అవగాహన ఉన్న మీ ఇద్దరికీ 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  3. 30 ఏళ్ళ ముందు మొదలైన మీ ఇద్దరి స్నేహంలో 25 ఏళ్ళు క్రితం వివాహ బంధం అనే ఒక పవిత్ర బంధం మొదలైంది. నేడు ఆ బంధానికి 25 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా మీ ఇరువురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  4. వివాహ బంధంలో సిల్వర్ జూబ్లీ ని నేటితో దాటుతున్న మీ ఇరువురికి 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  5. 25 ఏళ్ళ మీ వివాహ బంధానికి గుర్తుగా నేను & చెల్లి ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఇంత చక్కటి జీవితాన్ని మాకిచ్చిన మీకు తిరిగి ఏమి ఇవ్వగలం. మీ వివాహ బంధం ఇలాగే ముందుకు సాగాలి అని కోరుకుంటూ మీ ఇద్దరికీ 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  6. ఈ నెల 25న మన 25వ పెళ్లి రోజు వస్తుండడం నాకు థ్రిల్ గా ఉంది. మనం మరిన్ని వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
  7. ఈ 25 ఏళ్ళ మన వివాహ బంధంలో మనం 25 సార్లైనా గొడవపడి ఉంటాము, కాని ఒక్కసారి కూడా మనం విడిపోదాము అని అనుకోలేదు. ఇంతటి ప్రేమ ఉన్న మనకి పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  8. మనకి తెలిసిన వారిలో 25 ఏళ్ళ పాటు కలిసి ఉన్న ఏకైక జంట మీరే అని చెప్పడానికి ఆనందపడుతున్నాను. అదే సమయంలో ఈ 25 ఏళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  9.   ఈ రోజుతో మన పెళ్లి రోజుకి 25 ఏళ్ళ వయసు వచ్చింది. దానికి 50 ఏళ్ళ వయసు వచ్చే వరకు మనం ఇలానే కలిసి ఉండాలని కోరుకుందాం.
  10.  25 ఏళ్ళ మీ జీవిత సారం ఎంతోమందికి ఆదర్శనమైన వేళ, మీ ఇరువురికి వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు.

ఇవి 25 ఏళ్ళ వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారికి తెలపగలిగే శుభాకాంక్షలు.

ADVERTISEMENT

25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

www.quotesadda.com

  1. 50 ఏళ్ళ సమయం ఒక మనిషి జీవితం అంటారు. అటువంటిది మనమిద్దరం కలిసి 50 ఏళ్ళ పాటు కలిసి బ్రతకగలిగాం అంటే అది మన ఇద్దరి మధ్య ఉన్న అవగాహన అనే చెప్పాలి. 50వ వివాహ వసంతంలోకి అడుగుపెడుతున్న మనకి మనమే 50వ వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలుపుకుందాం.
  2. గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ (50వ వార్షిక వివాహ రోజు) చేసుకుంటున్న అమ్మానాన్నకి .. మీరు ఇద్దరూ ఇలానే కలకాలం హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను.
  3. 75 ఏళ్ళ నా జీవితంలో 50 ఏళ్ళ పాటు నీతో కలిసి ఉన్నాను అన్న మాట నాకు ఎంతగానో తృప్తినిస్తున్నది. ఎన్నోసార్లు నా ఒడిదుడుకుల్లో నువ్వు భాగమయ్యావు … అలాగే నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే అది కచ్చితంగా నీ వల్లే… అంతటి ముఖ్యమైన నీకు మన 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  4. ఈ 50 ఏళ్ళ మన వివాహ జీవితంలో ఎన్నోసార్లు గొడవపడ్డాం … కానీ ఎప్పుడు కూడా విడిపోవాలి అని అనుకోలేదు. కారణం – అది ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమనే. ఈ సందర్భంగా నా ప్రియమైన భాగస్వామికి 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  5. నా పిల్లల పెళ్లి సమయంలో వారికి చూపిన ఆదర్శమైన జంట మీ ఇద్దరిదే. 50 ఏళ్ళ పాటు మీరు కలిసి ఉంది మీ చుట్టూ ఉన్నవారిలో కూడా స్ఫూర్తి నింపుతూ సాగిన మీకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  6. 50 ఏళ్ల పాటు కాపురం చేసిన తరువాత ఒకరంటే ఒకరికి బోర్ రాకుండా ఉండడం అనేది చాలా కష్టం. ఆ కష్టాన్ని చాలా సునాయాసంగా అధిగమించాలి అని నువ్వు చేస్తున్న దానికి నా మద్దతు ఉంటుంది.
  7. మన 50 ఏళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నా భార్య అయిన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.
  8. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో బిజీగా ఉన్న అన్న & వదినలకి 50వ వివాహ వార్షిక శుభాకాంక్షలు.
  9. 50 ఏళ్ళ వైవాహిక జీవితంలో నిన్ను విమానం ఎక్కించిన రోజు నా సంతోషానికి అవధులు లేవు. అలా మన వివాహ వార్షికోత్సవం తేదీని నేను ఎన్నటికీ మరువను.
  10. ఇవే 50 ఏళ్ళ వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారికి తెలపగలిగే శుభాకాంక్షలు.

చదివేసారు కదా! మీ కుటుంబంలో ఉన్న ప్రియమైన వారికి వారి వివాహ వార్షికోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పడానికి ఉపయోగపడే సందేశాలు. మీరు కూడా పైన చెప్పినవి మీకు ఇష్టమైన వారికి చెప్పే ప్రయత్నం చేయండి. లేదంటే పైన పేర్కొన్న వాటికన్నా మంచివి మీ దగ్గర ఉంటే … వాటిని ఈ క్రింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాము.

వర్షాకాలంలో మనం తప్పక సందర్శించాల్సిన.. పర్యాటక ప్రదేశాలు ఇవే..!

शादी के बधाई संदेश

ADVERTISEMENT

स्वयं की शादी की सालगिरह (हैप्पी मैरिज एनिवर्सरी)

50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

31 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT