మీ రాశిని బట్టి మీరు ఎలాంటి అమ్మ అవుతారో తెలుసా? చెక్ చేసుకోండి.

మీ రాశిని బట్టి మీరు ఎలాంటి అమ్మ అవుతారో తెలుసా? చెక్ చేసుకోండి.

"అమ్మ" (mom) అని పిలిపించుకోవాలని కోరుకోని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. అమ్మతనంలోని అందం అది. అయితే ఒక అమ్మగా పిల్లల మనసును దోచుకోవడం సులువు కాదు. అది ఎంతో బాధ్యతతో కూడిన పని. ప్రతి మహిళ తను పర్ఫెక్ట్ మామ్ అనిపించుకోవాలని భావిస్తుంది. కొన్నిసార్లు మన ప్రయత్నం ఫలిస్తే.. మరికొన్నిసార్లు ఫెయిలవుతూ ఉంటుంది.

అయితే తల్లి కాబోయే వారికి.. తల్లులైన వారికి.. అంతెందుకు.. పిల్లల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ.. తాను ఎలాంటి తల్లో తెలుసుకోవాలనే ఆత్రుత తప్పనిసరిగా ఉంటుంది. చిత్రమేంటంటే, భవిష్యత్తులో మీరు తల్లిగా ఎలాంటి లక్షణాలు కలిగుంటారో ..  ముందే జ్యోతిష్యం సాయంతో తెలుసుకోవచ్చట. ఈ క్రమంలో మనం కూడా, రాశులను బట్టి (zodiac sign) తల్లుల లక్షణాలను గురించి తెలుసుకుందాం. 

Shutterstock

మేషం (Aries)

మేష రాశిలో పుట్టిన అమ్మాయిలు చాలా బలంగా ఉంటారు. స్ట్రాంగ్ మామ్‌గా పేరు సాధిస్తారు. పిల్లలకు వారికి కావాల్సినంత స్వేచ్ఛను ఇస్తూనే.. వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వకపోతే మీకు కోపం వస్తుంది. అయితే ఇలా చేసే మీరే.. ఏదైనా పోటీ ఉంటే మాత్రం అందులో మీ పిల్లలే ముందు రావాలని వారిపై ఒత్తిడి పెంచడం చూడచ్చు.

వృషభం (Tarus)

ఈ రాశి వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఇది వారి తల్లి ప్రేమలోనూ కనిపిస్తుంది. ఈ రాశిలో పుట్టిన తల్లులు.. పిల్లలు తాము చెప్పిన మాట వినేలా చేసుకుంటారు. వారిని పూర్తి క్రమశిక్షణలో పెడతారు. దీనికోసం వారిపై ఉన్న ప్రేమను కూడా బయటకు వ్యక్తం చేయకుండా కొన్ని సార్లు ఉండడం వల్ల.. వీరి పిల్లలు జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా భావిస్తుంటారట.

మిథునం (Gemini)

ఈ రాశి వారు మోడ్రన్ మామ్‌లా వ్యవహరిస్తారు. ఈ రాశి వారికి టెక్నాలజీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడేం జరుగుతోంది అన్న విషయాలను తెలుసుకోవడంపై ఆసక్తి ఉంటుంది. వీరు నేర్చుకున్న విషయాలను పిల్లలకు కూడా నేర్పుతూ అప్ టు డేట్‌గా ఉంచుతారు. ఈ రాశి మహిళలు తమ పిల్లలను ఆనందంగా, సక్సెస్ ఫుల్‌గా మార్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించే కూల్ మామ్స్.

Shutterstock

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశిలో పుట్టిన మహిళలు చాలా ఎమోషనల్, సెన్సిటివ్. వీళ్లు తమ పిల్లలను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. సాధారణంగా అందరు తల్లులు చూపే ప్రేమ కంటే.. వీరి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరి మూడ్ ఎప్పటికప్పుడు మారుతుండడం వల్ల.. వీరి పిల్లలు వీరిపై విసుక్కునే అవకాశాలు ఎక్కువ.

సింహం (Leo)

ఈ రాశిలో పుట్టిన మహిళలు తాము జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉంటారు. పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. ఈ రాశి వారు కూడా డ్రీమ్ మామ్స్ అని చెప్పుకోవచ్చు. పిల్లలతో ఫ్రెండ్‌లా వ్యవహరించే ఇలాంటి తల్లి తమకూ ఉండాలని చాలామంది కోరుకుంటారట.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కన్య (Virgo)

ఈ రాశిలో పుట్టినవారు పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే వీరు తమ పిల్లలు కూడా ప్రతి విషయంలో పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. ఇది పిల్లలపై చాలా ఒత్తిడిని పెంచుతుంది. దీర్ఘకాలంలో వారితో మీకు దూరాన్ని కూడా పెంచుతుంది.

Shutterstock

తుల (Libra)

తులా రాశిలో పుట్టిన వాళ్లందరూ తమ పిల్లలతో చాలా సన్నిహితంగా మెలుగుతారట. పిల్లలకు ఎలాంటి ఒత్తిడిని కలిగించకుండా వారికి.. నచ్చినట్లుగా ఉండమని చెబుతారట. కానీ వీరికి పుట్టే పిల్లలే మొండిపిల్లలు కావడం వల్ల.. వారు అల్లరి ఎక్కువగా చేస్తారు. అయితే వీరు పిల్లలపై ఉన్న ప్రేమ వల్ల వారిని శిక్షించేందుకు మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారట.

వృశ్చికం (Scorpio)

ఈ రాశి తల్లులు పిల్లల పట్ల చాలా కఠినంగా ఉంటారట. వారు తమ పిల్లలు చాలా బాగా చదవాలని.. అందరితో మర్యాదగా వ్యవహరించాలని.. అన్నింట్లోనూ ముందుండాలని.. అల్లరి చేయకూడదని.. ఇలా చాలా నియమాలు పెడతారు. వీరికి మనసులో పిల్లల పట్ల ఎంతో ప్రేమున్నా.. ఈ వైఖరి పిల్లలు మిమ్మల్ని చూసి భయపడేలా చేస్తుంది.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

ధనుస్సు (Saggitarius)

ఈ రాశిలో పుట్టిన వారు తమ పిల్లలు ఎప్పుడూ ఆటపాటల్లో ముందుండాలని కోరుకుంటారట. అంతేకాదు.. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా వీరు చాలా ఎక్కువగా శ్రద్ధ వహిస్తారట. వారితో ఆటలు ఆడించడం, బయటకు తీసుకెళ్లడం, వారితో ఆడుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే వీరికి తమ కోపం పై కంట్రోల్ లేకపోవడం వల్ల పిల్లలపై ఎప్పుడూ కోపం చూపుతుంటారట.

Shutterstock

మకరం (Capricorn)

ఈ రాశి తల్లులంటే పిల్లలకు చాలా ఇష్టం. పిల్లలతో కలిసిపోయి వారిని చదివించడం, ఆడించడం వంటివన్నీ చేస్తుంటారు. అందుకే వారితో ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. పిల్లలను చక్కగా చూసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

కుంభం (Aquarius)

కుంభ రాశిలో పుట్టిన మహిళలు వారి పిల్లలకు కేవలం మంచి అమ్మ అనిపించుకోవడం మాత్రమే కాదు.. మంచి స్నేహితురాలిగా కూడా మెలుగుతారు. పిల్లలు వారి నిర్ణయాలు వారే తీసుకోగలిగేలా.. మీరు వారికి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తారు. మీ పిల్లలు తమ మనసులో ఏమున్నా మీతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం అందిస్తారు.

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

మీనం (Pisces)

ఈ రాశి వారు కేవలం వారి పిల్లలను మాత్రమే కాదు.. కుటుంబం మొత్తాన్ని ఆనందంగా చూసుకోవాలనుకుంటారు. ఈ రాశి వారు అమ్మలందరికీ ఓ రోల్ మోడల్. పిల్లలకు అవసరమైన ప్రతి ఒక్కటీ వారికి అమర్చి పెడుతూ వారితో కలిసిపోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తుంటారు. అయితే మీ సెన్సిటివ్ వైఖరి మాత్రం అప్పుడప్పుడూ కుటుంబానికి ఇబ్బందిని తీసుకొస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.