మీ వదిన మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే.. ఇవన్నీ మీ జీవితంలోనూ జరుగుతాయి ..!

మీ వదిన మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే.. ఇవన్నీ మీ జీవితంలోనూ జరుగుతాయి ..!

కొన్ని సార్లు మనం జీవితంలో కొంతమందితో.. ఎంతో బలమైన బంధాన్ని పెనవేసుకుంటాం. ఎన్నో రక్త సంబంధాల కంటే.. అలాంటి బంధాలు ఎంతో బలంగా ఉంటాయి. అలాంటి వాటిలోనే వదిన (sister in law) మరదళ్ల బంధం కూడా ఒకటి. ఇద్దరి మధ్య రక్త సంబంధం లేకపోయినా ఇద్దరూ స్నేహితుల్లా.. అంత కంటే క్లోజ్‌గా పెనవేసుకుపోతారు.

రిలేషన్ షిప్ అడ్వైజర్, ఫ్యాషన్ క్రిటిక్, థెరపిస్ట్.. ఇలా అన్ని రకాల బాధ్యతలు మోస్తుంటారు వదినా మరదళ్లు. అయితే వీటన్నింటి కంటే బెస్ట్ రోల్ అయితే బెస్ట్ ఫ్రెండ్‌ది ( best friend) అనడంలో సందేహం లేదు. ఒకవేళ మీ వదిన కూడా.. మీ బెస్ట్ ఫ్రెండ్ అవునో కాదో తెలుసుకోవాలంటే.. ఈ పది అంశాలు ఓసారి చెక్ చేయండి. ఇందులో చాలా అంశాలు కలిస్తే.. మీ ఇద్దరూ ప్రాణ స్నేహితులనే అర్థం.

1. తను మీ పర్సనల్ థెరపిస్ట్

మీ జీవితంలో మీకు ఎదురైన ఎలాంటి అనుభవం గురించైనా సరే.. తనతో గంటల తరబడి మాట్లాడగలుగుతారు. మీరిద్దరూ సీక్రెట్లు కూడా పంచుకుంటారు. మీ గురించి అందరికంటే ఎక్కువగా తనకే తెలుసు కాబట్టి.. మీరు తన ముందు మీలాగే ఉండచ్చు.

2. ప్రతి సారి కాపాడుతుంది.

మీ జీవితంలో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే.. ముందు గుర్తొచ్చే వ్యక్తి తనే. మీ అమ్మానాన్నలు మిమ్మల్ని తిట్టినప్పుడు.. వారి నుంచి మిమ్మల్ని కాపాడడం దగ్గర నుంచి.. మీ అన్న దగ్గర మీ సైడ్ తీసుకొని మాట్లాడడం వరకూ.. ఇలా ప్రతి సమస్యలోనూ తనే మీకు తోడు నిలుస్తుంది.

3. తనతో షాపింగ్ అంటే ఆనందమే..

షాపింగ్ చేసేటప్పుడు.. మనకు ఏది ఎలా ఉంటుందో చెప్పే ఓ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. తనతో షాపింగ్‌కి వెళ్లేటప్పుడు.. మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. తన షాపింగ్ చేసినప్పుడల్లా.. అది మీకెంతో ఇష్టమైన పని అయిపోతుంది. మాల్స్‌కి ఎప్పుడూ కలిసి వెళ్లేలా మీరు మారిపోతారు.

4. మీపై ప్రేమతో..

తనకు మీపై ఎంతో ప్రేమ. ఎంతగా అంటే.. ఎప్పటికప్పుడు మీపై ఉన్న ప్రేమను  నోరూరించే వంటకాలను రుచి చూపించడం ద్వారా.. మంచి మంచి బహుమతులను అందించడం ద్వారా.. మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తూ వ్యక్తపరుస్తుంది. 

5. మీ బెస్ట్ ట్రావెల్ బడ్డీ

తనతో కలిసి ట్రావెల్ చేయడం అంటే మీకు ఆనందమే. ఎందుకంటే తనతో కలిసి చేసే ప్రయాణాలన్నీ.. ఎంతో క్రేజీగా ఉంటాయి మరి. తను మీతో ఉంటే.. మీరు బయటకు వెళ్లడానికి.. మీ అమ్మానాన్నలు అస్సలు నో చెప్పరని మీకు చాలా నమ్మకం కూడా.

6. మీ ఫ్యాషన్ గురు..

మీకు ఏ దుస్తులు బాగుంటాయో.. ఏవి బాగోవో తెలియజేయడంతో పాటు.. మీకు ఏవి నప్పుతాయో కూడా తను మీకు చెబుతుంది. అందుకే మీకు ఎప్పుడు ఫ్యాషన్ విషయంలో.. ఏ సలహా అవసరమైనా తననే అడుగుతారు. అంతేకాదు.. తన వల్లే మీ వార్డ్ రోబ్ చాలా అందంగా మారుతుంది కూడా.

7. బంధాల విషయంలోనూ..

కేవలం ఫ్యాషన్లు, ఇతర అంశాల్లోనే కాదు.. అబ్బాయిలతో డేటింగ్.. ఇతర విషయాల్లోనూ తను మీకు సలహాలు ఇస్తుంటుంది. మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి తను కాబట్టి.. ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తుంటే.. మీకేం కావాలో తను ముందుగా అర్థం చేసుకొని.. ఆ వ్యక్తి మీకు సెట్ అవుతాడా లేదా అనేది కూడా చెప్పేస్తుంది.

8. ఫన్‌లో భాగస్వామి

మీ ఇద్దరూ కలిసి ఉంటే జోకుల వర్షమే. కబుర్లు, జోక్స్‌తో పాటు.. మీ అన్నపై కూడా చిన్న చిన్న ప్రాంక్స్ చేస్తూ నవ్వుకోవడంలో మీకు సాయపడుతుంది.

9. రెండో అమ్మలాంటిది..

రాత్రి పార్టీలకు మీరు ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లేందుకు, వచ్చేందుకు.. మీకు తను సాయం చేసినా.. సందర్భాన్ని బట్టి అమ్మలా మారిపోయి.. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడం కూడా తనకు తెలుసు.

10. స్నేహితురాలి కంటే గొప్ప..

మీ వదిన మంచి స్నేహితురాలిగా మెలగడంతో పాటు.. మీకు మీ స్నేహితులతో గొడవలు జరిగినప్పుడు కూడా తనే సర్దిచెబుతుంది. అంతేకాదు.. మీ ఇద్దరి మధ్య గొడవలై కాసేపు మాట్లాడుకోకుండా ఉన్నా.. ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరని తెలుసుకొని క్షమాపణలు చెప్పుకొని కలిసిపోతారు.

మొత్తంగా చెప్పుకోవాలంటే.. మీ వదిన మీకు మంచి స్నేహితురాలు.. అక్క లాంటిది.. తను మీ పక్కనుంటే మీకు మరో ఫ్రెండ్ అవసరమే ఉండదు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.