30 రుచులతో 'భలే పసందైన విందు' కావాలంటే.. 'సుబ్బయ్య గారి హోటల్'కి వెళ్లాల్సిందే

30 రుచులతో 'భలే పసందైన విందు' కావాలంటే.. 'సుబ్బయ్య గారి హోటల్'కి వెళ్లాల్సిందే

దాదాపు 30 రుచులతో ప్రత్యేకమైన విందు భోజనం చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా.. ? గడ్డ పెరుగు, గోంగూర, కందిపొడి - నెయ్యి వంటి తెలుగు రుచులతో షడ్రశోపేతమైన తెలుగింటి భోజనం రుచి చూడాలని మీ మనసు ఎప్పుడైనా ఉవ్విళ్లూరిందా..? అయితే మీరు కాకినాడ 'సుబ్బయ్య గారి హోటల్‌'కి (Kakinada Subbaya Gari Hotel) వెళ్లాల్సిందే. దాదాపు ఆరు దశాబ్దాలుగా కాకినాడలో సేవలందించిన ఈ హోటల్.. ఇటీవలే హైదరాబాద్ ప్రాంతానికి కూడా తన శాఖలను విస్తరించింది. మలక్ పేట, కొండాపూర్, అమీర్ పేట, కూకట్ పల్లి లాంటి ప్రాంతాలలో భోజన ప్రియులకు సేవలందిస్తోంది. 

మరో సరికొత్త రికార్డు సాధించిన.. హైదరాబాద్ ప్యార‌డైజ్ బిర్యానీ

ఈ హోటల్‌కి దాదాపు 60 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉందట. ప్రకాశం నుండి కాకినాడ ప్రాంతానికి వచ్చిన సుబ్బయ్య అనే ఆసామి.. 1950లో ఓ హోటల్‌ను స్థాపించారట. కేవలం 50 పైసలకు భోజనాన్ని అందించిన ఈ హోటల్.. తర్వాతి కాలంలో ‘శ్రీ కృష్ణ విలాస్‌’ గా పేరుగాంచింది. గోదావరి జిల్లాలలో మంచి పేరు గల హోటల్‌గా వినుతికెక్కింది. శాఖాహార హోటల్ అయినప్పటికీ.. వినూత్నమైన రీతిలో అతిథి మర్యాదలు చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకోవడం ఈ హోటల్ ప్రత్యేకత. 

వినియోగదారుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ.. రాగి గ్లాసులో మాత్రమే మంచి నీటిని సరఫరా చేయడం ఈ హోటల్ ప్రత్యేకత. అలాగే పులిహోరా, పుదీనా అన్నం, వెజ్ బిర్యానీతో పాటు వివిధ రకాల స్వీట్లు (అందులో ముఖ్యంగా బూరెలు లేదా గారెలను) రుచి చూపించడం ఈ హోటల్‌కే చెల్లింది. అలాగే భోజనం పూర్తయ్యాక.. చల్లని మజ్జిగను తాగించడం కొసమెరుపు.

భాగ్యనగరంలో బెస్ట్ బిర్యానీ.. లభించేది ఈ హోటల్స్‌లోనే..!

 

ప్రస్తుతం ఈ హోటల్‌లో ఫుల్స్ మీల్స్ రూ.210 రూపాయలకు అందివ్వడం జరుగుతోంది. అలాగే సింగిల్ మీల్స్‌ను రూ.105 రూపాయలకు విక్రయిస్తున్నారు. గుత్తి వంకాయ కాయ, దొండకాయ ఫ్రై లాంటి వాటిని ఇక్కడ ప్రత్యేకంగా తయారుచేస్తారట.                                                                                

అలాగే ఈ హోటల్‌లో సంప్రదాయతకు పెద్ద పీట వేస్తారు. అరిటాకులో మాత్రమే భోజనం వడ్డిస్తారు. అలాగే ఆహారాన్ని వినియోగదారులకు కొసరి కొసరి వడ్డించడంలో.. సిబ్బంది ముందుంటారు. ఈ మధ్యకాలంలో ఈ హోటల్ ఒక బ్రాండ్ హోదాను సొంతం చేసుకుంది. క్యాటరింగ్ ఆర్డర్లు కూడా బాగానే వస్తున్నాయని వినికిడి. ఈ మధ్యకాలంలో బుట్ట భోజనాన్ని కూడా హోటల్ సరఫరా చేస్తోంది. ఈ హోటల్‌కి సోషల్ మీడియాలో కూడా మంచి ఆదరణే ఉంది.                                                                                                         

మాంసాహార ప్రియులకు ప్రత్యేకం.. ఈ "నెల్లూరు చేపల పులుసు" ..!

అలాగే హోటల్ పేరు మీద ఒక వెబ్ సైట్ కూడా నడుస్తోంది. పాకం గారెలు, నేతి బూరెలు, గొట్టం కాజా, నేతి బొబ్బట్లు, మలైపూరి, కోవా జున్ను లాంటి తీపి వంటకాలను తయారుచేయడంలో ఈ హోటల్ యాజమాన్యానిది అందె వేసిన చేయి. ప్రస్తుతం కాకినాడలోని రామారావు పేటలో కూడా ఈ హోటల్ విజయవంతంగా నడుస్తోంది. 

Featured Image: Instagram.com/subbayyagarihotel/

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.