Bigg Boss Telugu 3: ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు చదివి.. భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్

Bigg Boss Telugu 3:  ఇంటి నుండి వచ్చిన ఉత్తరాలు చదివి.. భావోద్వేగానికి గురైన హౌస్‌మేట్స్

"బిగ్ బాస్ తెలుగు సీజన్ 3"లో (Bigg Boss Telugu Season 3) భాగంగా.. ఈరోజు ప్రారంభమయ్యే ఎపిసోడ్‌లో  హౌస్ మేట్స్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. దీనికి కూడా ఓ కారణం ఉంది - హౌస్ మేట్స్‌కి ( Bigg Boss Housemates) వారి కుటుంబీకులు ప్రేమతో లేఖలు రాయడం జరిగింది.

ఆ లేఖలలో వారి గురించి ఇంటి సభ్యులు ఏమని అనుకుంటున్నారు? అలాగే కంటెస్టంట్స్ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎవరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే బాగుంటుంది మొదలైన విషయాలను ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు తమకు రాసిన ఉత్తరాలు చదివి.. హౌస్ మేట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!

అదే కాకుండా దాదాపు ఇంటిని విడిచి వచ్చి 40 రోజులు దాటి పోవడంతో.. హోమ్ సిక్ ఫీలింగ్ ఉన్న వీరికి ఇలాంటి ఉత్తరాలు కాస్త ఊరటను ఇస్తాయనే చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్‌లో ఇంకాస్త పట్టుదలతో గేమ్ ఆడేటందుకు అవి సహాయపడతాయి అని కూడా అనుకోవచ్చు.

ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండే సభ్యులకి.. తమ ప్రవర్తన ప్రజలకి ఎలా ప్రోజెక్ట్ అవుతుందనే దానిపై ఎలాంటి స్పష్టతా ఉండదు. అందుకే తమ ఇంటి నుండి వచ్చే ఉత్తరాల ద్వారా అర్ధమయ్యే దానిని బట్టి.. వారు తమ ప్రవర్తనలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది.

ఇదిలావుండగా నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇంటి సభ్యులు.. దాదాపుగా ఏకాభిప్రాయంతో బాబా భాస్కర్‌ని ఇంటి కెప్టెన్‌గా ఎంపిక చేసుకున్నారు. పేరుకి కెప్టెన్సీ టాస్క్ జరిగినా కూడా... బాబా భాస్కర్‌కి ఎక్కువ మంది మద్దతు తెలి..పి ఆయన ఇతని కెప్టెన్ అయ్యేందుకు సహాయపడ్డారు.

దానితో బిగ్ బాస్ సీజన్ 3 అయిదవ కెప్టెన్‌గా బాబా భాస్కర్ ఎంపికయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో.. బాబ్ భాస్కర్ తనదైన శైలిలో ఇంటి కెప్టెన్‌గా హౌస్ మేట్స్‌తో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే తన పర్సనల్ సెక్రెటరీగా శ్రీముఖిని పేర్కొంటూ.. ఇంటి సభ్యుల చేత నవ్వుల పువ్వులు పూయించారు.

అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ గా చేసినవారిలాగానే.. బాబా భాస్కర్ కూడా వ్యవహరిస్తాడా? లేక ఏదైనా వైవిధ్యంగా ప్రయత్నిస్తాడా అన్నది వేచి చూడాలి. కాకపోతే ఇంటిలో మెజారిటీ సభ్యులు బాబా భాస్కర్‌కి మద్దతు తెలిపి.. తనను ఇంటి కెప్టెన్‌గా చేయడంతో ఆయనకీ ఇంటి సభ్యులంతా తనకు సహకరిస్తారనే అనుకోవచ్చు.

మరో కోణంలో ఆలోచిస్తే.. బాబా భాస్కర్ గనుక సరదాగా ఉంటూ.. బిగ్ బాస్ కెప్టెన్‌గా చేయవల్సిన బాధ్యతలు చేయకుండా ఉంటే.. తను కూడా శిక్షలు పొందవలసి వస్తుంది. కానీ వచ్చే వారం నామినేషన్స్ ప్రక్రియలో ఇంటి కెప్టెన్‌గా ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం.. బాబా భాస్కర్‌కి లభిస్తుంది. ఆ సమయంలో ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు కచ్చితంగా తెలుస్తుంది.

బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

ఇక రేపటితో "బిగ్ బాస్ సీజన్ 3"లో ఏడవ వారం ముగియనుంది. గత వారం రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించగా... ఈ వారం మాత్రం ఎప్పటిలాగే నాగార్జున వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ఎంటర్ కానున్నాడు. దానితో ఈ రెండు వారాలకి సంబంధించి నాగార్జున.. ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ప్రకారమే హోస్టింగ్ చేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుండగా.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న అలీ రెజా, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, రవికృష్ణలలో ఒకరు కచ్చితంగా.. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి నిష్క్రమించే అవకాశం ఉంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ  ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారనుంది. ఈ డబుల్ ఎలిమినేషన్‌‌కి కారణం.. పోయిన వారం ఎవ్వరిని కూడా బిగ్ బాస్ ఎలిమినేట్ చేయకపోవడమే.

మొత్తానికి ఈ వారాంతం జరగబోయే.. ఈ మూడు ఎపిసోడ్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి.

బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?