16 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

16 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 16, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు  డబ్బు విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారంలో అనుకోని అంతరాయాలు కలుగుతాయి. వివాహితులు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడకపోతే.. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు లేదా విద్యార్థులు చేసే కొన్ని పనులు సామాజిక గౌరవాన్ని పెంచుతాయి. రాజకీయాల్లో బాధ్యతలు కూడా పెరుగుతాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో సరదాగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు పురోగతి ఉంటుంది. వివాహితులు శృంగార జీవితంలో థ్రిల్ అనుభవిస్తారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులను మానసిక క్షోభకు గురిచేసే సంఘటనలు ఎదురుకావచ్చు. అలాగే వాదోపవాదాలకు ఇది సమయం కాదని గుర్తుపెట్టుకోండి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. కోర్టు లావాదేవీలతో జాగ్రత్త వహించండి. వివాహితులకు భాగస్వామితో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది . అలాగే పలు చర్చలు, సమావేశాలలో కూడా పాల్గొంటారు. అదేవిధంగా విద్యార్థుల సమస్యలు కూడా కొంతవరకు పరిష్కారమవుతాయి. ఆఫీసులో ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం కూడా ఉంటుంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయానికి ఇదే సరైన సమయం. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. రాజకీయ రంగ వ్యక్తులకు అదనపుల బాధ్యతలు పెరుగుతాయి. మీ భాగస్వామి భావాలకూ గౌరవం ఇవ్వండి. ఆలుమగల మధ్య ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలుమగల మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.

తుల (Libra) – ఈ రోజు నిరుద్యోగులు మరింత కష్టపడాలి. ముఖ్యంగా నిర్లక్ష్యాన్ని వీడాలి. లేకపోతే చేతికందిన అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు అస్థిర వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆలుమగలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు క్రీడలు లేదా సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా గడుస్తుంది. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు మీ సహాయాన్ని కాంక్షించే అవకాశం ఉంది. ప్రేమికులు కూడా ఈ రోజు కొత్త అనుభవాలను ఎదుర్కొంటారు.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలో నూతన సవాళ్లను ఎదుర్కొంటారు. ఆఫీసులో ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మీ ప్రత్యర్థుల నుండి కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటప్పుడే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదనే విషయాన్ని నమ్మండి.  

మకరం (Capricorn) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో మీకు మీ భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. వివాహితులు శుభకార్యాలలో పాల్గొంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అలాగే అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో మీకు మీ స్నేహితులు లేదా సన్నిహితులు సహాయం చేసే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరిస్థితులు మీకు చికాకును కలిగించవచ్చు. ఇలాంటి సమయంలోనే సహనంతో వ్యవహరించండి. 

మీనం (Pisces) – ఈ రోజు మీకు లక్ ఫ్యాక్టర్ అద్భుతంగా పనిచేస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి. అలాగే మేధో మధనంతో కొన్ని కఠినమైన సమస్యలను మీరు పరిష్కరిస్తారు. సృజనాత్మక, సినిమా రంగాలలో పురోగతి ఉంటుంది. ప్రత్యర్థులు కూడా మీతో మైత్రి కోసం పాకులాడతారు. అయితే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.