19 సెప్టెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

19 సెప్టెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (19 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీకు బాగా చికాకు కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మనసు బాగా లేకపోవడంతో.. ఎక్కువసేపు ఒంటరిగా సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తుల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. నిరుద్యోగులు ఇంకాస్త కష్టపడాలి.

వృషభం (Tarus) – ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే తోబుట్టువుల మధ్య గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలిగిపోతాయి. వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి ఓ శుభవార్త వింటారు.

మిథునం (Gemini) – ఈ రోజు మీ ఇంట్లో  వాతావరణం సరదాగా ఉంటుంది. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార భాగస్వామ్యాలు మంచి లాభాలను తీసుకొస్తాయి. నిరుద్యోగుల సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికులు తమ బంధం గురించి.. పెద్దలకు తెలియజేయడానికి ఇదే సరైన సమయం. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు కొత్త స్నేహితులు ఏర్పడతారు. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది.  ఆఫీసులో ఉద్యోగులకు అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అలాగే వృత్తిపరమైన భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తి లావాదేవీలు, కోర్టు కేసులు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. 

సింహం (Leo) – ఈ రోజు మీరు మీ భాగస్వామితో హాయిగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. అలాగే ప్రేమికులు తమ బంధానికి సంబంధించి నిజాయతీగా వ్యవహరించడం మంచిది.  నిరుద్యోగులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆకర్షితులవుతారు. క్రీడాకారులు విజయాల బాటలో పయనిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వ్యక్తులు శిక్షణను తీసుకోవడం బెటర్. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు మీ భాగస్వామికి మీతో అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వాటిని మీరు పరిష్కరించుకోవడం మంచిది. అలాగే పిల్లల నుండి నిరాశపరిచే వార్తలు వింటారు. అయినా వారి పట్ల కోపాన్ని ప్రదర్శించక... వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.  

తుల (Libra) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలాగే కొన్ని సంఘటనలు మీ మనసుకి బాధను కలిగింవచ్చు. అయినా సరే నెగటివ్ ఆలోచనలను పెంచుకోవద్దు. మీ నిజాయతీయే మీకు ఎప్పటికీ శ్రీరామరక్ష. వ్యాపారస్తులు క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారతారు. నిరుద్యోగులను అవకాశాాలు వెతుక్కుంటూ వస్తాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు ఎదుర్కొనే కొన్ని పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను తగ్గించుకోండి. రాజకీయ రంగ వ్యక్తులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే  ఆధ్యాత్మిక విషయాలపైకి మనసు మళ్లుతుంది. 

మకరం (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదా ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. ఆఫీసులో ఉద్యోగస్తులు పలు విపత్కర పరిస్థితులలో చిక్కుకుంటారు. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు మీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేదా ఆస్తి సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం కూడా ఉండచ్చు. అలాగే స్నేహితుల నుండి బహుమతులు కూడా స్వీకరిస్తారు. సృజనాత్మక రంగంలోని వారికి పురోగతికి ఉంటుంది. ఫ్రీలాన్సర్స్‌కి  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

మీనం (Pisces) – ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా ఉంటే మంచిది. ప్రేమ బంధాలలో నమ్మకమనేది ముఖ్యమని నమ్మండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.