24 సెప్టెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

24 సెప్టెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (24 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – స్థిరాస్తుల రంగంలోని వ్యక్తులకు  ఈ రోజు మంచి రోజు. అలాగే సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. ఉద్యోగస్తులు కొంచెం శ్రద్ధగా పనిచేయాలి. పెండింగ్ పనులను ముందు పూర్తి చేస్తే మంచిది. ఆడిట్ జరిగే అవకాశాలున్నాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో తొలుత మనస్పర్థలు వచ్చినా.. వివేకంతో తర్వాత ఆ సమస్యలను పరిష్కరిస్తారు. వ్యాపారస్తులు నిర్ణయాలు తెలివిగా తీసుకోవడం మంచిది. ఆఫీసులో ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు విద్యార్థులు అనవసరమైన పనులలో పడి.. సమయాన్ని వృథా చేయకుండా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. అలాగే మీకు సంబంధం లేని వివాదాలలో తలదూర్చకపోవడం మంచిది. ఆస్తి లావాదేవీలు, కోర్టు కేసులు మొదలైనవన్నీ ఒక పరిష్కారదశకు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు బహుమతులు, కానుకలు పొందే అవకాశం ఉంది. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యమైన సమావేశాలకు డుమ్మా కొట్టడం వల్ల.. మీకే నష్టం. అలాగే రాజకీయ రంగంపై ఆసక్తి చూపిస్తారు. ప్రేమికులు తమ బంధంలో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. అలాగే నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. 

సింహం (Leo) – ఈ రోజు ఉద్యోగస్తులకు.. ఆఫీసులో అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కోపాన్ని నియంత్రించుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లండి.  వ్యాపారస్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. వివాహితులు పలు శుభవార్తలు వింటారు.  సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో కొందరి ప్రవర్తన మిమ్మల్ని అసహనానికి గురిచేయవచ్చు. అయినా సరే.. మీ పని చేసుకుంటూ ముందుకు వెళ్లండి. మీ నిజాయతీయే మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంఘంలో కూడా పేరు.. ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపార సమస్యల నుండి సోదరులు లేదా మిత్రుల సహాయంతో బయటపడతారు. ప్రత్యర్థులే మీకు  మిత్రులుగా మారి.. కొన్ని విషయాలలో  సపోర్టుగా వ్యవహరించవచ్చు. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వీలైతే స్వయంఉపాధి పథకాల వైపు కూడా ఆలోచనలు చేయడం మంచిది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు విద్యార్థులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆఫీసులో ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులలో పురోగతి ఉంటుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థిక సంక్షోభం బారిన పడే అవకాశం ఉంది. వివాహితులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యంగా ఉండకపోవడం మంచిది. మీరు కొన్ని సమస్యలలో చిక్కుకున్నప్పుడు.. మీకు మీ భాగస్వామి నుండి నైతిక మద్దతు లభిస్తుంది. 

మకరం (Capricorn) –  ఈ రోజు వ్యాపారస్తులు పలు శుభవార్తలు వింటారు. మీ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త భాగస్వాములు రావచ్చు. అలాగే ఉద్యోగస్తులకు.. తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహితులు సంసార నావను నడిపే విషయంలో.. అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు మీ కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయినా సరే.. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా.. ముందుకు వెళ్లండి. కొన్ని సమస్యలను ఎవరి మనసూ నొప్పించకుండా.. సమయస్ఫూర్తితో, వివేకంతో పరిష్కరించండి. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.   

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త మిత్రులు ఏర్పడతారు. ప్రత్యర్థులు మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పనులు చేయవచ్చు. ఇలాంటి సమయంలోనే కోపాన్ని నియంత్రించుకోండి. ఓపికగా ఉండండి. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.