2 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

2 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 2, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు మీకు, మీ భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉన్నప్పటికీ.. ఏదో తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధిస్తుంటాయి. అయినప్పటికీ ఆత్మ విశ్వాసంతోనే ముందుకు వెళ్లండి. శాంతియుతంగా సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి.  

వృషభం (Tarus) –  ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.  అలాగే ఈ రోజు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. వ్యాపారస్తులకు ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నా.. అనుకున్న టార్గెట్ చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.  

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఫలితాలు అన్నీ ఆశాజనకంగానే ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతాయి. బోనస్‌లు లభిస్తాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. వివాహితులకు సంసారిక సమస్యలు పరిష్కారమవుతాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు మీ స్నేహితులు ఎంతగానో సహాయం చేస్తారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో మీ భాగస్వామి మద్దతు కూడా మీకు లభిస్తుంది. కెరీర్‌కు సంబంధించి మీ శ్రమకు తగిన ఫలితం  లభిస్తుంది. సమాజంలో కూడా మీకు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పాత స్నేహితులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. 

సింహం (Leo) – ఈ రోజు మీకు కొన్ని ప్రతికూల సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపుతడతాయి. అదేవిధంగా పలు వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి చాలా మంచి రోజు. అలాగే ముఖ్యమైన వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. వాణిజ్యవేత్తలకు కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు కళ్యాణ యోగం ఉంది. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు వస్తాయి. విద్యార్థులు కూడా పరీక్షలలో విజయం సాధిస్తారు. 

తుల (Libra) – ఈ రోజు కొన్ని పనులలో మీకు అంతరాయం కలగవచ్చు.  అలాగే అనుకోని సమస్యల వల్ల.. మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ఇరాకటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. కనుక అప్రమత్తంగా ఉండండి. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గొంటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు శారీరక అలసటకు గురవుతారు. అలాగే పనులు కూడా చాలా మందకొడిగా సాగుతాయి. రావాల్సిన డబ్బు అందకపోవడంతో.. కాస్త వ్యాకులతకు గురవుతారు. అయినా సరే.. మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. ఏవైనా సమస్యలు ఎదురైతే.. శాంతియుతంగా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు వివాహితులకు, ప్రేమికులకు చాలా రొమాంటిక్ దినం. తమ భాగస్వామితో హాయిగా, సంతోషంగా గడుపుతారు. అయితే కుటుంబ విషయాలకు వస్తే.. మాత్రం మీరు కొన్ని విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మీ వైపు తప్పు లేనంత వరకు.. ఆత్మవిశ్వాసంతో ముందుకువెళ్లండి. ఎదుటి వారి మాటలు పట్టించుకోకండి.  

మకరం (Capricorn) –  ఈ రోజు ఆ రాశి వ్యక్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, పదోన్నతులు లభించే అవకాశం కూడా ఉంది. స్కిప్ట్ రైటర్లు, సినీ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) -  ఈ రోజు వ్యాపారస్తులకు కొంతలో కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. అపరిచితుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించండి. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే వివాహితులు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. ఆర్థికపరమైన విషయాలలో భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. 

మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు లావాదేవీలు, ఆస్తి లావాదేవీలు మొదలైన విషయాలలో కూడా.. మీ వైఖరి బలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా కొత్త పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తారు. ఉద్యోగస్తులు కొంత మానసిక ఒత్తిడికి గురైనా.. ఆఖరికి పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రశంసలు కూడా దక్కించుకుంటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.