9 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

9 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 9, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అయినప్పటికీ కొన్ని ఊహించని పరిస్థితులు మిమ్మల్ని అసహనానికి గురి చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఆలుమగలు కొన్ని విపత్కర పరిస్థితులలో సహకరించుకోవాల్సిన అవసరం ఉంది.  

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు నిర్లక్ష్యాన్ని వీడాలి. సాధ్యమైనంత వరకు బిజీగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. ఆడిట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

మిథునం (Gemini) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశముంది. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆఫీసులో కూడా మిమ్మల్ని అసహనానికి గురి చేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆలుమగలు తమ అభిప్రాయ భేదాలను తొలిగించుకొని.. సమస్యలను పరిష్కరించుకుంటారు.  వ్యాపారస్తులు బడ్జెట్ విషయంలో అప్రమత్తతతో ఉండాలి. 

కర్కాటకం (Cancer) –   ఈ రోజు ప్రేమికులకు శుభదినం. మీ మనసులోని ఆలోచనలు అన్నీ నెరవేరుతాయి. అలాగే అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆలుమగలు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదే విధంగా కొత్త పరిచయాలు స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.  

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అలాగే నిరుద్యోగులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తిని చూపించే అవకాశాలున్నాయి. ఆలుమగలు కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు విభేదించుకొనే పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలోనే వివేకంతో వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి.  

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రతికూల ఆలోచనలను వీడి.. సానుకూలంగా ముందుకు వెళ్లాలి. కొన్ని అత్యవసర పరిస్థితులలో మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహకారం కూడా పొందే అవకాశం ఉంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శక్తివంచన లేకుండా పనిచేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అలాగే నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు కూడా కొత్త కాంట్రాక్టుల వైపు మొగ్గు చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే ఖర్చుల విషయంలో కూడా అప్రమత్తతతో వ్యవహరించండి. ఆలుమగల భవిష్యత్తు భద్రత కోసం ఇప్పటి నుండే ప్లాన్ చేస్తే మంచిది.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అధికారులను ఆకర్షిస్తాయి. నిరుద్యోగులు కొంచెం ప్రిపేర్ అయి వెళితే.. ఇంటర్వ్యూలో కచ్చితంగా విజయం సాధించడం ఖాయం. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్థిరాస్తులు కొనడానికి ముందడుగు వేస్తారు.  సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగంలోని వారికి కూడా.. ఈ రోజు చాలా బాగుంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించండి. ఈ రాశి వ్యక్తులు భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులకు సైన్ చేస్తారు.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక విషయాలలో స్నేహితులు, సోదరులు తగిన సహాయం చేస్తారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గొంటారు. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది.  

మీనం (Pisces) – ఈ రోజు రాశి వ్యక్తులను పలు సామాజిక సమస్యలు ఆవేదనకు గురిచేస్తాయి. అలాగే  ఉద్యోగస్తులు పలు వివాదాలలో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. అయినా సరే.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం మంచిది. అదేవిధంగా చట్టపరమైన విషయాలలో మీ వైఖరి బలంగా ఉంటుంది. ప్రేమికులు పెద్దలను ఒప్పించడానికి ఇదే మంచి రోజు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.