ADVERTISEMENT
home / Family Trips
మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు..  దీని వేలం వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. దీని వేలం వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

బాలాపూర్ (Balapur) పేరు చెప్పగానే గుర్తొచ్చేది.. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం రోజు జరిగే లడ్డు వేలం పాట. 1994 సంవత్సరంలో మొదలైన ఈ లడ్డు వేలంపాట .. క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం లక్షల ధరలో ఆక్షన్‌కి (Auction) సిద్ధమవుతోంది. ఇక ఈ వేలం పాటలో పాల్గొనేందుకు బాలాపూర్ గ్రామస్తులే కాకుండా.. రాష్ట్ర నలుమూలల నుండి కూడా ప్రముఖులు వస్తుంటారు. దీనిని బట్టి ఈ లడ్డుకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో చెప్పనక్కర్లేదు.

మీకు “వీసా దేవుడు – చిలుకూరు బాలాజీ” గురించి ఈ విశేషాలు తెలుసా…!

ఇక ఈ సంవత్సరం వేలం పాట కొద్దిసేపటి క్రితమే ముగియగా.. రూ 17.60 లక్షలకి ఈ లడ్డుని కొలను రామిరెడ్డి అనే వ్యక్తి  దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది ఈ లడ్డు రూ 16.60 లక్షలు పలకగా.. ఈ సంవత్సరానికి సుమారు 1 లక్ష రూపాయలు అదనంగా పెరిగింది. బంగారు పూతతో తయారుచేసే ఈ 21 కిలోల లడ్డుని .. తాపేశ్వరానికి చెందిన ప్రముఖ స్వీట్ షాపు నిర్వాహకులు తయారుచేస్తారట.

మొత్తం 19 మంది ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనగా.. కొలను వంశానికి చెందిన రామిరెడ్డి దీనిని దక్కించుకోవడం విశేషం. చిత్రమేంటంటే.. అసలు ఈ లడ్డు వేలంపాట మొదలైనప్పుడు.. తొలిసారిగా దక్కించుకుంది కూడా కొలను వంశస్థులే. ఈ సంవత్సరంతో కలిపి మొత్తంగా 9 సార్లు.. వారు ఈ వేలం పాటలో లడ్డుని దక్కించుకోవడం జరిగింది.

ADVERTISEMENT

అయితే మొదటిసారిగా ఈ లడ్డు వేలం జరిగినప్పుడు కేవలం రూ. 450 రూపాయలు మాత్రమే ధర పలికిందట. ఆ మరుసటి ఏడాది రూ. 4500 ధర పలికింది. ఇక ఈ వేలం పాటలో కొనుగోలు చేసిన లడ్డులో కొంతభాగం బంధువులకి, స్నేహితులకి పంచగా.. మిగతా భాగాన్ని తమ పొలాల్లో చల్లడం ఆనవాయతీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల ఆ పొలాల్లో సాగు పెరుగుతుందని కూడా ప్రచారం జరగడంతో.. ఈ లడ్డు వేలంపాటకి అనూహ్యంగా ప్రాధాన్యత పెరిగింది.

ఆ విధంగా ఈ బాలాపూర్ లడ్డు (Balapur Laddu)  వేలంపాటకు దేశవ్యాప్తంగా విశేషమైన ఆదరణ వచ్చింది. అందుకనే ప్రతి ఏడాది ఈ బాలాపూర్ లడ్డు  వేలంపాటలో.. లడ్డు ధర పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

హైదరాబాద్ ట్రెండ్స్: భాగ్యనగరంలోని.. రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ పాయింట్స్ ఇవే..!

ఇక 1994 నుండి 2019 వరకు బాలాపూర్ లడ్డుని వేలంపాటలో దక్కించుకున్న వారి వివరాలు 

ADVERTISEMENT

1994 – కొలను మోహన్ రెడ్డి  (రూ. 450)

1995 – కొలను మోహన్ రెడ్డి -రూ. 4,500

1996 – కొలను క్రిష్ణా రెడ్డి-రూ . 18,000

1997 – కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000

ADVERTISEMENT

1998 – కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000

1999 – కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000

2000 – కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000

2001 – జి. రఘునందన్ చారి -రూ. 85,000

ADVERTISEMENT

2002 – కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000

2003 – చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000

2004 – కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000

2005 – ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000

ADVERTISEMENT

2006 – చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000

2007 – జి. రఘునందన్ చారి -రూ.4.15,000

2008 – కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000

2009 – సరిత -రూ.5,10,000

ADVERTISEMENT

2010 – కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000

2011 – కొలను బ్రదర్స్ -రూ.5,45,000

2012 – పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000

2013 – తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000

ADVERTISEMENT

2014 – సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000

2015 – కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000

2016 – స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000

2017 – నాగం తిరుపతిరెడ్డి- రూ. 15. 60 లక్షలు

ADVERTISEMENT

2018 – శ్రీనివాస్ గుప్తా – రూ 16.60 లక్షలు

2019 – కొలను రామిరెడ్డి – రూ 17.60 లక్షలు

ఏదేమైనా.. చాలా చోట్ల ఎతైన ప్రతిమలతో.. వినాయకు విగ్రహాలు రికార్డులు నెలకొల్పుతుంటే.. ఈ బాలాపూర్ లడ్డు మాత్రం లడ్డు వేలంపాట ద్వారా రికార్డులు సాధించడం గమనార్హం.

రామోజీ ఫిలిం సిటీని సందర్శించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఈ వివరాలు తెలియాల్సిందే..!

ADVERTISEMENT

Featured Image: Representational (Shutterstock)

12 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT