వర్షాకాలంలో లెదర్ వస్తువులు పాడవకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

వర్షాకాలంలో లెదర్ వస్తువులు పాడవకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

లెదర్ బ్యాగ్స్(Leather bags), లెదర్ జాకెట్స్(leather jackets), లెదర్ షూస్ (leather shoes) అంటే ఇష్టపడని వారెవరుంటారు. వాటి కోసం ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి అసలు వెనకాడం. వాటిని ఉపయోగించేటప్పుడు సైతం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే వర్షాకాలంలో(rainy season) సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. అవి పాడైపోతాయి. చాలా ఎక్కువ ధర పెట్టి కొన్న లెదర్ వస్తువులు పాడైపోతే.. చాలా బాధగా ఉంటుంది కదా. వర్షాకాలంలో ఏ సమయంలో వాన పడుతుందో తెలియదు. కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని పాడవకుండా చూడచ్చు.

పాలిష్ చేయాలి

లెదర్ జాకెట్, లెదర్ షూస్ ధరించాలనుకున్నా లేదా లెదర్ బ్యాగ్ మీ వెంట తీసుకెళ్లాలనుకున్నా దానికి కాస్త పాలిష్ చేయడం మంచిది. దీనికోసం వెజిటబుల్ ఆయిల్ లేదా వ్యాక్స్‌తో తయారైన పాలిష్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది లెదర్ బ్యాగ్‌ను మెరుస్తున్నట్టుగా కనిపించేలా చేస్తుంది. అలాగే వాన నీరు బ్యాగ్ పై నిలవకుండా చేస్తుంది. కాబట్టి లెదర్ బ్యాగ్ ఏ మాత్రం పాడవకుండా ఉంటుంది.

పూర్తిగా ఆరేలా

లెదర్ వస్తువులు తడిచినప్పుడు వాటిని వీలైనంత త్వరగా పొడిగా ఆరేలా చూడాల్సి ఉంటుంది. లేదంటే దాని మీద ఫంగస్ పెరిగి పాడైపోతుంది. బ్యాగ్ పైన పొడిగా ఆరితే సరిపోదు. లోపల కూడా తడి లేకుండా చూసుకోవాలి. కాబట్టి బ్యాగ్ లోపల న్యూస్ పేపర్లు కుక్కి.. బ్యాగును ఫ్యాను కింద ఉంచితే లోపల, బయట పూర్తిగా డ్రైగా మారిపోతుంది.

దుమ్ము చేరకుండా..

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. మనం ఉపయోగించే వస్తువులు సైతం కాస్త చెమ్మగా ఉన్నట్టనిపిస్తాయి. ఈ తడికి దుమ్ము, ధూళి తోడైతే.. లెదర్ బ్యాగులు చాలా తక్కువ సమయంలో పాడయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఎప్పుడైనా వర్షాకాలంలో లెదర్ తీసుకుని బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేయడం మరచిపోవద్దు. వర్షం కురిసినా, కురవకపోయినా మెత్తటి బ్రష్ లేదా వస్త్రంతో బ్యాగ్‌ను తుడవాల్సి ఉంటుంది.

Shutterstock

వేడి వస్తువులకు దూరంగా

త్వరగా ఆరిపోతాయి కదా.. అని లెదర్ బ్యాగ్‌లా.. లెదర్ షూ లేదా లెదర్ జాకెట్‌ను ఎండలో మాత్రం ఆరేయద్దు. ఇలా చేయడం వల్ల బ్యాగు ఆరడం ఎలా ఉన్నప్పటికీ పూర్తిగా నాశనమైపోతుంది. ఎండలోనే కాదు హీటర్, బ్లోడ్రయర్ లేదా ఐరన్ బాక్స్ ఉపయోగించి.. లెదర్ వస్తువులను ఆరబెట్టవద్దు. ఇవి లెదర్‌ను నిర్జీవంగా మార్చేస్తాయి. అంతేకాదు బ్యాగు మన్నిక.. చాలా తక్కువ కాలం ఉండేలా చేస్తాయి.

మాయిశ్చరైజ్ చేయాల్సిందే..

మన చర్మాన్ని ఏ విధంగా మాయిశ్చరైజ్ చేస్తున్నామో.. అదే విధంగా లెదర్ బ్యాగ్ కూడా మాయిశ్చరైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం నేచురల్ ఆయిల్స్ కలిగి ఉన్న లెదర్ క్రీం లేదా లెదర్ వ్యాక్స్ ఒకటి కొనుగోలు చేయండి. దీన్ని లెదర్‌తో తయారుచేసిన వస్తువులకు పలుచటి పొరలా రాయాలి. ఇది బ్యాగ్‌ను మెరిపించడంతో పాటు లెదర్ పాడవకుండా చూస్తుంది. అయితే మార్కెట్లో చాలా రకాల లెదర్ పాలిష్ లేదా లెదర్ క్రీములు ఉంటాయి. ఇవి లెదర్‌ను మెరుస్తున్నట్లు కనిపించేలా చేస్తాయి. కానీ వాటి వల్ల లెదర్‌కు ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి నేచురల్ ఆయిల్స్‌తో తయారైన వాటిని మాత్రమే ఉపయోగించడం మంచిది.

లెదర్ వస్తువులను భద్రపరిచే క్రమంలో.. గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు

  1. లెదర్ వస్తువులను ఓ శుభ్రమైన పొడి వస్త్రంలో చుట్టి ఉంచాలి.
  2. ఎయిర్ కండిషన్, హీటర్ ఉన్న గదుల్లో లెదర్ వస్తువులను ఉంచకూడదు. వీటి వల్ల వాటి సహజత్వం దెబ్బతింటుంది.
  3. లెదర్ వస్తువుల సహజమైన మెరుపు కోల్పోకుండా ఉండాలంటే.. మంచి లెదర్ క్రీం లేదా లెదర్ వ్యాక్స్ అప్లై చేయాల్సి ఉంటుంది.
  4. లెదర్ బ్యాగ్‌ను మీరు ప్రతి రోజూ ఉపయోగించనట్లయితే.. దాన్ని ఓ క్లాత్ బ్యాగ్‌లో ఉంచి భద్రపరచాలి. దీనివల్ల బ్యాగ్ పై దుమ్ము, తేమ చేరకుండా ఉంటాయి.
  5. లెదర్ వస్తువులను తరచూ వాడుతుండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీటిని మనం ఉపయోగించే కొద్దీ అందంగా తయారవుతాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.