ఈ విషయాలను మీకు.. మీ బ్రేకప్ మాత్రమే నేర్పగలదు ..!

ఈ విషయాలను మీకు.. మీ బ్రేకప్ మాత్రమే నేర్పగలదు ..!

విడిపోవడం అనేది ఎప్పుడూ మనల్ని బాధిస్తుంది. ఒక బంధం కోసం మనం ఎంతగానో అడ్జస్ట్ అవుతాం. ఎన్నో త్యాగాలు చేస్తాం. అలాంటిది.. ఎంతగానో ప్రేమించిన వ్యక్తితో బంధాన్ని తెంచుకోవాలంటే.. బ్రేకప్  (Breakup) పేరుతో తనకు దూరమవ్వాలంటే ఎంతో బాధగా ఉంటుంది కదా.

అయితే బ్రేకప్ తర్వాత మీకు ఎదురయ్యే ఆ బాధ.. మిమ్మల్ని లైఫ్‌లో మరింత ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుంది. జీవితాంతం గుర్తుంచుకునే పాఠాలనూ చెబుతుంది. ఎందుచేతంటే.. మీ బాయ్ ఫ్రెండ్ నుంచి మీరు విడిపోయినప్పుడు తెలుసుకునే మంచి, చెడు విషయాలే మీ వ్యక్తిత్వాన్ని మరింత బెటర్‌గా మారుస్తాయి. అలా మీ బ్రేకప్ మాత్రమే మీకు నేర్పగలిగే విషయాలేంటంటే..

1. సర్ ప్రైజ్‌లు వేచిచూస్తున్నాయి..

ప్రస్తుతం మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే.. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. మీరు జీవితంలో ముందుకెళ్లిన కొద్దీ.. అద్భుతమైన విషయాలు జరుగుతాయి. మీరు ఊహించని ఎన్నో విషయాలు మీకోసం వేచిచూస్తున్నాయి. జీవితం అనేది ఎన్నో సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుంది. అది మీరు ఎలా ఫీలవుతున్నారని చూడకుండా.. మీకు కొత్త కొత్త సర్‌ప్రైజ్‌లు అందిస్తూనే ఉంటుంది. అందుకే నమ్మకంతో ముందుకెళ్లాలి.

2. బంధం కంటే మీరు ఎంతో ఎక్కువ..

మీ జీవితంలో మీరు ప్రస్తుతం కొనసాగిస్తున్న బంధం ఎంతో ముఖ్యమైంది కావచ్చు. కానీ మీ విలువను అది మార్చలేదు. కేవలం ఒక బంధం మాత్రమే మిమ్మల్ని నిర్వచించలేదు. మీకంటూ మీరు విలువ ఇచ్చుకోవడం ఎంతో అవసరం. మీకు ఉద్యోగం, కుటుంబం, స్నేహితులు.. ఇలా అన్నీ ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు మీరున్నారు. ఒక బంధం తెగిపోగానే మీ జీవితం ముగిసిపోయినట్లు కాదు.. ఆ బంధం కంటే మీరు ఎంతో గొప్పవారని గుర్తుంచుకోవాలి.

3. వర్తమానంలో బతకండి..

'ప్రతి రోజూ.. మనకు దేవుడిచ్చే ఓ కొత్త బహుమతి' అని చెప్పడం మనం వింటూనే ఉంటాం. మీ గతంలో ఏదైనా జరిగి ఉండచ్చు. అయితే.. దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల.. ఏమాత్రం ప్రయోజనముండదు. సరికదా.. మీ మనసులో బాధ గూడుకట్టుకుపోతుంది. అందుకే ఈరోజు పై మీ దృష్టి పెట్టండి.

మీ అందమైన భవిష్యత్తు కోసం కలలు కంటూ.. దానికోసం ఏం చేయాలో గుర్తించండి. అయినా మీ ఎక్స్ బాగా గుర్తుకు వస్తుంటే .. మీ స్నేహితులతో మాట్లాడండి. లేదా కుటుంబ సభ్యులతో కాసేపు గడపండి. వాళ్లు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీకు అర్థమవుతుంది.

4. మీరే ముఖ్యం..

ఎప్పుడైనా సరే.. మీకు అందరి కంటే ముఖ్యమైన వ్యక్తి మీరే. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి మళ్లీ ఆలోచించాల్సిన లేదా బాధపడాల్సిన అవసరం  ఉండదు. కొన్ని రోజుల పాటు మీరు తీసుకున్న నిర్ణయం తప్పేమో అని అనుమానం వస్తుంది. బాధగా ఉంటుంది.

కానీ మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే.. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నిర్ణయం తీసుకుంటే.. అది మీకు ఎప్పుడూ ఆనందాన్నే ఇస్తుంది. బ్రేకప్ మీకు నేర్పే పాఠం ఇదే. మీ జీవితంలో ఒకానొక సందర్భంలో మీతో బంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి కంటే.. మీకు మీరే ముఖ్యం. అందుకే.. మీరు తీసుకున్న నిర్ణయాలకు బాధపడకండి. 

5. బంధానికి కీ అదే..

బ్రేకప్ తర్వాత మీకు మొదటిగా గుర్తొచ్చే విషయం.. మీ ఇద్దరి గొడవలకు కారణమైన సందర్భం. మీ ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకపోవడం కూడా దానికి కారణం కావచ్చు. ఏ విషయం గురించైనా సరిగ్గా మాట్లాడుకొని ఉంటే.. 'మీ గొడవ సమసిపోయేది కదా' అనిపిస్తుంది. అయితే.. దాని గురించి ప్రస్తుతం చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ మీకు అది ఓ పాఠంలా మాత్రం గుర్తుండిపోతుంది.

ఏ బంధాన్నైనా సరిగ్గా కొనసాగించాలంటే.. అవతలి వ్యక్తితో మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే బ్రేకప్ తర్వాత మీతో మీరు మాట్లాడుకోవడంతో పాటు.. అవతలి వ్యక్తితో మాట్లాడే పద్ధతిని కూడా మీరు తెలుసుకుంటారు.

5. మీరే మీ బెస్ట్ ఫ్రెండ్

జీవితం కొన్ని సందర్భాల్లో సమస్యల చిక్కుముళ్లు వేసి మనల్ని అగాథంలో పడేయాలని చూస్తుంది. అయినా సరే.. మనం పైకి లేచే ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మనల్ని ఇష్టపడుతున్నా.. ఎలాంటి కష్టం రానప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం అంత ఎక్కువగా ఉండదనే చెప్పాలి. మరి, బ్రేకప్ లాంటి కష్టాలు మన జీవితంలోకి వచ్చి.. మన విలువను మనకు చెబుతాయి. 'మన బెస్ట్ ఫ్రెండ్ మనమే' అని చాటుతాయి. మనల్ని మనం ఎక్కువగా ప్రేమించేలా చేస్తాయి.

8. గతం భవిష్యత్తును మార్చదు..

అవును.. ఒక వ్యక్తితో మీ బంధం నిలవలేదు. బ్రేకప్ అయిపోయింది. అయితేనేం.. అది మీ విలువను ఏమాత్రం మార్చదు. అలాగే మీ భవిష్యత్తునూ ఏమాత్రం మార్చలేదు. భవిష్యత్తులో మరో వ్యక్తి మీ జీవితంలోకి రాలేరని..  ఇప్పుడే మీరు చెప్పలేరు. ప్రతి కథకు ఓ హ్యాపీ ఎండింగ్ ఉంటుందని.. ప్రతి చీకటి దారి చివర్లో వెలుగు కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్ధులను చేసుకొని ముందుకెళ్లండి.

7. విలువ మారదు..

మీతో పాటు ప్రేమలో ఉన్న వ్యక్తి.. మీకు జీవితంలో చాలా దగ్గరి వ్యక్తి అయి ఉండచ్చు. తను లేకుండా మీరు జీవితాన్ని ఊహించుకోలేకపోయి ఉండచ్చు. కానీ మీ విలువ తనని బట్టి ఆధారపడి ఉండదు. తనే కాదు.. మీ ఉద్యోగం, బంధం, స్నేహితులు, బాస్ వీళ్లెవ్వరినీ బట్టి కూడా మీ విలువ మారదు. మీరు చేసే పనుల వల్లే.. మీ విలువ మారుతుంది. కాబట్టి మీ జీవితంలో మంచి పనులు చేస్తూ ముందుకెళ్లండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.