ADVERTISEMENT
home / Health
ఈ వింత నిజాలు మిమ్మల్నీ ఆలోచించేలా చేస్తాయి.. ఓసారి చెక్ చేయండి..

ఈ వింత నిజాలు మిమ్మల్నీ ఆలోచించేలా చేస్తాయి.. ఓసారి చెక్ చేయండి..

మన శరీరం చూడ్డానికి సింపుల్‌గానే కనిపించినా.. కొన్నిసార్లు దాని తత్వం ఎంతో సంక్లిష్టంగా కనిపిస్తుంది.  మన శరీరంలో ఎప్పుడూ ఏవో ఒక మార్పులు జరుగుతూనే ఉంటాయి. అవి ఎందుకు జరిగాయి.. ఎలా జరిగాయి? అనే విషయాలు మనకు తెలియకపోవచ్చు. అయితే సైకాలజీ పరిశోధకుల రీసర్చ్ ప్రకారం.. మన శరీరంలో జరిగే ప్రతీ చర్యకు మన హావభావాలే కారణమట. మన హావభావాలకు తగినట్లే మన శరీరంలో జీవ క్రియలు ఉంటాయట.

వివరంగా చెప్పాలంటే.. మన ఫీలింగ్స్‌కి.. వివిధ రకాల హావభావాలకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. మన మెదడు ఏం ఆలోచిస్తుందో.. దానికి తగినట్లే మన శరీరం కూడా వ్యవహరిస్తుంది. అలా వ్యవహరిస్తుందన్న సంగతి కూడా మనకు కొన్ని సార్లు తెలీదు. చిత్రమేంటంటే మన శరీరానికి సంబంధించి కూడా అనేక వింత నిజాలు.. ఫన్ ఫ్యాక్ట్స్ (fun facts)  ఉన్నాయి. ఈ క్రమంలో మనం కూడా..  మన శరీరంలోని వివిధ యాక్షన్లకు కారణమవుతున్న ఆ ఆసక్తికర నిజాలేంటో తెలుసుకుందాం.

1. ముద్దులు పెట్టని వారితో పోల్చుకుంటే.. ముద్దులు పెట్టుకునే వారు ఎక్కువ కాలం జీవిస్తారట. దీనికి హార్మోన్లే కారణమవుతాయి. ముద్దు పెట్టుకున్నప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ADVERTISEMENT

2. తమకు ఏదైనా విషయం అర్థం కానప్పుడు.. వందలో తొంభై శాతం మంది నవ్వేస్తారట. ఎందుకంటే.. వారికి ఏం చేయాలో తెలీదు కదా మరి. 

3. ఒక వ్యక్తిని మీరు ఏదైనా అడగాలనుకుంటే.. మీ చేతులు వారి భుజంపై ఉంచి మాట్లాడాలట. అప్పుడు వారు ఒప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట.  స్పర్మకున్న శక్తి అలాంటిది. 

4. మనం అబద్ధం చెబుతున్నప్పుడు.. మన ముక్కు కాస్త వేడిగా అవుతుంది. ఓసారి చెక్ చేసుకోండి.

ADVERTISEMENT

5. అరగంటలో మన శరీరం (human body) విడుదల చేసే వేడితో.. రెండు లీటర్ల నీటిని సులువుగా వేడి చేయవచ్చు. ఇలా  వేడెక్కేందుకే ఎన్నో క్యాలరీలను ఖర్చు చేస్తుంది మన శరీరం. 

6. తమ భర్త లేదా భార్యను స్నేహితులుగా భావించేవారు.. మిగిలిన వారితో పోల్చుకుంటే తమ వివాహ జీవితంలో రెండు రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంటారట. దగ్గరితనం పెరుగుతుంది కదా మరి.

7. రోజుకు ఓ వంద సార్లు నవ్వడం వల్ల.. పదిహేను నిమిషాల పాటు సైక్లింగ్ చేసినంత ఫలితం లభిస్తుంది. కావాలంటే మీరు ఇలా చేసి మీ బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. 

ADVERTISEMENT

8. మన ఆలోచనల ప్రభావం మన శరీరం పై ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే మనం బాధలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేదనిపిస్తుంది. నిజమే కదా.

9. మీరు కలలో ఎక్కడైనా మూత్రం పోస్తుంటే.. నిజంగానే మీరు బెడ్ కూడా పై మూత్ర విసర్జన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మీకలా ఎప్పుడైనా జరిగిందా? 

10. ఆహారం తిన్న తర్వాత మన శరీర రక్త పోటు తగ్గుతుంది. దీనివల్లే మెదడు విశ్రాంతి కోరుకుంటుంది. అందుకే నిద్ర వస్తున్న భావన కలుగుతుంది. ఆ సమయంలో పడుకుంటే.. త్వరగా నిద్ర పడుతుంది కూడా. 

ADVERTISEMENT

11. మీకు తెలిసిన వ్యక్తులకు ఎవరైనా.. మీ గురించి మంచి చెప్పినప్పుడు దాన్ని అనుమానిస్తారు. కానీ మీ గురించి చెడుగా చెబితే మాత్రం.. దాన్ని వెంటనే నమ్ముతారు. మన మెదడు పవర్ అలాంటిది. 

12. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేవారు.. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ గురించి తక్కువ ఆలోచించడం వల్ల వారు భయాలను దూరంగా పెడుతుంటారు. 

13. ఎక్కువగా సిగ్గు పడే స్వభావం కలవారు.. ఇతరులతో పోల్చితే ఎమోషనల్‌గా ఉంటారు. వారిలో దయ కూడా ఎక్కువే. ఇతరులు వారిని పూర్తిగా నమ్మవచ్చు.

ADVERTISEMENT

14. ఎవరైనా ఒక వ్యక్తి చాలా ఎక్కువగా నిద్రపోతున్నారంటే వాళ్లు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు లేదా కంగారు పడుతున్నారు అని అర్థం.

15. మిగిలిన రోజుల కంటే మీ పుట్టిన రోజున మీరు మరణించే అవకాశాలు 14 శాతం ఎక్కువగా ఉంటాయట. పార్టీలు, పబ్బులు అంటూ తిరగడం వల్ల మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో కారణాలుంటాయట. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
11 Sep 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT