మరోసారి చదరంగంలో సత్తా చాటిన 'కోనేరు హంపి'.. 'ఫిడే' ప్రపంచ గ్రాండ్ ప్రీలో అద్భుత విజయం

మరోసారి చదరంగంలో సత్తా చాటిన 'కోనేరు హంపి'.. 'ఫిడే' ప్రపంచ గ్రాండ్ ప్రీలో అద్భుత విజయం

(Telugu Grandmaster Koneru Humpy wins Skolkovo FIDE Women’s Grand Prix)

తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు మేటి చదరంగ క్రీడాకాారిణిగా తనదైన శైలిలో రాణించిన కోనేరు హంపి.. మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటింది. తన పునరాగమనంలో భాగంగా తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. రష్యాలోని స్కాల్‌కోవోలో జరిగిన మహిళల ప్రపంచ గ్రాండ్ ప్రీలో 8 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచి.. విజయం సాధించింది. గ్రాండ్ ప్రీ సిరీస్‌లో మొత్తం నాలుగు టోర్నీలు ఉండగా.. ఈ టోర్నీలు పూర్తి అయ్యేసరికి.. చివరి రెండు స్థానాలలో నిలిచిన క్రీడాకారిణులు మాత్రమే క్యాండిడేట్స్ మ్యాచ్ ఆడతారు. 

ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు ప్రపంచ టైటిల్ కోసం మళ్లీ పోటీ పడతారు. ప్రస్తుతం ఒక టోర్నీ మాత్రమే జరిగింది. అందులో హంపి గెలిచింది. మిగతా మూడు టోర్నీలు త్వరలో మొరాకో, లుసానె, సార్దినియా ప్రాంతాలలో జరగనున్నాయి.

తొలి టోర్నీ ఆఖరి మ్యాచ్‌లో హంపి ప్రపంచ ఛాంపియన్ వెంజున్ జు (చైనా) తో తలపడి.. మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇదే టోర్నీలో మరో భారత చదరంగ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక.. అయిదు పాయింట్లతో ఆరవ స్థానంలో నిలవడం గమనార్హం. 

చదరంగం.. నా జీవితంలో అంతర్భాగం: పద్మశ్రీ గ్రహీత హారిక ద్రోణవల్లితో ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్‌లో గుడివాడలో జన్మించిన కోనేరు హంపి.. 2007లో తొలిసారిగా మహిళల చదరంగ ర్యాంకింగ్స్‌లో 2600 పాయింట్లు సాధించి.. ఆ ఘనత పొందిన తొలి భారతీయురాలిగా వార్తలలో కెక్కింది. మహిళల చదరంగంలో పిన్న వయసులోనే టైటిల్ పొందిన లెజెండ్ జూడిత్ పోల్గర్ తర్వాత.. రెండవ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.

అంతే కాదు అతి పిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా పొంది సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2007లో భారత ప్రభుత్వం కోనేరు హంపిని.. పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

 

అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట

హంపికి అయిదు సంవత్సరాల వయసులోనే చదరంగం పై అమితమైన ఆసక్తి ఏర్పడింది. ఆమె తండ్రి కోనేరు అశోక్ తనను ఎంతగానో ప్రోత్సహించేవారు. 2014లో హంపికి వివాహమైంది. తనకు బిడ్డ పుట్టాక.. దాదాపు 15 నెలలు ఆమె చదరంగానికి దూరంగా ఉంది. అయితే పునరాగమనంలో భాగంగా ఆడిన తొలి గేమ్‌లోనే హంపి.. విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం హంపి.. ఓన్‌ఎన్‌జీ‌సీ సంస్థలో ఉద్యోగిని. 2003లో హంపిని ప్రతిష్టాత్మక అర్జున  పురస్కారం వరించింది. 

సమాజం గొడ్రాలు అని ఏడిపిస్తే.. మొక్కలు ఆమెను వృక్షమాతను చేశాయి..!

2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో హంపి.. స్వర్ణ పతకాన్ని మన దేశానికి అందించింది. తాజాగా జరిగిన మహిళల ప్రపంచ గ్రాండ్ ప్రీలో 8 పాయింట్లతో హంపి.. అగ్ర స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆమె తర్వాతి స్థానాలలో 7.5 పాయింట్లతో వెంజున్ జు (చైనా) ద్వితీయ స్థానంలో.. 6.5 పాయింట్లతో అలెగ్జాండ్రా గోర్యాచిక్నా మూడవ స్థానంలో (రష్యా) నిలిచారు. వీరందరూ మొరాకోలో జరిగే పోటీలో మళ్లీ పోరుకి సిద్ధమవుతారు.

మరి.. ప్రపంచ టైటిల్ కోసం.. మరోసారి తనను తాను నిరూపించకుకోవడానికి బరిలోకి దిగిన.. మన చదరంగ దిగ్గజం కోనేరు హంపికి మనం కూడా చెప్పేద్దామా ఆల్ ది బెస్ట్. 

Featured Image: Twitter.com/All India Chess Federation

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.