ఈ రాశుల వారి "మైండ్ పవర్" చాలా సూపర్. ఈ లిస్ట్‌లో మీ రాశి ఉందా..? చెక్ చేసుకోండి..!

ఈ రాశుల వారి "మైండ్ పవర్" చాలా సూపర్. ఈ లిస్ట్‌లో మీ రాశి ఉందా..? చెక్ చేసుకోండి..!

కొందరు వ్యక్తులు పుట్టుకతోనే తెలివైనవారని (Intelligent) అంటుంటారు పెద్దలు. తెలివి తేటలంటే కేవలం చదువులో ముందుండడం మాత్రమే కాదు..సరైన సమయంలో తెలివిని ఉపయోగించడం కూడా తెలివి గలవారి లక్షణమే. తన నిర్ణయాలు తను తీసుకోవడంతో పాటు.. మారిపోయే ప్రపంచానికి తగినట్లుగా వ్యవహరించగలిగే నేర్పు ఉండాలి. ఇబ్బంది ఎదురైన సందర్భంలో.. అందరికంటే వేగంగా ఎవరి బుర్ర పనిచేస్తుందో వారే నేర్పరులు. ప్రతి ఒక్కరికీ బుర్ర ఒకేలా ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించడంలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది.

అయితే ఓ వ్యక్తి తెలివి తేటలు ఎలా ఉంటాయో.. వారి రాశి (zodiac sign) ప్రకారం కూడా తెలుస్తుందట. పుట్టుకతోనే కొన్ని రాశుల వారు స్వతహాగా తెలివితో పుడతారట. మిగిలిన రాశుల వారితో పోల్చితే.. కొందరికి తెలివి ఎక్కువగా ఉంటుందట. మరి, ఆ రాశులేవో తెలుసుకుందాం రండి.

వృశ్చిక రాశి

జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి వారు చాలా ఇంటలిజెంట్. అంతేకాదు.. చాలా సీరియస్ కూడా. ఎంతో అట్రాక్టివ్.. అందమైన వారు మాత్రమే కాదు.. తెలివిలో కూడా వీరు అందరి కంటే ముందుంటారట. క్లిష్టమైన సందర్భాల్లో వీరి మెదడు చాలా వేగంగా పనిచేస్తుందట. వీరికి నేర్చుకునే తత్వం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తే.. వారి ప్రవర్తనతో పాటు ఇతర అంశాల ద్వారా చిన్న క్లూ దొరికినా దాన్ని గుర్తించేస్తారు. అందుకే వారి తెలివితేటలు చాలా అపారమైనవని చెప్పుకోవచ్చు.

Shutterstock

కన్య రాశి

ఈ రాశి వారు చాలా సైలెంట్‌గా, రిజర్వ్‌డ్ గా ఉంటారని చాలామంది భావిస్తుంటారు. అయితే వారి ఈ ప్రవర్తన కేవలం అవతలివారిని నిశితంగా పరిశీలించడానికి మాత్రమే అని వారికి తెలుసు. వీరు చాలా తెలివివైన వ్యక్తులు. వీరి దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం తప్పక ఉంటుంది. అంతేకాదు.. వీరు చాలా వేగంగా ఆలోచించగలుగుతారు. వీరితో స్నేహం చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు.

మేష రాశి

ఈ రాశి వారికి అన్నింటికంటే ముఖ్యమైన ఆయుధం వారి సిక్స్త్ సెన్స్. వీళ్లు చాలా వేగంగా ఆలోచిస్తారు. అంతే వేగంగా తీసుకున్న నిర్ణయాలను అమల్లో పెడతారు కూడా. ప్రతి విషయంలోనూ వీరి ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. ఇలాంటివారిని మోసం చేయడం చాలా కష్టం. వీరిని ఫూల్ చేయాలనుకునేవాళ్లు వాళ్లే ఫూల్ అవుతారు తప్ప.. వీరిని మాత్రం ఏమీ చేయలేరు. వీరి మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇవన్నీ పాజిటివ్ ఆలోచనలే కాబట్టి.. వీరి మనస్తత్వం కూడా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు.

Shutterstock

సింహ రాశి

ఆత్మవిశ్వాసం సక్సెస్‌కి మొదటి మెట్టు అనే వాక్యం.. వీరి విషయంలో నిజం అని చెప్పుకోవచ్చు. ఈ రాశిని ఆత్మవిశ్వాసం నిండిన రాశిగా చెప్పుకోవచ్చు. ఇది వారిని ఇటు వ్యక్తిగత జీవితంతో పాటు.. అటు ప్రొఫెషనల్ జీవితంలో కూడా స్టార్‌గా మారుస్తుంది. అయితే వీరు అవసరం లేని విషయాల్లో.. తమ తెలివిని అస్సలు ఉఫయోగించరు. ఒకటి సాధించాలని టార్గెట్ పెట్టుకొని.. దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు.. ప్రతి పని తమదైన రీతితో చేస్తుంటారు. తమ పనిలో ఎవరైనా అడ్డు తగిలితే వీరికి చాలా కోపం వస్తుంది.

మకర రాశి

ఈ రాశి వారి ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. మార్కెట్లు, ట్రెండ్స్ అర్థం చేసుకోవడంలో కూడా వారు ముందుంటారు. ఈ రాశి వారు చాలా కష్టపడి ఎంతో ఫేమస్ అవుతారు కూడా. తమ తెలివిని ఉపయోగించి ఎవరి సహాయం లేకుండానే జీవితంలో ముందుకెళ్తారు. మిగిలిన రాశుల వారితో పోల్చితే.. చదువుల్లో కూడా వీరు చాలా ముందుంటారు. ఎంత క్లిష్టమైన సమస్యకైనా వీరి దగ్గర పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ల ఆలోచన ఆగిపోయిన దగ్గర వీరి ఆలోచన మొదలవుతుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.