మొదటి రాత్రి అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? వీరి అనుభవాలు వినండి .!

మొదటి రాత్రి అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా? వీరి అనుభవాలు వినండి .!

ప్రేమ పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి (wedding).. ఏదైనా సరే.. మొదటి రాత్రి (first night) అనగానే దాన్నో విభిన్నమైన అనుభవంగా భావిస్తారందరూ. మనసులో దీనికి సంబంధించి వేలాది ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ఒకరికొకరు తెలియకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వారు.. ఒకరినొకరు తెలుసుకోవడానికి ఈ రాత్రి ఉపయోగపడితే.. ముందుగానే ఒకరినొకరు అర్థం చేసుకున్న జంటలు ఈ సందర్భం కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తుంటారు.  ఈ రాత్రి కోసమే  ఇన్నర్ వేర్, పెర్ఫ్యూమ్‌లు, మేకప్ వంటివన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు.

అసలు మొదటి రాత్రి ఎవరైనా ఎలా గడుపుతారు? ఆ సమయంలో అందరూ ఒకేలా వ్యవహరిస్తారా? శృంగారంలో పాల్గొని మొదటి అనుభవాన్ని సొంతం చేసుకుంటారా? లేక ఇద్దరూ నిద్రపోతారా? ఇలా మొదటి రాత్రి గురించి చాలామందికి.. చాలా సందేహాలు కలగడం సహజం. అయితే అందరి విషయంలోనూ ఒకేలా జరగాలని లేదు. కొందరు మహిళలు మాతో వారి మొదటి రాత్రి అనుభవాన్ని పంచుకున్నారు. వారి అనుభవాలు వేటికవే విభిన్నం. మనం కూడా వారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఆ మొదటి రాత్రి అనుభవం గురించి ఏం చెప్పారో.. వారి మాటల్లోనే విందాం..

1. పూలు లెక్కబెట్టారట..

మా అన్నయ్య పెళ్లి జరిగినప్పుడు.. వారి మొదటి రాత్రి కోసం గది అలంకరణకు ఎంతో శ్రమించాం. గదినంతా పూలతో అలంకరించాం. సినిమాల్లో చూపించినట్లు స్వీట్లు, పండ్లు అన్నీ సిద్ధం చేశాం. అయితే ఆ తర్వాతి రోజు ఉదయాన్నే మా వదినను ఆటపట్టించే క్రమంలో.. మొదటి రాత్రి గురించి అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచింది.

ఆ రోజు రాత్రి నిద్రపోయే వరకూ వాళ్లిద్దరూ పూలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారట. ఎవరు గెలిస్తే వాళ్లకు ఓ బహుమతని అన్నయ్య చెప్పడంతో వాళ్లిద్దరూ ఆ ఆట ఆడారట. అది నాకు అప్పుడు చాలా ఫూలిష్‌గా అనిపించింది. కానీ నాకు పెళ్లయ్యాక.. మా మొదటి రాత్రి సమయానికి లోపలికి అడుగు పెట్టగానే.. నాలుగు వైపులా గోడకు పూలు అతికించి ఉంచారు.

అప్పుడు నేను 'వీటిని లెక్కబెట్టడానికే ఓ రాత్రంతా పడుతుంది. అప్పుడు  వదిన చెప్పింది నిజమే కావచ్చని'  అనుకున్నాను. అయితే  మేం మాత్రం పూలు లెక్కబెట్టకుండా.. ఆరోజు రాత్రి నిద్రొచ్చే వరకూ మాట్లాడుకుంటూ గడిపాం.

2. మొదటి అనుభవం ఆరోజే..

మేం ఇద్దరం ప్రేమించుకొని పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నాం. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం మాకు పెళ్లికి ముందు నుంచే అలవాటు. సెక్స్ గురించి ఆలోచించేందుకు మాకు పెద్దగా సమయం దొరకలేదు. పెళ్లి సమయానికి కూడా.. సెలవు పెట్టడానికి ముందు ఆఫీస్ పని మొత్తం పూర్తి చేయాల్సి వచ్చింది.

విశ్రాంతి తీసుకోవడానికే సమయం దొరికేది కాదు. పెళ్లికి ముందు కూడా.. కొన్ని రోజుల ముందు సెలవు పెట్టినా.. పెళ్లి పనులు, కార్యక్రమాలతోనే అది సరిపోయింది. 

మేమిద్దరం అసలు సెక్స్ గురించి ఆలోచించలేదు. మొదటి రాత్రికి ముందు.. మా పెద్దవాళ్లు పూల బంతులతో ఆటలు వంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వాటి కోసమే నేను మొదటి సారి మా గదిలోకి అడుగుపెట్టాను. గదిలో స్వీట్లు, పండ్లు నింపేశారు. బెడ్‌తో పాటు గది మొత్తాన్ని పూలతో అలంకరించారు. మేం బంతాట ఆడుతుంటే అంతా నవ్వుకునేవారు.

అప్పటికే మేమిద్దరం కలిసి పది రోజులు దాటిపోవడంతో.. ఎప్పుడు వాళ్లందరూ వెళ్లిపోతారా..? అని వేచి చూస్తున్నాం. మా ఆటలన్నీ ఎంతో రొమాంటిక్‌గా ఉంటాయి. వారందరూ వెళ్లిపోయిన తర్వాత.. మేమిద్దరం ఎన్నో రోజుల నుంచి ఒకరి కోసం ఒకరం వేచి చూస్తున్న ఫీలింగ్‌తో ఒక్కటయ్యాం. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను.

3. ఆలోచిస్తూ కూర్చున్నాం..

మొదటి రాత్రి అందరూ అనుకున్నట్లుగా ఏమీ జరగదు. చాలామంది జంటలు ఏం చేయాలా? 'మొదటి అడుగు నేను వేస్తే.. అవతలి వ్యక్తి ఏం అనుకుంటారా?' అని ఆలోచిస్తూ కూర్చుంటారు. వేరే ఏవేవో మాటలు మాట్లాడతారు. ఆ రాత్రి మామూలుగా మాట్లాడడం కూడా.. చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. మేం కూడా అలాగే చేశాం. అయితే ఆ తర్వాతి రోజు నుంచి ఇద్దరం మామూలుగా మాట్లాడుకోవడం ప్రారంభించాం.

4. అలసటతో నిద్రపోయాం..

పెళ్లి రోజు రాత్రే.. మా మొదటి రాత్రి కూడా జరిగింది. గదిలోకి వెళ్లగానే నేను చీర మార్చుకొని మామూలు చీర కట్టుకున్నా. నగలు కూడా తీసేశాను. ఆ తర్వాత మా ఆయన గదిలోకి వచ్చారు. కానీ పెళ్లి ముందు రోజు, ఆ రోజు ఎన్నో వేడుకలలో పాల్గొనడం వల్ల మేమిద్దరం బాగా అలసిపోయాం. అందుకే ఆ రోజు ఇంకేమైనా జరగాలని ఆశించడం కూడా పొరపాటే అనిపించింది. ఇద్దరిలో ఏమాత్రం శక్తి లేకపోవడంతో.. కాసేపు మాట్లాడుకొని నిద్రపోయాం.

5. తను ఒప్పుకోలేదు..

ఈ ఘటన నా విషయంలో జరగలేదు. కానీ మా కజిన్ పెళ్లిలో మాత్రం జరిగింది. అమ్మాయికి ఇరవై రెండేళ్లుంటాయేమో.. అలాగే అబ్బాయికి 27 సంవత్సరాలు. ఇద్దరికీ పెద్దలు సంబంధం చూసి వివాహం జరిపించారు. పెళ్లయ్యాక మొదటి రాత్రికి ముందు.. ఆటల సమయంలో తను చాలా డల్‌గా ఉంది. ముఖంలో నవ్వే లేదు. అమ్మానాన్నలపై బెంగ పడుతుందేమో అనుకున్నాం.

ఆ రోజు రాత్రి కూడా ఏమీ జరగలేదట. ఆ తర్వాత కూడా చాలా రోజులు ఆ అబ్బాయి.. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లడానికి.. తనని ముట్టుకోవడానికి ప్రయత్నించేవాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం చిరాగ్గా దూరం జరిగేది. ముందు మేమంతా అది సిగ్గేమో అనుకున్నాం. కానీ ఆ తర్వాతే తెలిసింది. ఆ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదని.. అలాగే ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని. ఈ విషయం తెలిసి ఇద్దరూ చాలా గొడవ పడ్డారు. ఆఖరికి ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి.. మరో పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నాడు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.