ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పీరియడ్స్ సమయంలో.. ఓ పద్థతి వల్ల ప్రయోజనాలెన్నో.. అవేంటంటే?

పీరియడ్స్ సమయంలో.. ఓ పద్థతి వల్ల ప్రయోజనాలెన్నో.. అవేంటంటే?

పీరియడ్ (period).. మహిళలను ప్రతి నెలా పలకరించే బంధువు లాంటిది. పీరియడ్స్ రావడం ఓ రకంగా ఆరోగ్యానికి చిహ్నమే అయినా.. అది వచ్చిందంటే ఎంతో అసహనానికి గురవుతాం. కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, ఒళ్లు నొప్పులు వంటివి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అయితే ఓ చిన్న పని వల్ల వీటన్నింటికీ చెక్ పెట్టేయొచ్చంటే నమ్ముతారా?

అది ఇంకేదో కాదు.. సెక్స్‌లొ పాల్గొనడం లేదా పెళ్లి కాని వాళ్లయితే స్వయం తృప్తి పద్ధతుల ద్వారా వీటిని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మాస్టర్బేషన్ (masturbation) ద్వారా కూడా పలు ఉపయోగాలున్నాయి. మిమ్మల్ని మీరు సంతోషపరచుకోవడానికి.. స్వయం తృప్తి కోసం చేసుకునే ఈ ప్రక్రియ వల్ల ఆరోగ్యానికీ మంచిదే. అవేంటో తెలిస్తే..  మీరూ వాటిని కచ్చితంగా  ఫాలో అయిపోతారు. 

1. కడుపు నొప్పి, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

పిరియడ్ వచ్చే ముందు మన శరీరంలో ఎన్నో రకాల మార్పులు సంభవిస్తుంటాయి. కొన్ని సార్లు దీనివల్ల మన కడుపు, నడుము భాగాల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. మరికొందరిలో తల నొప్పి కూడా వస్తుంటుంది. ఇక కండరాల్లో నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల.. ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వీటికి బదులుగా సహజంగా ఆ నొప్పులు తగ్గించుకోవడం మంచిది. మాస్టర్బేషన్ వల్ల ఈ నొప్పులన్నీ తగ్గిపోతాయట. ఇది ఎన్నో పరిశోధనల్లో తేలింది. నిజమేంటో తెలుసుకోవాలంటే మీరూ ఓసారి ప్రయత్నించాల్సిందే.

ADVERTISEMENT

2. మూడ్‌ని బాగు చేస్తుంది.

సెక్స్‌లో పాల్గొనడంతో పాటు.. మాస్టర్బేషన్ వల్ల కూడా మూడ్ వస్తుంది. ఈ మూడ్ మనల్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. కంగారును తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేయడం వల్ల ఆనందంగా ఫీలయ్యే వీలుంటుంది. సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎంత ఆనందంగా ఫీలవుతామో.. మాస్టర్బేషన్ వల్ల కూడా అంతే లేదా.. అంతకంటే ఎక్కువగా ఆనందం పొందవచ్చు. 

3. హెవీ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది.

పిరియడ్ సమయంలో కొందరికి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. సాధారణంగా పిరియడ్ అంటే మన గర్భాశయం లైనింగ్ వూడిపోయి రక్తంతో కలిసి బయటకు రావడం. పిరియడ్ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం లేదా మాస్టర్బేషన్ వల్ల ఈ పొర త్వరగా ఊడిపోయి బయటకు వచ్చే వీలుంటుంది. దీనివల్ల బ్లీడింగ్ ఎక్కువగా కాకుండా ఉండడంతో పాటు.. పిరియడ్ కూడా తక్కువ రోజుల్లో పూర్తవుతుంది. దీన్ని కోరుకోని వారెవరుంటారు చెప్పండి? ముఖ్యంగా రక్తహీనత వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని ఉపయోగించడం వల్ల.. రక్త హీనత ఎక్కువవకుండా ఉంటుంది. 

ADVERTISEMENT

4. మీరు సెక్సీగా కనిపించేలా చేస్తుంది.

మనం అనుకున్నది చేయగలిగితే ఎంతో పవర్ ఫుల్‌గా ఫీలవుతాం. మాస్టర్బేషన్ చేసిన తర్వాత కూడా అలాగే ఫీలవుతాం. మీకేం కావాలో మీకు అర్థమవుతుంది. దాన్ని పొందేందుకు ఏమాత్రం భయం లేకుండా మీ ప్రయత్నం మీరు చేస్తారు. అందుకే ఇది మీ దృష్టిలో.. మిమ్మల్ని సెక్సీగా, ఆత్మవిశ్వాసం నిండి ఉండేలా చేస్తుంది. ఇది మీ మూడ్‌ని ఆనందంగా మారుస్తుంది.                                             

5. హార్మోన్లు బాగా విడుదలవుతాయి..

పిరియడ్ సమయంలో మాస్టర్బేషన్ వద్దని అనుకోవడానికి కారణాలేవీ లేవు. పైగా దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. మాస్టర్బేషన్ వల్ల మీ శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలై శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. పిరియడ్ కూడా ప్రతి నెల సరైన సమయానికి వచ్చేలా చేస్తాయి. శరీరంలో హార్మోన్లు సమతులంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే పిరియడ్ సమయంలో రక్తపు మడుగును మీకు మీరే ఊహించుకొని.. మాస్టర్బేషన్ ఆనందాన్ని దూరం చేసుకోకపోవడం మంచిది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

11 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT