ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఆలుమగల మధ్య అనుబంధం పెరగడానికి .. శృంగారం ఎంతగానో తోడ్పడుతుంది తెలుసా?

ఆలుమగల మధ్య అనుబంధం పెరగడానికి .. శృంగారం ఎంతగానో తోడ్పడుతుంది తెలుసా?

ఒక వ్యక్తితో శృంగారంలో (Sex) పాల్గొన్న తర్వాత తనకు బాగా దగ్గరవుతాం. ఇది చాలామంది చెప్పే మాట. ప్రేమికులైనా.. భార్యాభర్తలైనా.. శృంగారానికి ముందు ఏర్పడే అనుబంధంతో పోల్చి చూస్తే.. దాని తర్వాత ఏర్పడే బంధంలో చాలా తేడాను చూస్తారు. సాధారణంగా సెక్స్ లైఫ్ ప్రారంభించాక.. ఇద్దరికీ మనసులో ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిపోవడం మనం చూడచ్చు. దీనికి కారణం వారు చాలా అత్యద్భుతంగా లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని కాదు కానీ.. వారి భావోద్వేగాలే ఇలాంటి సమయాలలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు సెక్స్ నిపుణులు.

లైంగికంగా ఇద్దరు వ్యక్తులు దగ్గరయ్యాక.. వారి మనసులు కూడా దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఎప్పుడైనా మీ బాయ్ ఫ్రెండ్, మాజీ ప్రేమికుడు, భర్త.. ఇలా ఎవరి విషయంలోనైనా సెక్స్ తర్వాత వారికి మరింత దగ్గరైనట్లు ఫీలయ్యారా? వారిపై మీ ప్రేమ మరింత పెరిగిందా? అయితే దానికి కారణం అదే. సెక్స్, దగ్గరితనం రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయి ఉంటాయట. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ ఆర్టికల్ చదివేయండి. 

giphy

ADVERTISEMENT

లవ్ హార్మోన్ కూడా కారణమే..

మన శరీరంలో విడుదలయ్యే లవ్ డ్రగ్.. అదేనండీ.. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ చాలా పవర్ ఫుల్. అది మనల్ని ఒకరికి బానిసలుగా మార్చే హార్మోన్ కూడా. అందుకే మీకు ఒక వ్యక్తి పెద్దగా నచ్చకపోయినా వారితో సెక్స్‌లో పాల్గొన్న తర్వాత.. వారిపై మీలో ఇష్టం పెరుగుతుంది. దీనికి కారణం మన శరీరంలోని ఆక్సిటోసిన్.

సెక్స్‌లో పాల్గొన్నప్పుడు విడుదలయ్యే ఈ హార్మోన్.. ఆ తర్వాత వారిపై మీకు ఇష్టాన్ని పెంచుతుంది. వారిని కౌగిలించుకోవాలని.. వారితో ఎక్కువ సమయం గడపాలని అనిపించేలా చేస్తుంది. ఇదో ఫీల్ గుడ్ హార్మోన్.

ఇది మీపై మీకు ప్రేమను పెంచడంతో పాటు.. మీతో సెక్స్‌లో పాల్గొనే వారిపై కూడా ప్రేమను పెంచేలా చేస్తుంది. మీ బంధాన్ని బలంగా మారుస్తుంది. ఈ హార్మోన్ పురుషులతో పోల్చితే స్త్రీలలో ఎక్కువగా విడుదలవుతుందట. అందుకే సెక్స్‌లో పాల్గొన్న తర్వాత.. మగవారితో పోల్చితే ఆడవాళ్లు ఎక్కువగా ఫీలింగ్స్ పెంచుకుంటారు. ఆ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించడం ప్రారంభిస్తారు.

ADVERTISEMENT

giphy

మెదడులో భాగాలు పనిచేయవు..

శృంగారం లేదా సెక్స్ సమయంలో భావ ప్రాప్తి సొంతమవడమే కాదు.. ఆ ఆనందభరితమైన భావప్రాప్తి వల్ల కలిగే ఆనందంతో మరెన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. మన మెదడులోని  లేటరల్ ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్.. ఎవరైనా సెక్స్‌లో పాల్గొని భావ ప్రాప్తి పొందే సమయంలో మూసుకు పోతుందట. ఈ భాగమే మనం లాజికల్‌గా ఆలోచించడానికి.. ప్రతి విషయానికీ ఓ కారణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం.

కాబట్టి సెక్స్‌లో పాల్గొని భావ ప్రాప్తి పొందడం వల్ల.. ఎలాంటి కారణం కూడా లేకుండా.. ఒక వ్యక్తిని ఇష్టపడడం ప్రారంభిస్తామట. అంతేకాదు.. దీనివల్ల సెక్స్ తర్వాత వచ్చే నిద్ర మత్తు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది. అలాగే స్థిమితం లేకుండా ఏవేవో ఆలోచనలతో మీ మనసు నిండిపోతుంది. వీటన్నింటికీ కారణం మెదడులోని ఆ భాగం పనిచేయకుండా ఉండిపోవడమే. ఇలా జరగడం వల్లే.. మీతో పాటు సెక్స్‌లో పాల్గొన్న వ్యక్తికి మరింత దగ్గరై.. ఏ కారణం లేకపోయినా వారిని ప్రేమిస్తారు.

ADVERTISEMENT

giphy

ఆ అడిక్షన్ నిజమే..

మీకు ఆ వ్యక్తి అంటే ఇష్టం లేకపోయినా.. మీ మాజీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికే మీరు మళ్లీ మళ్లీ వెళ్తున్నారా? అతడితో గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? నేను ఇలా ఎందుకు చేస్తున్నాను..? అంటూ మిమ్మల్ని మీరే నిందించుకుంటున్నారా? దీనికి కారణం ఒక్కటే. మీరు ప్రేమకు బానిస అయిపోయారు. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మనం సంతోషంగా ఉన్నప్పుడు.. ముఖ్యంగా సెక్స్ లో పాల్గొన్నప్పుడు విడుదలవుతుంది.

ఈ హార్మోన్ విడుదలైనప్పుడు మన మెదడు చాలా ఆనందంగా ఫీలవుతుంది. హెరాయిన్ తీసుకున్నప్పుడు మన మెదడు ఎలా ఫీలవుతుందో.. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది. బాగా యాక్టివ్ అవుతాం. అందుకే హెరాయిన్‌లా.. సెక్స్‌కి కూడా చాలామంది బానిస అయిపోతారు. అందుకే ఆ వ్యక్తి అంటే మీకు పెద్దగా ఇష్టం లేకపోయినా సరే.. సెక్స్ అంటే ఉన్న ఇష్టంతో.. తనతో కలిసి జీవించేందుకు మీరు ఆసక్తి చూపించే వీలుంటుంది.

అయితే దీనికి కారణం.. మీ మెదడులో జరిగే న్యూరో కెమికల్ రియాక్షన్స్. ఈ విధంగా మన మెదడు మనపై ట్రిక్స్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ హార్మోన్ల గురించి.. మన మెదడు పనితీరు గురించి పూర్తిగా తెలుసుకొని.. దాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల.. మన జీవితాన్ని మనం మార్చుకునే వీలుంటుంది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

16 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT