ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ప్రాచీన కాలం నాటి సెక్స్ నియమాలు.. ఎలా ఉండేవో మీకు తెలుసా?

ప్రాచీన కాలం నాటి సెక్స్ నియమాలు.. ఎలా ఉండేవో మీకు తెలుసా?

మధ్య శతాబ్ద కాలంలో సెక్స్ (sex) విషయంలో ఎన్నో అపోహలు ఉండేవి. సెక్స్ గురించి ఇప్పుడు ఆలోచించినట్లు అప్పుడు ఎవరూ ఆలోచించడమే కాదు.. మాట్లాడేవారు కూడా కాదు. కొన్ని సార్లు సెక్స్ గురించి మాట్లాడే సమయంలో సంకోచం, సిగ్గు అనేవి కూడా అడ్డు పడుతూ ఉండేవి. అయితే ఒకటి, రెండవ శతాబ్దాలలో మాత్రం సెక్స్ గురించి.. ప్రేమ సంబంధాల గురించి బహిరంగంగానే చర్చించేవారట. వాటి గురించి చర్చించడానికి సిగ్గుపడేవారు కాదట.

అందుకే కేవలం సెక్స్ అనే అంశాన్నే టాపిక్‌గా తీసుకొని  ‘కామసూత్ర’ అనే పుస్తకాన్ని రెండో శతాబ్దంలోనే వాత్సాయనుడు రాసిన సంగతి తెలిసిందే. అలాగే ఇలాంటి గ్రంథాలలోని కొన్ని సూచనల ప్రకారం సెక్స్‌లో పాల్గొనడం వల్ల జీవిత కాలం పెరగడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా కుదుట పడుతుందట. అంతేకాదు..  మానసిక శారీరక ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి.. ఇది చక్కటి మార్గమని కూడా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి రెండో వ్యక్తి కూడా.. తన సెక్సువల్ లైఫ్ ఆనందంగా లేదనే చెబుతాడని కొన్ని సర్వేలు అంటున్నాయి. వీరంతా శతబ్దాల క్రితం ప్రేమికులు, ఆలుమగలు పాటించిన సూత్రాలు పాటిస్తే చాలు.. తమ జీవితాన్ని ఆనందంగా కొనసాగించవచ్చట. ప్రేమ బంధం కూడా బలంగా మారుతుందట. ఈ క్రమంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల చాలా సమస్యలను తగ్గించుకోవచ్చట. అంతేకాదు.. జీవితంలోనూ ఎన్నో మార్పులను సాధించవచ్చు. అయితే ఈ నియమాల్లో కొన్ని చిత్ర విచిత్రమైనవి కూడా ఉన్నాయి. అవేంటో మనమూ తెలుసుకుందాం.

 

ADVERTISEMENT

1. స్త్రీకి రుతుక్రమం కొనసాగుతున్న మొదటి నాలుగు రోజుల పాటు భాగస్వామి మాత్రమే కాదు.. ఏ వ్యక్తి తనతో సెక్స్‌లో పాల్గొనకూడదు. ఇలా పాల్గొనడం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రుతుక్రమం పూర్తయ్యాక ఐదో రోజు నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఐదు, ఆరు, పన్నెండు, పద్నాలుగు, పదహారు రోజులు సెక్స్‌కి అనుకూలమైనవట.

2. బ్రహ్మ వైవార్థ పురాణం ప్రకారం పగలు సమయంలో.. అలాగే ఉదయం, సాయంత్రం పూజా సమయంలో స్త్రీ పురుషులు సెక్స్‌లో పాల్గొనకూడదట. అంతేకాదు.. గ్రహణం, సూర్యోదయం, సూర్యాస్తమయం, శ్రావణ మాసం, మరణం, శ్రాద్ధం, అమావాస్యలతో పాటు.. తమ నక్షత్రం ఉన్న సమయాల్లో కూడా సెక్స్‌లో పాల్గొనకూడదు.

3. ప్రాచీన నియమాల ప్రకారం స్త్రీ పురుషులు తమ భాగస్వామి‌తో తప్ప వేరే వ్యక్తితో సెక్స్ లో పాల్గొనడం పాపం. ఈ నియమాలను అతిక్రమించిన వ్యక్తులు జీవితాంతం పశ్చాత్తాపపడేలా శిక్ష పడుతుందట.

ADVERTISEMENT

4. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డ పుట్టే వరకూ సెక్స్‌కి దూరంగా ఉండాలి. గర్భం ధరించిన తర్వాత సెక్స్‌లో పాల్గొనడం వల్ల బిడ్డ కాళ్లు లేకుండా పుట్టే అవకాశాలుంటాయట.

5. కొన్ని పవిత్రమైన చెట్లు, స్మశాన వాటికలు, పవిత్ర స్థలాలు, గుళ్లు, గురుకులాలు, ఆసుపత్రులు వంటి ప్రదేశాల్లో సెక్స్‌లో పాల్గొనకూడదు. ఇలా చేసిన వ్యక్తులు జీవితాంతం భయంకరమైన వ్యాధుల బారిన పడతారట.

6. భాగస్వామికి ఇష్టం లేనప్పుడు లేదా వారు బాధలో ఉన్నప్పుడు.. వారిని బలవంత పెట్టి సెక్స్‌లో పాల్గొనడం సరికాదు. ఇలా చేయడం చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుంది.

7. సెక్స్ సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ జననాంగాలను పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాతే.. లైంగిక చర్యలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే పురాణ కాలంలో సెక్స్‌లో పాల్గొనే ముందు స్నానం చేయడం తప్పనిసరి అని భావించేవారు.

ADVERTISEMENT

8. పూర్తిగా నగ్నంగా మారి సెక్స్‌లో పాల్గొనడం సరికాదు. స్తీ పురుషులు ఇద్దరూ తమ శరీరాన్ని కనీసం దుప్పటి సాయంతో కప్పుకొనైనా సెక్స్‌లో పాల్గొనాలి. ఇలా చేయడం వల్ల సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైనా.. అనుకోకుండా అప్పుడే మరణించినా శరీర నగ్నత్వాన్ని ఇతరులు చూడకుండా కాపాడుకోవచ్చట.

9. కామసూత్ర రాసిన వాత్సాయనుడు చెప్పిన మాటల ప్రకారం.. స్త్రీ పురుషులు ఇద్దరికీ కామ శాస్త్రం గురించి పూర్తిగా తెలిసి ఉండాలట. ఇలా తెలుసుకోవడం వల్ల వారి సెక్స్ జీవితం ఆనందకరంగా మారుతుందట. సెక్స్ లైఫ్ ఆనందంగా ఉన్న దంపతులు.. మిగిలిన విషయాల్లోనూ ఆనందంగా ఉటారట.

10. ప్రాచీన నియమాల ప్రకారం రాత్రి మొదటి గడియ సమయంలోనే సెక్స్‌ లో పాల్గోనడం మంచిదట. అర్థరాత్రి సెక్స్ చేయడం రాక్షసుల క్రీడగా భావించబడుతుందట. ఈ సమయంలో సెక్స్ చేస్తే పుట్టే పిల్లల్లో.. రాక్షస ప్రవ్రత్తి ఎక్కువగా ఉంటుందట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

10 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT