ఈ ప్రయోగాలు.. మీ ఇద్దరి సెక్స్ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి..!

ఈ ప్రయోగాలు.. మీ ఇద్దరి సెక్స్ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తాయి..!

మీ భాగస్వామిని ఆకట్టుకొనేందుకు.. మీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు (Experiments) చేస్తుంటారా? అయితే ఇది చాలా మంచి పద్ధతి. ఇలా చేయడం వల్ల మీ బంధంలో.. ఎప్పటికప్పుడు నూతనత్వం ఏర్పడుతుంది.

మీ సెక్స్ జీవితం (Sex life) ఆనందంగా ఉన్నప్పటికీ కూడా.. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, పద్ధతులను ఉపయోగించి దాన్ని మరింత బెటర్‌గా మార్చుకొనే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.

ఈ ఆర్టికల్‌లో అలా మీ భాగస్వామిని ఇంప్రెస్ చేయడానికి.. మీ సెక్స్ జీవితాన్ని ఇంతకు ముందు కంటే ఆకర్షణీయంగా మలచుకోవడానికి.. అలాగే మీ బంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన టిప్స్ గురించి తెలుసుకుందాం.

ఒత్తిడి ఉండకూడదు..

సాధారణంగా ఎవరికైనా రోజంతా ఇంటి పనులు, ఆఫీస్ బాధ్యతలతోనే గడిచిపోతుంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురవ్వడం కూడా సహజమే.  కానీ ఇలాంటి ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా.. ఆలుమగలిద్దరూ సాయంత్రం పూట..  ఒకచోట కూర్చొని  సమయాన్ని గడపడం ఎంతో అవసరం. ఈ క్రమంలో ఇద్దరూ వేరే విషయాల జోలికి వెళ్లకూడదు. అలాగే వేరే టాపిక్స్ గురించి ఆలోచించకూడదు.

కేవలం తమ భాగస్వామి కోసమే.. సమయాన్ని కేటాయించాలి. తనతో ప్రేమగా వ్యవహరించాలి. ఎంతో అభిమానాన్ని కురిపించాలి. ఎందుకంటే.. ఆ క్షణాలను ఇరువురూ మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోతే.. దాని ప్రభావం ఇద్దరిపైనా పడుతుందని గుర్తుంచుకోవాలి. అంతేకాదు.. సెక్స్‌ని ప్రతిరోజూ రెగ్యులర్ పనిగా భావించడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల అది కూడా బోర్ కొట్టేస్తుంది.

పొగడ్త అందరికీ నచ్చుతుంది..

మీ భాగస్వామి మిమ్మల్ని ఆఖరిసారి పొగిడిందెప్పుడో మీకు గుర్తుందా? పోనీ మీరు వారిని ఎప్పుడు ప్రశంసించారు? ఒకవేళ మీకు ఈ విషయాలు గుర్తు లేకపోతే.. చాలా కష్టం. మీ మధ్య ప్రేమాభిమానాలు పెరగాలంటే.. వారి డ్రస్సింగ్ స్టైల్, వంట.. మొదలైన విషయాలకు సంబంధించి ప్రశంసల వర్షం కురిపించండి. వీటితో పాటు తరచూ 'ఐ లవ్ యూ' కూడా చెబుతుండాలి. ఈ మూడు పదాలు మీ బంధాన్ని మరింత దగ్గర చేయడంలో తమ వంతు పాత్రని పోషిస్తాయి.

సర్‌ప్రైజ్‌లు మంచివే..

పుట్టినరోజు, వార్షికోత్సవం.. ఇలాంటి సమయాల్లో ఎవరైనా తమ భాగస్వామికి ఏదో ఒక బహుమతి తీసుకొస్తారు. అలాగే ఏదో సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఆ ఆలోచనను నిలబెట్టుకోవడంతో పాటు.. అప్పుడప్పుడూ అకేషన్ లేకుండా కూడా మీ భాగస్వామిని ఏదో విధంగా సర్‌ప్రైజ్ చేస్తుండాలి. దీనివల్ల మీరిచ్చిన గిఫ్ట్ కంటే ..పదింతలు నచ్చే రిటర్న్ గిఫ్ట్ మీ సొంతమవుతుంది. అయితే ఈ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసేటప్పుడు.. మీ ఇష్టాయిష్టాలకు కాకుండా.. మీ భాగస్వామి ఇష్టాలకు ప్రాధాన్యమివ్వడం మంచిది.

కొన్ని రోజులు దూరంగా..

ఈ విషయం మీకు తెలుసా? కొన్ని రోజులు దూరంగా ఉండడం వల్ల.. మీరిద్దరికీ ఒకరంటే మరొకరికి మరింత ఇష్టం పెరుగుతుంది. అలాగే ఈ ఎడబాటు మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. సెక్స్ సమయంలో ఇద్దరూ ఆనందంగా ఉండాలన్నా.. మీ సెక్స్ జీవితం సంతోషమయం కావాలన్నా.. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి చూడండి. అయితే ఈ రోజుల్లో మీరిద్దరూ లైంగికంగా మాత్రమే దూరంగా ఉండాలి. రొమాన్స్ ఏమాత్రం తగ్గించకూడదు.

ఒకరినొకరు టీజ్ చేసుకోవడం.. ముద్దులు, కౌగిలింతలతో ఎదుటి వ్యక్తిని ప్రేరేపించడం ద్వారా.. అవతలి వ్యక్తికి మరింత దగ్గరవ్వచ్చు . అయితే సెక్స్ విషయానికి సంబంధించి.. కొన్ని రోజుల పాటు వేచి చూడడం వల్ల కోరిక మరింత పెరుగుతుంది. అలాగే మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టమైన చోట్లలో ముట్టుకోవడం, నాటీ మెసేజ్‌లు, ఫోటోలు వంటివి పంపడం వంటివన్నీ చేయవచ్చు. ఇవన్నీ మీ ఇద్దరిలో ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణను పెరిగేలా చేస్తాయి.

వాతావరణంతో మూడ్ మారుతుంది.

ఒకవేళ మీకు ప్రయోగాలు చేయడమంటే భయమా..? అయితే ముందు మీలో మీరు మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించండి. మీ బంధం రొమాంటిక్‌గా.. స్పెషల్‌గా కనిపించాలంటే.. మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లి.. కాస్త ప్రత్యేకమైన సమయం గడపాల్సి ఉంటుంది. మీకు బయటకు వెళ్లడం ఇష్టం లేకపోతే.. మీ బాల్కనీ లేదా టెర్రస్ పై క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకోండి. క్యాండిల్ లైట్ డిన్నర్ వల్ల.. సెక్స్ జీవితం మరింత రొమాంటిక్‌గా మారుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. దీంతో పాటు.. మీరు కూడా ప్రయోగాలు చేసేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం మంచిది కాదు.

మీ సెక్స్ జీవితంలో రొటీన్‌ని బద్దలు కొట్టి.. కాస్త ప్రయోగాలు చేస్తూ కొత్తదనాన్ని తీసుకురావడం వల్ల జీవితం బోర్ కొట్టకుండా ఉంటుంది. సెక్స్ విషయంలోనే కాదు.. ఒకరితో మరొకరు ఆనందంగా సమయాన్ని గడిపే వీలు కూడా ఉంటుంది. ఇలా చేసే వ్యక్తులు.. ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా ఎన్నో విజయాలు సాధించగలుగుతారట. మరి, మీరూ ఓసారి ప్రయత్నించండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.