ADVERTISEMENT
home / Budget Trips
హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు…

హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు…

హైదరాబాద్ (hyderabad) నగరం నడిబొడ్డులో 1935లో ఏడో నిజాం రాజు అజమాయిషీలో అప్పటి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మితమైంది మొజాంజాహి మార్కెట్ (moazzam jahi market). అప్పటి నుంచి ఇప్పటివరకూ హైదరాబాద్ నగరంలోని టాప్ మార్కెట్లలో ఒకటిగా పేరు గాంచింది. మరి, ఈ కట్టడం వెనుక ఉన్న చరిత్ర,  ఆ మార్కెట్ లో దొరికే వస్తువుల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.. 

* ఈ మొజాంజాహి మార్కెట్ కి ఆ పేరు నిజాం కొడుకు పేరుతో వచ్చింది.  ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ మార్కెట్ నిర్మితమైంది. ఆయన రెండో కుమారుడు మోజ్జామ్ ఝా పేరు వచ్చేలా మార్కెట్ కి నామకరణం చేయడం జరిగింది.

* ఇక ఈ మార్కెట్ ని 1935 ప్రాంతంలో ఇక్కడ నిర్మించడానికి గల ముఖ్య కారణం, ఆ సమయంలో ఇది హైదరాబాద్ నగరం మధ్యలో ఉండడమే. ఇక్కడ ఈ మార్కెట్ ని కడితే, హైదరాబాద్ నగరం మొత్తం నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి తమకి కావాల్సిన వస్తువులని కొనుగోలు చేసేందుకు వీలుగా ఉంటుంది అని ఈ ప్రాంతంలో నిర్మించడం జరిగింది.

హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

ADVERTISEMENT

* ఈ మొజాంజాహి మార్కెట్ లో జాంబాగ్ పూల మార్కెట్ కూడా ఉండేది. దీనితో పాటు పండ్ల మార్కెట్ కూడా ఉండేది.  హైదరాబాద్ నగరంలోని ప్రజలంతా పూలు, పండ్ల కోసం ఇక్కడికే వచ్చేవారు. అయితే ట్రాఫిక్ కారణంగా 2009లో ఈ పూల మార్కెట్ ని మెహదీపట్నం ప్రాంతంలో ఉన్న గుడిమల్కాపూర్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫ్లవర్ మార్కెట్ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ గా పిలవబడుతోంది.

* అలాగే ఈ మొజాంజాహి మార్కెట్ లో అన్నిరకాల పండ్లు లభించేవి. 1935 లో ఈ మార్కెట్ ని ప్రారంభించిన నాటి నుండి 1980 వరకు కూడా ఇక్కడ రకరకాల పండ్లు లభ్యమయ్యేవి. 1980లలో ఈ పండ్ల మార్కెట్ ని దిల్ షుక్ నగర్ ప్రాంతంలోని కొత్తపేట్ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ పండ్ల మార్కెట్ కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ గా ప్రచారంలో ఉంది.

* నిజాం రాజు పరివారానికి అలాగే ఆయన సంస్థానంలోని ప్రముఖులందరికి కూడా మొజాంజాహి మార్కెట్ నుండే పండ్లు మరియు పూలు పంపించేవారట. రాజా కుటుంబం కోసం ప్రత్యేకంగా నిజాం ప్యాలస్ అయిన ఫలక్ నుమా ప్యాలస్ కి  ఇక్కడి నుంచే పండ్లు రవాణా చేసేవారట.

* ఈ మార్కెట్ లో పూలు, పండ్లతో పాటుగా రకరకాల పాన్ మసాలాలు కూడా లభించేవట. ఆ పాన్ మసాలాలతో వివిధరకాల పాన్ లని చేసేవారట. ఆరోజుల్లో మంచి పాన్ తినాలంటే మొజాంజాహి మార్కెట్ కి వెళ్లాల్సిందే అనేవారట. ఇప్పటికీ ఇది ఫేమస్ పాన్ బజార్ గా కొనసాగుతోంది. 

ADVERTISEMENT

* ఇక్కడ పూలు, పండ్ల లాంటి నిత్యావసర వస్తువులతో పాటు మందుగుండు సామగ్రి కూడా లభిస్తుంది. నిజాం రాజులకి వేటకి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా వారు వేటకి వెళ్ళడానికి కావాల్సిన తుపాకులు & మందు గుండు సామాగ్రి కూడా ఈ మార్కెట్ లో లభించేది అని చెబుతుంటారు.

* అయితే ఈ వస్తువులేవీ ఇప్పుడు పెద్దగా ఆ మార్కెట్ లో లభించడం లేదు. పండ్లు, కూరగాయలు తక్కువ సంఖ్యలో లభిస్తుండగా.. ఈ సమయంలో & ప్రస్తుతం కూడా ఆ మార్కెట్ లో లభిస్తున్నది ఏంటంటే అది రుచికరమైన ఐస్ క్రీమ్. ఈ మార్కెట్ లో ఉండే ఫేమస్ ఐస్ క్రీమ్ (ice cream) పార్లర్ ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ వాసులకి రకరకాలైన రుచులలో ఐస్ క్రీమ్ ని అందిస్తున్నది. ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం సహజ పద్ధతిలో చేతితో తయారు చేసిన ఐస్ క్రీమ్ ని తయారుచేసి ఇక్కడ విక్రయిస్తుంటారు. ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ (famous ice cream parlour) తో పాటుగా మరెన్నో ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇక్కడ ప్రజలకి రుచికరమైన ఐస్ క్రీమ్స్ ని అందిస్తున్నాయి.

హైదరాబాద్ ట్రెండ్స్: సాలార్‌జంగ్ మ్యూజియంలోని ‘మ్యూజికల్ క్లాక్’ గురించి 11 అద్భుత విషయాలు

* మొజాంజాహి మార్కెట్ ని మనం చూడగానే కనపడేది పెద్ద గడియారం. ఈ కట్టడం పైన ఉన్న మినార్ కి నాలుగువైపులా ఉండే పెద్ద గడియారాలు సమయాన్ని సూచిస్తుంటాయి.

ADVERTISEMENT

* ఇక ఈ కట్టడాన్ని చూస్తే.. మనకి చార్మినార్, సిటీ కాలేజ్ వంటివి ఎన్నో గుర్తుకువస్తాయి. ఒకరకంగా ఈ కట్టడం కూడా నిజాం రాజుల మార్క్ కట్టడంగా వారు కట్టించిన కట్టడాలని స్ఫురణకు తెస్తుంటుంది. ఈ కట్టడం మన హైకోర్టు కట్టడం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. 

ఇన్ని విశేషాలు కలిగిన ఈ కట్టడం గత కొన్నేళ్లలో ఎంతో నిరాదరణకు గురవ్వడంతో.. కట్టడం చాలా వరకు దెబ్బతిన్నది. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఈ కట్టడాన్ని పరిరక్షించేందుకు నడుంబిగించింది. అలా ఈ కట్టడానికి మరలా పునర్వైభవం రానుంది అని ఈ కట్టడాన్ని ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించి త్వరలోనే ఈ కట్టడం ప్రజలని ఆకట్టుకునే విధంగా తయారయ్యి మళ్లీ హైదరాబాద్ వాసులకి ఉపయోగపడేలా ఉండాలని ఆశిద్దాం.

హైదరాబాద్ కి షాన్.. “ఉస్మానియా బిస్కెట్స్” చరిత్ర మీకోసం…!

22 Oct 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT