1 అక్టోబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

1 అక్టోబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (1 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చేసే పనులకు అంతరాయం కలుగుతుంది.  అలాగే మానసిక ఒత్తిడిని నివారించండి. ఆఫీసులో ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. కోర్టు లావాదేవీలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సృజనాత్మక , సినిమా రంగాలలో వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి.

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబంలోని తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో మనో నిగ్రహం అవసరం. విద్యార్థులు నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలకాలి. అలాగే యువతకు క్రీడలలో ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. ఆఫీసులో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా.. ఆత్మస్థైర్యంతో పనిచేస్తారు. ఆఫీసులో ఉద్యోగులు అధికారుల మద్దతు పొందుతారు.  వివాహితులకు సామాజిక ప్రతిష్ట, సంపద పెరుగుతాయి. వ్యాపార భాగస్వామ్యంలో లాభం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అయితే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు విద్యార్థులకు బాగా కలిసొచ్చే సమయం. అలాగే క్రీడలు, కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో నిరుత్సాహపడవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. కోర్టు కేసులు, ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికులు సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలో కష్టపడి పనిచేసినప్పటికీ, ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం లేదు. అలాగే షాపింగ్ చేసే క్రమంలో అప్రమత్తంగా ఉండండి. అపరిచితులను నమ్మవద్దు. మీ కుటుంబ సభ్యులతో బంధాలు మరింత పటిష్టమవుతాయి. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. ఆఫీసులో ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు ఉంటుంది. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలకు ప్లాన్ చేస్తారు. కోర్టు లావాదేవీలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

తుల (Libra) – ఈ రోజు కుటుంబ సమస్యలు మీలో ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో కూడా ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తారు. వివాదాల జోలికి వెళ్లద్దు. వాణిజ్యపరంగా కొత్త ఒప్పందాలు చేసుకునే సమయంలో.. అప్రమత్తంగా ఉండండి.  కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు మీ భాగస్వామితో చర్చించండి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ నిర్లక్ష్య ధోరణి వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. అలాగే డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో మీకు మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులను కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. స్నేహితుల నుండి ధన సహాయాన్ని పొందుతారు. అలాగే బాల్య మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు వ్యాపారస్తులకు అంతా లాభసాటిగా సాగుతుంది. అయితే రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహితులకు సామాజిక గౌరవం మరియు సంపద పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వ్యక్తులకు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా.. త్వరలోనే అవి సమసిపోతాయి.

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. అదేవిధంగా  ప్రేమికులు అనుకున్న గమ్యాన్ని.. అనుకున్న సమయంలో చేరుకుంటారు. ఆఫీసులో ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.  వ్యాపారస్తులు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు సోమరితనం కారణంగా విద్యార్థులు చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. అలాగే ఆఫీసులో మీ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.  సృజనాత్మక, సినీ, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు లాభసాటిగా గడుస్తుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. వ్యాపారానికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ఖరీదైన బహుమతులు పొందుతారు. కాకపోతే మీ ప్రవర్తన కారణానికి.. కొందరు కుటుంబ సభ్యులు బాధపడే అవకాశం ఉంది. కనుక కోపాన్ని నియంత్రించుకోండి. ఏ సమస్యనైనా శాంతియుతంగా పరిష్కరించండి. అలాగే ఆర్థిక  లావాదేవీలలో జాగ్రత్త వహించండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.