19 అక్టోబరు 2019 (శని వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

19 అక్టోబరు 2019 (శని వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (19 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీ పని సజావుగా సాగుతుంది. పేపర్ వర్క్ గురించి క్లారిటీ కూడా లభిస్తుంది. కొత్తవారితో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే తొందరపాటు మాత్రం పనికిరాదు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఓ ఫ్రెండ్ వల్ల మీరు బాధపడే అవకాశం ఉంటుంది. 

వృషభ రాశి  (Tarus) – ఈరోజు పని చేసి మీరు అలసటగా ఫీలవుతుంటారు. మీకు సరైన నిద్ర లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. మీ చిరాకును పని ప్రదేశంలో కింద ఉద్యోగులపై చూపకండి. తొందరగా పని పూర్తి చేసుకొని కాస్త విశ్రాంతి తీసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ అలసిన ముఖాన్ని చూసి మీ పనిలో వేగం కాస్త తగ్గించుకోమని కూడా సలహా ఇస్తారు. 

మిథున రాశి  (Gemini) – ఈరోజు మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇది మీకు చిరాకు తెప్పిస్తుంది. దీనికి మీరు మిమ్మల్నే కారణం భావిస్తారు. కానీ జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదని గుర్తుంచుకోవాలి. పెండింగ్ పేమెంట్లు వచ్చేస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు.

కర్కాటక రాశి  (Cancer) – ఈరోజు మీరు ఒకసారి ఒక అంశంపై మాత్రమే ఫోకస్ పెట్టండి. మీరు చేయాల్సినవి చాలా ఉంటాయి. అయితే చేయాల్సిన పని గురించి కలలు కంటూ పనిపై శ్రద్ధ పెట్టడం మర్చిపోవద్దు. సమయానికి భోజనం చేయండి. కుటుంబ సభ్యులతో సమస్యలు తగ్గుతాయి. ఇతరులపై నిందలు వేయడం వల్ల ఫలితం ఉండదు. వారికే కాస్త సమయాన్ని ఇచ్చి వారి నిర్ణయాల గురించి ఆలోచించుకోనివ్వండి. 

సింహ రాశి  (Leo) – ఈరోజు మీరు మరింత బ్యాలన్స్డ్ గా ఉండేందుకు ప్రయత్నించండి. మానసికంగా మీరు ఊగిసలాటలో ఉన్నారు. ముఖ్యంగా పని విషయంలోని నిర్ణయాలు, మీ తోటి ఉద్యోగులు మీ నుంచి కోరుకునే విషయాలు వంటివన్నింటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. స్నేహితులతో బయటకు వెళ్లడం వల్ల మీ మనసు మారే అవకాశం ఉంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈరోజు మీకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. రోజువారీ షెడ్యూల్ వేసుకోవడం వల్ల ఎక్కువగా చెప్పి తక్కువ పని చేయడం నుంచి తప్పించుకోవచ్చు. ఎక్కువ పనిగంటలు పని చేయడం వల్ల స్నేహితులతో సమయం గడపలేరు. కానీ వారు అర్థం చేసుకుంటారు. భాగస్వామితో గొడవ పెట్టుకోవడం మానేయండి. 

తుల రాశి (Libra) – ఈరోజు మీ పనిలో చాలా వాయిదాలు, నెమ్మదిగా జరగడం వంటివన్నీ మిమ్మల్ని చిరాకు పెడతాయి. అయితే మీరు మంచి ఆదాయాన్ని అందించే ఓ కొత్త ప్రాజెక్టు ఒప్పుకోవడం వల్ల పరిస్థితి సజావుగా సాగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. తోబుట్టువులతో గొడవలు పెట్టుకోవద్దు. స్నేహితులతో కలిసి గడపడం వల్ల టెన్షన్లు మర్చిపోయే వీలుంటుంది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కొత్త పనివారిని నియమించుకుంటారు. వారితో కాస్త ప్రశాంతంగా ఉండి వారి క్రియేటివిటీని బయటకు తీసే ప్రయత్నం చేయండి. పని పై ఎక్కువ శ్రద్ధ వహించడం వల్ల కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వేరే ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితులను కలుస్తారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈరోజు ఇతరులు చేసిన తప్పుల వల్ల మీ పని నెమ్మదిస్తుంది. ఇది మీకు చిరాకును కలిగిస్తుంది. అయితే మీ చేతుల్లో లేని దాని గురించి పట్టించుకోవడం కంటే మీ చేతుల్లో ఉన్నదాని గురించి ఆలోచించడం మంచిది. కుటుంబంలోని మగవారితో మీ మాటలు గొడవలకు దారి తీయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరులను క్షమించడానికి ప్రయత్నించండి. కుటుంబ సమస్యల వల్ల బయటకు వెళ్లడానికి మీరు ఇష్టపడరు.

మకర రాశి  (Capricorn) – ఈరోజు మీ పని కాస్త వేగాన్ని పుంజుకుంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. అందువల్ల మీ పని కూడా ముందుకెళ్తుంది. కమ్యునికేషన్ చాలా అవసరం అని గుర్తించండి. సరైన సమయానికి భోజనం చేయండి. కుటుంబ సభ్యులు చాలా మూడీగా ఉండడం వల్ల కుటుంబంలో కలతలు రేగుతాయి. వారికి కాస్త సమయం ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చాలా ప్లాన్స్ ఉండడం వల్ల సాయంత్రాలు బిజీగా అవుతారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈరోజు పని సజావుగా సాగుతుంది. మీరు చేయడానికి చాలా పని ఉంటుంది. అయితే మీరు ఆ పనిని ముందుకు తీసుకెళ్లేందుకు బద్ధకించడం లేదా అది మీకు అర్థం కాకపోవడం వల్ల పని ముందుకు తీసుకెళ్తేందుకు కష్టమవుతుంది. అయితే ఎలాగైనా ప్రయత్నించి పెండింగ్ పని పూర్తి చేయండి. డెడ్ లైన్లను చేరుకోవడం మీకెంతో అవసరం. స్నేహితులు మీకెంతో సహకారం అందించడంతో పాటు మీలో ఆత్మవిశ్వాసం నింపుతారు. 

మీన రాశి  (Pisces) – ఈరోజు మీరు కొత్త డీల్స్ సంపాదించి.. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని రూలేం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.