20 అక్టోబరు 2019 (ఆది వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

20 అక్టోబరు 2019 (ఆది వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (20 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈరోజు మీకు ఏం కావాలో అది ఎలా కావాలో ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోండి. స్పష్టమైన సమాధానం లేకుండా పరిస్థితులను అలా వదిలేయడం వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. టీం సభ్యులతో మరింత బాధ్యతతో వ్యవహరించండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీరు బిజీగా గడుపుతారు. మీ నిర్ణయాల్లో చాలా క్లారిటీ కనిపిస్తుంది. కొత్త ఉద్యోగం, వ్యాపారం, లేదా వ్యాపార విస్తరణ గురించి ప్రయత్నించేవారికి మంచి ఫలితాలుంటాయి. క్లైంట్స్ తో మాట్లాడేటప్పుడు కాస్త నెమ్మదిగా ఉండండి. కుటుంబ సభ్యుల్లో ఒకరు బాధలో ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపండి. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీరు చాలా అలసిపోయినట్లుగా ఉంటారు. ఆఫీస్ కి వెళ్లాలనిపించదు. ఉదయమంతా అలాగే ఉన్నా మధ్యాహ్నం నుంచి పనిలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పని ఉంటే దాన్ని పూర్తి చేయడం మంచిది. కుటుంబ సభ్యులు మీతో గొడవ పెట్టుకుంటారు. ఆ గొడవల నుంచి తప్పించుకునేందుకు స్నేహితులతో సమయం గడుపుతారు. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీ పని సజావుగా సాగుతుంది. కానీ మీ తోటి ఉద్యోగులు తమ పనిని మీకు అప్పగించడానికి ప్రయత్నిస్తారు. కొత్త ఉద్యోగాలు, ప్రాజెక్టుల కోసం వేచి చూసేవారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. పని చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుటుంబ జీవితం పై దాని ప్రభావం పడుతుంది. కొత్తవారిని కలుస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీ పని చాలా బాగా సాగుతుంది. కొత్త ఆలోచనలు, క్రియేటివిటీతో మీరు ముందుకెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. స్నేహితులతో కూడా సమయం గడుపుతారు. మీ స్నేహితులు తమ బాధలను మీతో చెప్పుకొని మీ ఓదార్పు కోరుకుంటారు.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అన్నీ ప్లాన్ చేసుకున్నట్లే జరగాలని రూల్ లేదు. షెడ్యూల్ లో మార్పులున్నా పట్టించుకోవద్దు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోండి. లేదంటే మీ చుట్టూ ఉన్నవారిని మీరు గందరగోళంలో పడేసే ప్రమాదం ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల అలసటగా ఫీలవుతారు. దీనివల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పని కాస్త ఎక్కువగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారి వల్ల కాస్త పని ఆలస్యమవుతుంది. అయితే మీ క్రియేటివిటీ వల్ల ఈరోజు మీకు వచ్చిన కొత్త కొత్త ఆలోచనలు రాసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. మీకు ఏదీ అర్థం కానప్పుడు ఇతరుల సహాయం తీసుకోండి. ఒంటరిగా సమయం గడపడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీరు పనిచేసే చోట మీతో పాటు పనిచేసేవారితో ఉన్న బేధాభిప్రాయాల వల్ల కాస్త ఇబ్బందిపడతారు. అయితే కాస్త ప్రశాంతంగా ఆలోచించి పని చేయడం వల్ల సమస్యలు ఉండవు. మీకు ఎలాంటి ఫలితాలు కావాలో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇతరుల సమస్యల వల్ల మీ కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకుంటారు.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీకు చాలా నెమ్మదిగా సాగుతుంది. మీరు అనుకున్న మీటింగ్స్ వాయిదా పడతాయి. అవతలి వ్యక్తులు తాము చెప్పిన సమయానికి రాలేకపోతారు. అయితే చిరాకుపడకుండా దాన్ని వదిలేయండి. కుటుంబ సభ్యులు మీ ఓదార్పు కోరుకుంటారు. వారితో సమయాన్ని గడపండి. అలసిపోవడం వల్ల వారితో ఎక్కువ సమయం గడపలేరు. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీ పని ఫలితాలను ఇవ్వకపోవడం వల్ల మీరు మీతో పాటు మీ పై అధికారులు ఇబ్బందిపడతారు. ఇతరుల విమర్శలకు సమాధానం ఇవ్వకండి. అయితే సలహాలు తీసుకోండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. కొందరు స్నేహితులు కూడా కలుస్తారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు ముందు అనుకున్న ప్లాన్లు క్యాన్సిల్ కావడం వల్ల పని నెమ్మదిగా సాగుతుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్ల పని వాయిదా పడకుండా షెడ్యూల్ వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోకండి. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు పని ప్రదేశంలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల పని నెమ్మదిగా సాగుతుంది. ఇది మీలో ఒత్తిడి పెంచుతుంది. ఈరోజు జరిగే ఓ ముఖ్యమైన మీటింగ్ మీకు చాలా సహాయం చేస్తుంది. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. తన భాగస్వామితో గొడవలు జరుగుతున్న ఓ ఫ్రెండ్ మీ ఓదార్పును కోరుకుంటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.