22 అక్టోబరు 2019 (మంగళ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

22 అక్టోబరు 2019 (మంగళ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (22 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈరోజు మీ పని చాలా బ్యాలన్స్ డ్ గా సాగుతుంది. ఇతరులను కూడా వారి లక్ష్యాలను చేరుకునేందుకు మీరు ప్రోత్సహిస్తారు. పెండింగ్ లో ఉన్న చాలా పనులు మీరు పూర్తి చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని అందిస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబంతో డిన్నర్ చేస్తూ ఆనందంగా సమయాన్ని గడుపుతారు. 

వృషభ రాశి  (Tarus) – ఈరోజు మీ పని సజావుగా సాగుతుంది. కానీ ఒత్తిడి, ఆలస్యం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఓ డీల్ పూర్తి చేయడంలో.. కొత్త డీల్ సైన్ చేయడంలో ఆలస్యం జరుగుతుంది. అయితే వేగంగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. సమయానికి భోజనం చేయండి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా ఉంటే కుటుంబంతో ఆనందంగా సమయం గడిపే వీలుంటుంది. 

మిథున రాశి  (Gemini) – ఈరోజు మీరు మీ మనసులోని ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చే ముందు కాస్త చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. విమర్శలకు ప్రతిస్పందించడం తగ్గించండి. మీ ఆలోచనలకు ఇతరుల ఆలోచనలకు వ్యత్యాసం ఉండడం వల్ల కాస్త ఇబ్బంది ఎదురైనా పని పూర్తవుతుంది. బంధువుల ఇంటికి వెళ్లాల్సి రావడంతో కుటుంబంతో బిజీగా సమయాన్ని గడిపేస్తారు. చాలా కాలం తర్వాత ఓ ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. 

కర్కాటక రాశి  (Cancer) – ఈరోజు మీరు చాలా మంచి ఫీడ్ బ్యాక్ సాధిస్తారు. దీంతో ఈ రోజు ఆనందంగా సాగుతుంది. అయితే బాధ్యతలు పెరుగుతాయి. మీ చుట్టూ ఉన్నవారు మీపై కాస్త ఇబ్బంది పెట్టినా మీరు మాత్రం చాలా ఎనర్జిటిక్ గా పని చేసుకుంటూ పోతారు. వాయిదా వేయడం ఆపండి. కుటుంబ సభ్యులతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల సమస్యలను దూరం చేసుకోవచ్చు. 

సింహ రాశి  (Leo) – ఈరోజు మీరు పని ప్రదేశంలో ఇతరుల పని పట్ల మీరు అసంతృప్తి కి గురవుతారు. అయితే పరిస్థితిని ఇతరుల కోణం నుంచి చూడడం మంచిది. ఈరోజు సాయంత్రం మీకో శుభ వార్త అందుతుంది. ఓ స్నేహితుడు లేదా స్నేహితురాలితో గొడవ అయ్యే సూచనలున్నాయి. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల గొడవలు రాకుండా చూసుకోవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈరోజు పని ప్రదేశంలో మీ ఆలోచనల పట్ల క్లియర్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల అపార్థాలు రాకుండా ఉంటాయి. ఇతరులు సహాయం అడిగినప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉండండి. ముందుగానే షెడ్యూల్ వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులు మీపై చిరాకు పడతారు. వారితో గొడవ పడకపోవడం మంచిది. 

తుల రాశి (Libra) – ఈరోజు పని ప్రదేశంలో చాలా బ్యాలన్స్ డ్ గా ఉంటారు. వ్యక్తిగత కారణాల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని ప్రదేశంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కుటుంబ విషయాలు మర్చిపోవడం మంచిది. గతంలో జరిగిపోయిన విషయాలను తవ్వి వాటిని వర్తమానంతో కలిపి ఇబ్బందిపడకండి. ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతారు.

వృశ్చిక రాశి  (Scorpio) – ఈరోజు మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొత్త వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. పని వల్ల ఆహారం తీసుకోకపోవడం వంటివి మంచిది కాదు. కుటుంబంతో చాలా ఆనందంగా సమయం గడుపుతారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈరోజు ఇతరుల చిన్న చిన్న తప్పుల వల్ల మీ పని నెమ్మదిస్తుంది. కానీ ప్రశాంతంగా ఆలోచించండి. మీ భవిష్యత్ లక్ష్యాలను పునర్నిర్మించుకోవడానికి కాస్త సమయం కేటాయించుకోండి. కొత్త ప్రాజెక్టుల గురించి ఓ క్లారిటీ వస్తుంది. కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. గతంలో మీకు పరిచయమైన వ్యక్తులను మరోసారి కలుస్తారు.

మకర రాశి  (Capricorn) – ఈరోజు మీ పని సజావుగా సాగుతుంది. కొత్త ఆలోచనలు, ఐడియాలతో కొత్త పని ని ప్రారంభిస్తారు. పాత క్లైంట్లు మీకు కొత్త పనిని అందిస్తారు. అయితే పేపర్లు జాగ్రత్తగా చదవడం మంచిది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. కానీ పనిలో బిజీగా ఉండడం వల్ల వారితో ఎక్కువ సమయం గడపలేరు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈరోజు మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది కానీ పాజిటివ్ గా సాగుతుంది. ఈరోజు సాయంత్రానికి మానసికంగా  మీరు ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించండి. భాగస్వామితో గొడవ పడకండి. స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు. 

మీన రాశి  (Pisces) – ఈరోజు మీ పని వేగాన్ని పుంజుకుంటుంది. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం వేచి చూస్తుంటే ఈఱోజు మీకు మంచి ఫలితం ఉంటుంది. మీ నిర్ణయాలపై అపనమ్మకం సరికాదు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అనుమానిస్తారు. అయితే వారితో గొడవ పెట్టుకోకుండా ఉండడం మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.