26 అక్టోబరు 2019 (శని వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

26 అక్టోబరు 2019 (శని వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (26 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మొత్తం బ్యాలన్స్ డ్ గా ఉంటుంది. పని వాయిదా పడుతుంది. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. మీ కుటుంబ సభ్యులు బయటకెళ్లే ప్లాన్లు వేస్తారు. మీరు వారితో పాటు వెళ్లాల్సి వస్తుంది. వారి కోసం మీ సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీరు ఒంటరిగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించకండి. పనిలో ప్రతి అంశానికి మీరు సమానంగా సమయాన్ని కేటాయించుకుంటారు. ప్రస్తుతం మీరు కొనసాగిస్తున్న కొన్ని పనులను పూర్తి చేసి కుటుంబం, స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు. మీ కుటుంబంలోని వ్యక్తులు మీ సలహా కోసం వస్తారు. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ పని అంత తొందరగా ముందుకు సాగదు. మానసికంగా మీరు వేరే ఆలోచనల్లో ఉంటారు. శారీరకంగా పని చేస్తుంటారు. పెండింగ్ లో ఉన్న ఓ ఆర్డర్ మీకే వస్తుంది కానీ అది మీకు ఆనందాన్ని అందించదు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చిరాకు పెడతారు. 

కర్కాటక రాశి  (Cancer) – ఒకసారి ఒక అంశంపై ఫోకస్ పెట్టండి. ఇతరులకు  మీ పని వేగాన్ని అందుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల మీ పని అంత వేగంగా సాగదు. పని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పి అప్పగించండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. ఇతరుల సమస్యల్లో జోక్యం చేసుకోకండి. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. ఇతరుల వ్యవహార శైలి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పెండింగ్ పని చాలా ఉండడంతో మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీలో దాగి ఉన్న ఫీలింగ్స్ అన్నింటినీ మీ కుటుంబంతో పంచుకోండి. వారి రియాక్షన్ గురించి ముందే ఊహించి భయపడకండి. స్నేహితులతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ పని మామూలుగానే ఉన్నా.. మీ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేయలేకపోతారు. మీరు ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవట్లేదని మీ కుటుంబ సభ్యులు మీ పై చిరాకు పడతారు. కాస్త విశ్రాంతి తీసుకోండి. అయినా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ ని సంప్రదించండి. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు పనిలో మీ క్రియేటివ్ ఆలోచనలను అమల్లో పెడతారు. పాత క్లైంట్లు కొత్త పనిని అందిస్తారు. కొత్త ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తుంటే దానికి ఈరోజు మంచి రోజు. పని గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల వారి ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి. ఒంటరిగా క్రియేటివ్ ఆలోచనలు చేయడాన్ని మీరు ఇష్టపడతారు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ పని చాలా ఎక్కువగా ఉంటుంది. వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేయాల్సి వస్తుంది. ఇతరులు మీరు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు కాబట్టి అది మీలో ఒత్తిడిని మరింత పెంచుతుంది. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో ఉండడాన్ని ఈ రోజు మీరు ఇష్టపడతారు. మీ ఇంటికి బంధువుల రాక మిమ్మల్ని సంతోషపెడుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు పని మామూలుగా ఉంటుంది. కానీ పెండింగ్ ఈమెయిల్స్ అన్నింటికీ మీరు సమాధానాలిస్తూ ఉండిపోవడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. తలనొప్పి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పని నెమ్మదిగా సాగుతుంది. ఒకవేళ ఉద్యోగం మార్పు లేదా ప్రమోషన్ గురించి మీరు ఎదురు చూస్తుంటే అది ఈరోజు జరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం మానేయండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీ పని చాలా నెమ్మదిస్తుంది. కానీ ఇది మీకు మీ ఆలోచనలను మార్చుకోవడానికి, పునరాలోచించడానికి సరైన సమయాన్ని అందిస్తుంది. మీ తోటి వారి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. మీ తోటి పనివారు మీపై చూపే ఒత్తిడికి తలొగ్గకండి. ఆరోగ్యం గురించి శ్రద్ద వహించాల్సి ఉంటుంది. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీ పని చాలా ఎక్కువగా ఉంటుంది. చేసిన కొద్దీ కొత్త పని వస్తూనే ఉంటుంది. ఇతరులు మీరు చేసే పనిని ప్రశంసిస్తారు.  కుటుంబంలో జరిగిన గొడవలతో ఇబ్బంది పడతారు. ఇతరుల గురించి మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు బాగా ఆలోచించండి. ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.