27 అక్టోబరు 2019 (ఆది వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 అక్టోబరు 2019 (ఆది వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (27 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు వేగాన్ని తగ్గించుకోవడం మంచిది. పని వస్తూ ఉన్నా ఎక్కువగా ముందుకు సాగదు. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులు ఈ రోజు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని నవ్విస్తారు. పాత స్నేహితులను కలుస్తారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీరు చాలా అద్భుతంగా పనిచేస్తారు. చాలా కాలం తర్వాత మీరు చేసిన పనికి మంచి ఫలితం రావడంతో పాటు దానికి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇంటి కి సంబంధించిన ఒత్తిడిని ఆఫీస్ కి తీసుకురాకండి. కుటుంబ సభ్యులు మీ నుంచి ఎక్కువగా ఆశించడం వల్ల గొడవలు జరుగుతాయి. మీకు చేతైనంది మీరు చేయండి. ఇతరులను మెప్పించాలని ప్రయత్నిస్తే నిరాశ తప్పదు. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. మీకు ఆర్థికంగా మంచి ఫలితాలను అందించే ఓ ప్రాజెక్ట్ మీకు లభిస్తుంది. దానికి సంబంధించి పేపర్ వర్క్ కూడా పూర్తవుతుంది. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. మీరు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీరు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ పని చేయాలని కంగారు పడుతూ లేస్తారు. కానీ ప్రతి ఒక్కటీ సమయానికి పూర్తవుతుంది. మీ కుటుంబ సభ్యులు మీకు  పనిలో సాయం చేస్తారు. స్నేహితులు అండగా ఉంటారు. సాయంత్రం మీరు గెట్ టు గెదర్ లేదా నైట్ అవుట్ ప్లాన్ చేసుకుంటారు. ఇతరులను విమర్శించడం తగ్గించండి. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు పనిలో మీ తర్వాత మెట్టుకి సంబంధించిన క్లారిటీ మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు ఓ వీఐపీ తో కలిసి పనిచేస్తారు. భవిష్యత్తులో ఆ వ్యక్తి మీకెంతో ఉపయోగపడతారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. మీరు తీసుకున్న నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్ల కాస్త ఇబ్బంది ఎదురవ్వచ్చు. మీరు అనుకున్నవే జరగాలని మొండిగా వ్యవహరించవద్దు. రేపు చాలా బాగుంటుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ పని చాలా నెమ్మదిగా సాగి మీకు చిరాకును కలిగిస్తుంది. ఈ రోజు పూర్తయ్యేసరికి మీ పని పట్ల ఇతరుల ఆలోచనలు మీరు తెలుసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. మీ కుటుంబ సభ్యులు మీరు ఊహించినదానికంటే ఎక్కువ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అయితే వారి సలహాలు తీసుకోవడానికి ముందుండండి. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పని చాలా ఆనందంగా సాగుతుంది. కానీ మీతో పాటు పనిచేసే వారి పట్ల మీరు ఆనందంగా ఉండరు. అయితే మీరు అందరినీ కంట్రోల్ చేయలేరని గుర్తించుకోండి. కానీ వారు చెప్పింది మీరు గ్రహించే విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. స్నేహితులతో గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం మంచిది. మీ పని పాజిటివ్ గా మారుతుంది. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. కానీ మీ చుట్టూ ఉన్నవారి అభిప్రాయాల వల్ల మీరు ఆనందంగా ఫీలవ్వలేరు. మీ స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. అయితే మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. ఒంటరిగా కాస్త సమయాన్ని గడపండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీ మనసులో చాలా నడుస్తుంటుంది. కానీ పని మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. వాయిదా పడిన పని గురించి శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులు మీ సలహాల కోసం మీ దగ్గరికి వస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు పని పెద్దగా సాగదు. మీరు చాలా చిరాగ్గా, అలసిపోయినట్లుగా, సెన్సిటివ్ గా కనిపిస్తారు. ఈ రోజు ఏ పనీ చేయకపోవడం మంచిది. మీరు కోపంలో రగిలిపోవడం వల్ల దాని ఫలితం ఇతరులు చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా మీకు నచ్చిన పని చేస్తూ రిలాక్స్ అవ్వడం మంచిది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు ఆఖరి నిమిషంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి పని చాలా ఎక్కువగా ఉంటుంది. ఓ ముఖ్యమైన మీటింగ్ కి కాస్త ఆలస్యం అవుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. స్నేహితుల్లో కొందరు మీ పట్ల కోపంతో ఉంటారు. అయితే పరిస్థితిని వారి వైపు నుంచి చూడడం గమనించండి. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీ చుట్టూ ఉన్నవారు మీ పై ఆధారపడడం వల్ల మీ బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఓ ఫ్రెండ్ మీ సహకారం కోరి మీ దగ్గరికి వస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.