29 అక్టోబరు 2019 (మంగళ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

29 అక్టోబరు 2019 (మంగళ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (29 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – కొన్ని కొత్త ఐడియాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి మీరు చాలా ఎక్సయిటెడ్ గా ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కటీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు చాలా సపోర్టివ్ గా ఉంటారు. కుటుంబ జీవితం ఈరోజు చాలా బాగుంటుంది. అందరిలోనూ మీరే సెంటరాఫ్ అట్రాక్షన్ కాబట్టి మీకు ఈరోజు ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. అయితే బయట తినడం మాత్రం కాస్త తగ్గించండి.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు పని చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. పనిలో కాస్త జాప్యం కూడా జరుగుతుంది. మీ పని వేగంగా జరిగేందుకు ఇతరుల పనిని కూడా మీరు చేయాల్సి వస్తుంది. తోటి పనివారితో పనిచేసేటప్పుడు మీ అహాన్ని దూరంగా ఉంచండి. మీ సీనియర్లు మిమ్మల్ని విమర్శించవచ్చు. కానీ దాన్ని పట్టించుకొని పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు ఇలా కొనసాగనివ్వండి. మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి బాధపడొద్దు.  

మిథున రాశి  (Gemini) – ఈరోజు మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. కానీ మీరు చాలా అలసటగా ఫీలవుతారు కాబట్టి పని సరిగ్గా చేయలేరు. అసలు మీ పనిని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో మీకు అర్థం కాదు. ఇలాంటప్పుడే ఇతరుల సాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు. అయితే ఈ విషయంలోనూ కమ్యునికేషన్ కి ప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. స్నేహితులు మిమ్మల్ని కలవలేకపోవచ్చు. వారికి కూడా ముఖ్యమైన పనులుంటాయని గుర్తించండి.

కర్కాటక రాశి  (Cancer) – ఈరోజు పని సాధారణంగా ఉంటుంది. కానీ మీకు మీతో పనిచేసేవారికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే కమ్యూనికేషన్ విషయంలో.. పని అప్పగించడంలో జాగ్రత్తగా ఉండండి. అది పెద్దగా ఇబ్బందిని తీసుకురాదు. కానీ ప్రయత్నిస్తే చిన్న ఇబ్బందిని కూడా దూరం చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు ఈరోజు బిజీగా ఉంటారు కాబట్టి మీకు చాలా సమయం దొరుకుతుంది.

సింహ రాశి  (Leo) – ఒక సమయంలో ఒక పని గురించి మాత్రమే ఆలోచించండి. అన్నీ ఒకేసారి చేసేయాలని ప్రయత్నించవద్దు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు.. మీ చుట్టూ ఉన్నవారు మీ వేగాన్ని అందుకోకపోవడం వల్ల వారికి మీ మీద కోపాన్ని కూడా తెప్పిస్తుంది. మీ కుటుంబ సభ్యులు మీ సలహా కోసం మీ దగ్గరికి వస్తారు. అందరితో ఆనందంగా గడుపుతారు. మీ స్నేహితులు ఇచ్చే ముఖ్యమైన సలహాలను తీసుకోవడం మర్చిపోవద్దు.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీకు చాలా బిజీగా ఉంటుంది. అయినా చిన్న చిన్న జాప్యాలు జరుగుతూనే ఉంటాయి. మీ చుట్టూ ఉన్నవారిని పనిచేయడానికి మీరు పదేపదే ప్రోత్సహించాల్సి రావొచ్చు. కొన్ని డెడ్ లైన్స్ మీకు ఒత్తిడిని పెంచుతాయి. కానీ సమయంలోపు మీరు అన్నీ పూర్తి చేస్తారు. మీ షెడ్యూల్ ప్రకారం అంతా జాగ్రత్తగా చేయండి. ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించండి. పని ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబం, స్నేహితుల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం ఇబ్బందిని కలిగిస్తుంది.

తుల రాశి (Libra) – ఈరోజు మీ దారి నుంచి పక్కకి వెళ్లి మరీ ఇతరులకు సాయం చేస్తారు. కొత్త పనులు మొదలు పెడతారు. కానీ దానికి కాస్త క్లారిటీ అవసరం కాబట్టి అది తెచ్చుకొని ముందుకెళ్లండి. మీరు తీసుకున్న నిర్ణయాలను అనుమానించవద్దు. మీ మీద నమ్మకం ఉంచండి. మీ భాగస్వామి తనని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని భావించవచ్చు. ఓపికతో వారి బాధను వినడం వల్ల మీకు వారి మనసులోని ఫీలింగ్స్ అర్థమవుతాయి.

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు పని మామూలుగా ఉంటుంది. కానీ ఓ పాత క్లైంట్ ని వారు పని చేసే విధానంలో మార్పులు తీసుకురావాలని కోరుతారు. అయితే విసుక్కోకుండా మీ మనసులోని మాటను చెప్పడం మంచిది. కుటుంబ సభ్యులు కాస్త డిమాండింగ్ గా మారతారు. వారితో అన్నీ క్లియర్ గా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ స్నేహితులు వారి సమస్యలతో బిజీగా ఉండే వీలుంటుంది. అందుకే వారి తరఫు వాదన కూడా వినడం మంచిది.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఒకసారి ఒక పని మాత్రమే చేయండి. ఈరోజు మీకు లభించే సక్సెస్ ని తలకెక్కించుకోకండి. ఇతరులు మిమ్మల్ని చూసి అసురక్షితంగా ఫీలయ్యే వీలుంటుంది. కానీ వారి ఫీలింగ్స్ మీకు మీ లక్ష్యానికి మధ్య రానివ్వకండి. మీ వ్యక్తిగత జీవితంలో ఇతరులు తలదూర్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఆత్మవిశ్వాసంతో ఉండండి.

మకర రాశి  (Capricorn) – కొన్ని అంశాలను మీరు మీ కోణం నుంచి కాకుండా ఇతరుల కోణం నుంచి కూడా చూస్తే వారి ప్రవర్తన అలా ఎందుకు ఉందో అర్థం అవుతుంది. చాలా కొద్ది సమయంలో చాలా ఎక్కువ పని చేయాల్సి రావచ్చు కాబట్టి వాయిదా వేయడం మానుకోండి. మీ పాత క్లైంట్ తో కొత్త పని మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మీ పనిని మరింత విస్తరించేందుకు మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈరోజు మీకు అంతా గందరగోళంగా అనిపిస్తుంటుంది. కానీ దాన్ని దూరం చేసుకొని మీ లక్ష్యం వైపు ఎలా గురిపెట్టాలో మీకు మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల సమస్యలను పరిష్కరిస్తూ మీ జీవితంలో వెనకబడిపోకండి. ఎక్కువ ఖర్చులు చేయడం తగ్గించండి. దీనివల్ల భవిష్యత్తులో బాధపడే అవకాశం ఉండదు. మీలాంటి వ్యక్తులతోనే ఉండడం వల్ల కుటుంబ జీవనం ఆనందంగా సాగుతుంది.

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీ పని మిమ్మల్ని చాలా బిజీగా మారుస్తుంది. కానీ మరీ ఎక్కువగా చేస్తానని చెప్పి తక్కువ చేయడం కంటే అలా ముందే చెప్పకపోవడం మంచిది. మీ స్నేహితులను చూసి మీరు చాలా ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే స్నేహితుల విషయంలో మాత్రం ఇతరులు ప్రారంభించిన సమస్య మీ మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. గొడవల్లో తలదూర్చకపోవడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.