3 అక్టోబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

3 అక్టోబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (3 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పరధ్యానాన్ని వీడి.. చేయాల్సిన పనులను ఆసక్తిగా చేయడం మంచిది. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేసేటప్పుడు.. ఆచితూచి అడుగులు వేయడం శ్రేయస్కరం. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అన్నింటి కన్నా ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. అలాగే ఆలుమగల విషయంలో పొరపొచ్చాలు వచ్చినా.. మళ్లీ వేగంగానే కలిసిపోతారు. అదేవిధంగా అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. తమ కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆస్తి పంపకాలు లేదా లావాదేవీలు చర్చకు వస్తాయి. పలు విషయాలలో స్నేహితులు లేదా భాగస్వామి సలహాలు తీసుకుంటారు. కోర్టు కేసులు కూడా పరిష్కార దశకు వస్తాయి. యువతకు తమ ప్రతిభను నిరూపించుకొనే అవకాశం లభిస్తుంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు వ్యాపార ఖ్యాతి పెరుగుతుంది. అలాగే రాజకీయ ఆశయాలు నెరవేరుతాయి. సినీ రంగంలో ప్రయత్నాలు చేసే యువతకు.. కొంచెం కష్టపడితే అనుకోని ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఉద్యోగస్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కుటుంబ సభ్యుల మనసును బాధపెట్టే పనులు చేయవద్దు. కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ భాగస్వామితో కూడా చర్చించండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు.. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ బాల్య మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఖర్చులను తగ్గించుకోండి. అక్కరకు రాని స్నేహాలను దూరం పెట్టండి.  వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio) – మీ ఆహారపు అలవాట్లు, డైట్, ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. నిపుణులను సంప్రదించడం మేలు. అదేవిధంగా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే... కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త వాహనాలు లేదా వస్తువులను కొనే అవకాశముంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. నూతన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. రాజకీయ నాయకులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

మకరం (Capricorn) – ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఆలుమగలు కొన్ని విషయాలలో వాదనలకు దిగకుండా.. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడం బెటర్. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని ఇబ్బందులలో చిక్కుకుంటారు. అయినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి.. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. అదేవిధంగా.. స్నేహితుల నుండి కూడా పలు విషయాలలో సహాయాన్ని పొందుతారు. అయితే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే విషయంలో.. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించడం మేలు. మహిళలు ఊహించని రీతిలో బహుమతులు, కానుకలు అందుకుంటారు. అలాగే ప్రేమికులు కొన్ని విషయాలలో.. ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.