4 అక్టోబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

4 అక్టోబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (4 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో ఒత్తిడి ఉంటుంది. అలాగే అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అవివాహితులు పలు శుభవార్తలను వింటారు. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమికులు తమ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. పరిష్కరించుకోవడం మంచిది. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్థిరాస్తులను కొనడానికి ప్రణాళికలు రచిస్తారు. విద్యార్థులు విదేశీ విద్యపై మక్కువ చూపిస్తారు. ఆఫీసులో ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ బాంధవ్యాలు మరింత పటిష్టంగా మారతాయి.

మిథునం (Gemini) – ఈ రోజు నిరుద్యోగుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆఫీసులో పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ పనులను ముందుగానే పూర్తి చేయడం మంచిది. అలాగే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోండి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబ సమస్యల వల్ల.. కాస్త ఒత్తిడికి గురవుతారు. అలాగే సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు క్రీడలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వివాహితులు సామాజిక వేడుకల్లో పాల్గొంటారు.  బహుమతులు, కానుకలు కూడా అందుకుంటారు. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కెరీర్ లేదా వ్యాపార విషయాలలో భాగస్వామి మద్దతు తీసుకుంటారు. అలాగే రిఫరెన్సుల ద్వారా మీరు అనుకున్న పనులు నెరవేరే అవకాశం ఉంది. అదేవిధంగా కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే బాల్య మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.  

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలోని అవరోధాలను అధిగమిస్తారు. విద్యార్థులు కూడా పోటీ వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు కూడా కొంతవరకు ఆర్థిక వెసులుబాటును పొందుతారు. అయితే తల్లిదండ్రులు లేదా భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. సినీ రంగంలో ప్రయత్నాలు చేసే ఔత్సాహికులు ఇంకాస్త కష్టపడాలి. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆస్తికి సంబంధించిన విషయాలలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పలువురి సలహాలు కూడా తీసుకుంటారు. మహిళలు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి పలు శుభకార్యాలలో పాల్గొంటారు.  

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వ్యాపారస్తులు ముందస్తు ప్లానింగ్ లేకుండా.. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే ఉద్యోగస్తులకు ఇది శుభ తరుణం. తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమికులు కూడా తమ బంధాన్ని మరింత పటిష్టంగా మార్చుకుంటారు.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబం నుండి కొంత ఒత్తిడి ఉంటుంది. అలాగే కొన్ని పనులలో చాలా బిజీగా ఉంటారు. అయితే కొన్ని వివాదాలు మిమ్మల్ని చుట్టు ముట్టే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాలలోనే వివేకంతో ప్రవర్తించాలి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి.  మీ నిజాయతీ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. అలాగే మీ మనసుకు కష్టం కలిగినప్పుడు... తల్లిదండ్రుల వద్దకు వెళ్లి స్వాంతనను పొందండి. వారి మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే మీకు ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు వ్యాపారస్తులు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్రోకర్లు లేదా ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వివాహితులు ఈ రోజు ఖరీదైన బహుమతులు లేదా కానుకలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

మీనం (Pisces) – ఈ రోజు మీ పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే మీ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారస్తులు ఆర్థికంగా లాభపడతారు. అయితే రుణాలు ఇచ్చి పుచ్చుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు అవకాశాల విషయంలో ఇంకాస్త శ్రద్ధ చూపించాలి.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.