7 అక్టోబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

7 అక్టోబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (7 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మీరు మీ భాగస్వామి నుండి ఓ చిత్రమైన బహుమతిని పొందే అవకాశం ఉంది.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో రిస్క్ చేయవద్దు. వివాహితులు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చట్టపరమైన వివాదాల నుండి ఉపశమనం పొందుతారు. 

వృషభం (Tarus) – ఈ రోజు మీరు ఏకపక్షంగా పనిచేసే అలవాటును మానుకోండి. ఆఫీసులో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టవచ్చు. వ్యాపారస్తు పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు నిర్లక్ష్యాన్ని వీడండి. లేకపోతే మంచి అవకాశాలను కోల్పోతారు. మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేసే సంఘటనలు జరుగుతాయి.

మిథునం (Gemini) – ఈ రోజు మీరు కొత్త కాంట్రాక్టులను పొందడం ద్వారా.. లాభాలను గడించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. విద్యార్థులు పోటీలలో  బహుమతులు గెలుపొందుతారు. వివాహితులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులూ మెరుగుపడతాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఓ  ఒప్పందాన్ని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసులో ప్రత్యర్థుల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.  వివాహితులకు తమ భాగస్వామితో బంధాలు పటిష్టంగా మారతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోండి.  అదేవిధంగా కెరీర్‌లో ముందుకు సాగాలంటే, కొన్ని ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. అప్పుడే మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రమోషన్ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే కొన్ని విషయాలలో భావోద్వేగానికి గురవుతారు. అదేవిధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు వేగంగనే పూర్తవుతాయి. ఆఫీసులో పనికి సంబంధించి పలు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. 

తుల (Libra) – ఈ రోజు విద్యార్థులు పలు బహుమతులు లేదా కానుకలను పొందుతారు. వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన ప్రణాళికను రచిస్తారు. అలాగే తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మొండి బాకీలు వసూలవుతాయి. అయితే ఈ రాశి వ్యక్తులు పలు వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మహిళలు అపరిచితుల విషయంలో అప్రమత్తతతో ఉండాలి. వ్యాపారస్తులు బ్రోకర్లు లేదా ఏజెంట్లను నమ్మే విషయంలో నూటికి పదిసార్లు ఆలోచించాలి. వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.   

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి.  అలాగే విద్యార్థులకు కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులు కూడా కొంచెం కష్టపడితే.. ఇంటర్వ్యూలలో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సృజనాత్మక, సినీ, మార్కెటింగ్ రంగాలలో వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

మకరం (Capricorn) – ఈ రోజు రాశి వ్యక్తులు కుటుంబానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో అనవసర చర్చలకు దూరంగా ఉండండి. డబ్బు విషయంలో ఏదైనా వివాదం తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనుకోని ఇబ్బందులలో పడతారు. అలాగే కొన్ని విషయాలలో ముందస్తు ప్రణాళికలు అవసరం. అలాగే  కొత్త పనులను జాగ్రత్తగా ప్రారంభించండి. అలాగే మీరు మీ స్నేహితుల సహాయం పొందే అవకాశం కూడా ఉంది. 

మీనం (Pisces) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే వివాహితులకు సొంత ఇంటి కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. ఆచితూచి వ్యవహరించాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.