9 అక్టోబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

9 అక్టోబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (9 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అలాగే మితిమీరిన ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో వివేకంతో వ్యవహరించాలి. అలాగే ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు సామాజిక కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల మద్దతు ఉంటుంది. 

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఉంటుంది. అలాగే ప్రేమికులకు  విషమ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. సినీ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు.. పరిస్థితులు బాగా కలిసొస్తాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అయినా సరే దిగులుపడవద్దు. మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. నిరుద్యోగులు సోమరితనాన్ని వీడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆస్తి సంబంధిత లావాదేవీలలో.. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తుల ఆర్థిక సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయినా అధైర్యపడవద్దు. మీరు నిజాయతీగా ఉన్నంత కాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.  

సింహం (Leo) –  ఈ  రోజు ప్రేమికులకు శుభదినం. తమ మనసులోని మాటను మీకు ఇష్టమైన వారితో పంచుకోండి. అలాగే అవివాహితులకు కూడా కళ్యాణ ఘడియలు దగ్గరపడుతున్నాయి. అలాగే ఆలుమగల బంధాలు కూడా పటిష్టంగా మారతాయి. కొన్ని విషయాలలో మీకు మీ భాగస్వామి మద్దతు కచ్చితంగా దొరుకుతుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆలుమగలు పలు శుభకార్యాలలో పాల్గొంటారు. అయితే అవగాహన లేని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఇలాంటి సమయాలలో సన్నిహితుల సలహాలు తీసుకోండి. 

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. ముఖ్యంగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మహిళలు ఇంటి అలంకరణ కోసం అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు ఉంటుంది. ఆలుమగలు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు కళలు, క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఉద్యోగస్తులు ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే కుటుంబానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమలో నిజాయతీ ముఖ్యమనే విషయాన్ని నమ్మాలి. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులను ఏదో తెలియని భయం వెంటాడుతుంది. మీ పనులపై వాతావరణ ప్రభావం పడవచ్చు. అలాగే వ్యాపారస్తులు తమ బిజినెస్‌కి సంబంధించి కొత్త ప్రణాళికలు రచిస్తారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. 

మకరం (Capricorn) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభం చేకూరుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి.. మంచి విషయాలను వింటారు.  ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎన్ని సమస్యలు ఎదురైనా.. పాజిటివ్ మనస్తత్వంతో ముందుకు వెళ్తారు.యువతకు కూడా కెరీర్‌లో మంచి ఆఫర్లు వస్తాయి. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా.. మీరు సమయస్ఫూర్తితో అటువంటి సమస్యలను అధిగమిస్తారు.  

మీనం (Pisces) –  ఈ రోజు ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. తమ బంధం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడానికి  ఇదే సరైన సమయం. అలాగే నిరుద్యోగులు కూడా ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. వ్యాపారస్తులు కూడా ఆకస్మాత్తుగా కొన్ని ఒప్పందాలను రద్దు చేసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.