వెలుగుల దీపావళికి.. ఈ దుస్తులతో మెరుపులద్దండి.. (Outfit Ideas For Diwali In Telugu)

వెలుగుల దీపావళికి.. ఈ దుస్తులతో మెరుపులద్దండి.. (Outfit Ideas For Diwali In Telugu)

దీపావళి (diwali).. దేశమంతా వెలుగుజిలుగులతో జరుపుకునే పండగ.. పండగల సీజన్ వస్తుందంటే చాలు.. కొత్త కొత్త రకాల దుస్తులు (outfits) ధరించడానికి అమ్మాయిలు వేచి చూస్తుంటారన్నది మళ్లీ చెప్పాల్సిన పనిలేని విషయం. కానీ ఎన్ని రకాల దుస్తులు మార్కెట్లోకి వస్తున్నా మనకేం నచ్చుతాయో.. ఏ రకాల దుస్తులు బాగుంటాయో తెలీక చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం.

దీపావళికి ఎన్నో షాపులు, ఆన్ లైన్ వెబ్ సైట్లు ఆఫర్లు అందిస్తుంటారు. మరి, దీపావళి సందర్భంగా మీ బంధువులు, స్నేహితుల మధ్య మీరే ప్రత్యేకంగా.. చుక్కల్లో చంద్రుడిలా ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ విభిన్నమైన దుస్తులు ప్రయత్నించండి. అటు సంప్రదాయబద్ధమైన దుస్తుల నుంచి ఇటు మోడ్రన్ దుస్తుల వరకూ ఎన్నో రకాలు ఎంచుకునే వీలుంటుంది. మరి, దీపావళి సందర్భంగా మీరు ధరించగలిగే అద్భుతమైన దుస్తుల గురించి.. కొత్తకొత్త మోడల్స్ గురించి తెలుసుకుందాం రండి..

Table of Contents

  సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే దీపావళి పండుగ రోజు, ఈ సందర్భంగా జరిగే పార్టీల్లో మెరిసిపోవాలనుకున్నవాళ్లు ఈ తరహా దుస్తులు ఎంచుకోవచ్చు.

  తెలుగులో దీపావళి శుభాకాంక్షలు కూడా చదవండి

  అనార్కలీ కుర్తా (Anarkali Kurta)

  myntra

  అనార్కలీ వేసుకోగానే పండగ కళంతా మనలోనే ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది. ఖరీదైనదే కావాల్సిన అవసరం లేదు.. సింపుల్ గా ఉన్నా సరే అనార్కలీ వేసుకుంటే చాలు.. పండగ లుక్ వచ్చేస్తుంది. దీనికోసం చేయాల్సిందల్లా ఒకవేళ అనార్కలీ సింపుల్ గా ఉంటే ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా తీసుకోవాలి. ఒకవేళ అనార్కలీ హెవీగా ఎంబ్రాయిడరీతో ఉంటే చున్నీ ప్లెయిన్ గా ఉండేలా చూసుకోవాలి.

  ఇక్కడ కొనండి 

  లాంగ్ స్లిట్ చుడీదార్ (Long Slit Chudidar)

  myntra

  గతేడాది నుంచి ట్రెండింగ్ లో ఉన్న కుర్తీ స్టైల్ లాంగ్ కుర్తీ విత్ స్లిట్.. ఇందులో భాగంగా రెండు కాళ్ల మధ్యలో కనిపించేలా ముందు వైపు స్లిట్ కనిపిస్తుంది. పక్కన స్లిట్ ఉన్నా లేకపోయినా ఈ స్లిట్ కుర్తాకు కొత్త లుక్ తీసుకొస్తుంది. ఈ తరహా చుడీదార్లను దీపావళి పార్టీలకు ఎంచుకుంటే చాలా అందంగా ఉంటుంది.

  ఇక్కడ కొనండి

  కుర్తా విత్ పలాజో (Kurta With Palazzo)

  Myntra

  కుర్తీ వేసుకోవడం మనం రెగ్యులర్ గా చేసే పనే.. కానీ రెగ్యులర్ గా కాకుండా కాస్త ఎంబ్రాయిడరీ చేసిన కుర్తీ వేసుకొని దానికి పలాజోను జత చేసుకుంటే చాలు.. మీకంటూ ఓ మంచి క్లాసీ లుక్ సొంతమవుతుంది. మీకు బాగా నప్పే రంగులను ఎంపిక చేసుకుంటే చాలు.. సింపుల్ అండ్ ట్రెండీ లుక్ మీ సొంతమవుతుంది.

  ఇక్కడ కొనండి

  లెహెంగా (Lehenga)

  Myntra

  లెహెంగా కేవలం పెళ్లిళ్లు, ఫంక్షన్లకే కాదు.. దసరా, దీపావళి వంటి పండగలకు కూడా చక్కగా నప్పుతుంది. ఇండియన్ డ్రస్సింగ్ విషయానికొస్తే చీర తర్వాత స్థానం లెహెంగాకే ఉంది. సింపుల్ గా ఉండే లెహెంగాలను ఎంచుకుంటే పండక్కి చాలా అందంగా ఉంటుంది.

  ఇక్కడ కొనండి

  ఎసిమెట్రికల్ కుర్తీ (Asymmetrical Kurti)

  Myntra

  దీపావళి కూడా సాధారణంగానే జరుపుకోవాలని.. పండగ సింపుల్ గా జరగాలని భావిస్తే చక్కటి ఎసిమెట్రికల్ కుర్తీ, లెగ్గింగ్ ఎంచుకోవచ్చు. స్లీవ్స్ లో స్టైల్స్ ఎంచుకుంటే చాలు.. కుర్తీ లుక్ అద్భుతంగా మార్చుకునే వీలుంటుంది.

  ఇక్కడ కొనండి

  మ్యాక్సీ (Maxi)

  Myntra

  ట్రెడిషనల్ లుక్ ఉన్న దుస్తుల్లో మోడ్రన్ డ్రస్ మ్యాక్సీ గురించి చెప్పడమేంటా? అనుకుంటున్నారా? కాళ్ల వరకూ నిండి ఉన్న డ్రస్ కాబట్టి కాస్త సంప్రదాయబద్ధమైన స్టైల్ ఎంచుకుంటే చాలు.. మ్యాక్సీ కూడా స్పెషల్ గా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది.

  ఇక్కడ కొనండి

  కుర్తీ విత్ సిగరెట్ ప్యాంట్స్ (Kurti With Cigarette Pants)

  Myntra

  కుర్తీ మధ్యలో ఉండే స్లిట్ నడుము భాగం నుంచి కింద వరకూ ఉంటుంది. దీని కింద జెగ్గింగ్, లెగ్గింగ్ వంటి సన్నగా ఉండే ప్యాంట్స్ వేసుకుంటే కొత్త లుక్ మీ సొంతమవుతుంది.

  ఇక్కడ కొనండి

  అనార్కలీ విత్ జాకెట్ (Jacket With Anarkali)

  amazon

  అనార్కలీ చాలా ఎక్కువ మంది ఇష్టపడే ఫ్యాషన్లలో ఒకటి. దానిపై లాంగ్ కోట్ వేసుకుంటే లుక్ ప్రత్యేకంగా కొత్తగా ఉంటుంది. అనార్కలీ సింపుల్ గా కోట్ పై ఎంబ్రాయిడరీ ఉండేలా ఎంచుకోవాలి. అప్పుడు లుక్ అద్భుతంగా ఉంటుంది.

  ఇక్కడ కొనండి

  కుర్తా ధోతీ ప్యాంట్ (Kurta Dhoti Pants)

  Flipkart

  సింపుల్ లుక్ తో అద్భుతంగా కనిపించాలనుకుంటే దానికి కుర్తా ధోతీ ప్యాంట్ ని ఎంచుకోవాలి. ఇవి పండగ తర్వాత రెగ్యులర్ వాడకానికి కూడా పనిచేస్తుంది. కుర్తా ఎంబ్రాయిడరీ ఎక్కువగా ఉంటే ధోతీ సింపుల్ గా ఉండేలా చూసుకోవాలి. అదే ధోతిపై డిజైన్ ఉంటే కుర్తీ పై ఎంబ్రాయిడరీ కాస్త తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

  ఇక్కడ కొనండి

  లంగా ఓణీ (Skirt On )

  Myntra

  తెలుగు సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో చీర తర్వాత గుర్తొచ్చేది లంగా ఓణీలే.. సంప్రదాయబద్ధంగా కనిపించే లంగాఓణీలు అమ్మాయిలను కొత్తగా చూపిస్తాయి. మీ రంగుకు నప్పే రంగుల్లో ముఖ్యంగా పేస్టల్ షేడ్స్ లో ఉండే రంగా ఓణీలను ఎంచుకోండి. ఎంబ్రాయిడరీ ఉన్నవి ఎంచుకుంటే పండగ సందర్బంగా మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.

  ఇక్కడ కొనండి

  చీరల్లో రకాలు (Types Of Sarees)

  చీర కట్టులోనే అద్బుతంగా కనిపించాలని భావించేవారికోసం చీరల్లోనూ రకరకాల మోడల్స్ ఎంచుకోవచ్చు.. అవేంటంటే..

  కంచి పట్టు చీరతో (With Kanchi Silk Saree)

  Myntra

  పండగ అంటేనే సంప్రదాయబద్ధంగా సిద్ధమయ్యేందుకు చక్కటి అవకాశం. మరి సంప్రదాయబద్ధంగా సిద్ధం కావాలంటే కంచి పట్టు చీరకు మించిన చీర మరొకటి ఉంటుందా? గ్రాండ్ గా కనిపించే ఈ చీరలో సౌకర్యంగా కూడా కనిపించవచ్చు. ఈ చీర రకరకాల ధరల్లో లభిస్తుంది. కాబట్టి మీ బడ్జెట్ ని బట్టి చీరను ఎంచుకోవచ్చు.

  ఇక్కడ కొనండి

  ఎంబ్రాయిడరీ చీర (Embroidered Saree)

  Myntra

  ఎంబ్రాయిడరీ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్.. ఎప్పటికప్పుడూ వచ్చే ఎంబ్రాయిడరీ డిజైన్లు మారుతూ ఉన్నా ఎంబ్రాయిడరీ చీరలకున్న క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. మీరు ఒకవేళ కాస్త ట్రెండీగా కనిపించాలనుకుంటే ఈ తరహా ఫ్యాషన్ ఎంచుకోవచ్చు. దీపావళి సందర్భంగా నిర్వహించే పార్టీలకు ఇది చక్కటి ఎంపిక అని చెప్పుకోవచ్చు.

  ఇక్కడ కొనండి

  ఇక్కత్ చీర (Ikkat Saree)

  Myntra

  ఈ చీరల్లో రంగుల కాంబినేషన్ చాలా విభిన్నంగా ఉంటుంది. డిజైన్లు కూడా వినూత్నంగా ఉంటాయి. ఇందులో టై అండ్ డై ప్రక్రియ తో పాటు ఇక్కత్ డిజైన్లు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ చీరల క్వాలిటీ కూడా చాలా బాగుండడం వల్ల ఎక్కువ రోజుల పాటు చీరలు మన్నుతాయి.

  ఇక్కడ కొనండి

  కలంకారీ చీర (Kalangari Saree)

  Myntra

  గత కొన్నేళ్లుగా ట్రెండింగ్ లో ఉన్న చీర రకం ఇది. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకూ ప్రతి సైజ్, డిజైన్లలో ఇవి లభిస్తాయి కాబట్టి మీకు నచ్చిన ధరలో నచ్చిన డిజైన్ ఉన్న చీరను ఎంచుకోవచ్చు. ఈ చీర మొత్తం డిజైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ని దీనికి జత చేయడం వల్ల చక్కటి లుక్ ని మీ సొంతం చేసుకునే వీలుంటుంది.

  ఇక్కడ కొనండి

  షీర్ శారీ (Sheer Shari)

  Myntra

  చీరలన్నింటిలో షీర్ చీరలు ఎంతో ప్రత్యేకం. చీరంతా నెట్ ఉండి బోర్డర్ మాత్రం ఉండడం ఈ చీరల ప్రత్యేకత. ఈ చీరలు కట్టుకున్నప్పుడు కొంగును అలా వదిలేసి పట్టుకుంటే చాలా బాగుంటుంది. దీపావళి పార్టీలకు, పండగ సందర్భంగా బయటకు వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి ఈ చీరలు పనిచేస్తాయి.

  ఇక్కడ కొనండి

  శారీ గౌన్ (Sari Gown)

  amazon

  చీరలు కట్టుకోవడం కష్టం అనుకునేవారి కోసమే ఈ శారీ గౌన్లు. వీటిని చూడడానికి చీరలాగే కనిపిస్తాయి. కానీ ధరించడం మాత్రం చాలా సింపుల్. మామూలు డ్రెస్ లా దాన్ని ధరించి కొంగు మాత్రం వేసుకుంటే సరిపోతుంది.

  ఇక్కడ కొనండి

  ప్యాంట్ శారీ (Sari Gown)

  instagram

  చీర కట్టుకోవడం రానివారు ఈ తరహా చీరను ఎంచుకోవడం వల్ల అటు సంప్రదాయబద్ధంగా కనిపించడంతో పాటు ఇటు సౌకర్యంగా కూడా ఉండవచ్చు. ఈ రకం చీరలో పెట్టికోట్ కి బదులుగా ప్యాంట్ ని ఉపయోగిస్తారు. ఉపయోగించే ప్యాంట్ ని బట్టి చీర పేరు ఉంటుంది. పలాజో శారీ, లెగ్గింగ్ శారీ, ప్యాంట్ శారీ.. ఇలా విభిన్న రకాలుగా దీన్ని కట్టుకునే వీలుంటుంది.

  శారీ విత్ జాకెట్ (Sari With Jacket)

  Instagram

  సాధారణంగా చీర కట్టుకోవాలంటే బ్లౌజ్ ని ధరిస్తాం. కానీ జాకెట్ శారీ దానికంటే చాలా విభిన్నం. షర్ట్ అంత పొడవున్న జాకెట్ ని వేసుకొని దాని పై నుంచి కొంగు వేసుకోవడం ఈ చీర తరహా అది. ఇలా చీర కట్టుకున్నప్పుడు నడుము పూర్తిగా కవర్ అయిపోతుంది. కాబట్టి నడుము కనిపించకుండా చీర కట్టుకోవాలి అనుకునేవారు ఇలా కట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది మామూలుగా కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కాకపోతే కొంగు మాత్రం కాస్త సన్నగా పెట్టుకుంటే సరిపోతుంది.

  లెహెంగా శారీ (Lehenga Saree)

  Myntra

  లెహెంగా కొనుక్కుంటే దాన్ని ఎక్కువ సార్లు కట్టుకోలేం. అదే చక్కటి చీరను కట్టుకొని దాన్ని లెహెంగా స్టైల్లో ధరిస్తే ఎంత బాగుంటుంది కదా.. దీనికి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. చీరను కుచ్చిళ్లు పెట్టకుండా లెహెంగాలా కాస్త వదులుగా ఉండేలా చుట్టూ కుచ్చులు పెట్టుకోవాలి. ఆ తర్వాత పల్లూ వేసుకుంటే సరిపోతుంది.

  ఇక్కడ కొనండి

   

  మర్మెయిడ్ శారీ (Mermaid Saree)

  Instagram

  సాధారణ చీరను లేదా కుచ్చిళ్లు పెట్టే విధానం మార్చి కట్టుకునే చీర రకం ఇది. ఈ చీర కట్టుకుంటే అద్భుతంగా కనిపిస్తారు. అయితే కింది భాగం కాస్త లావుగా ఉన్నవారికి మాత్రం ఇది అంతగా నప్పదనే చెప్పుకోవాలి. కాస్త స్పెషల్ గా సిద్ధమవ్వాలనుకున్నప్పుడు ఈ తరహా చీర కట్టును ఎంచుకొని దానికి తగినట్లుగా సింపుల్ ఆభరణాలతో తయారైతే చాలా అందంగా కనిపిస్తుంది.

  ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ (Indo Western Outfit)

  ఇండియన్ పద్ధతులే కాదు.. వెస్ట్రన్ దుస్తుల్లోనూ అందంగా కనిపించవచ్చు. కానీ పండుగ కాబట్టి ఇండో వెస్ట్రన్ దుస్తులను ఎంచుకోవడం మంచిది.

  ప్లీటెడ్ షార్ట్ స్కర్ట్ (Pleated Short Skirt)

  Myntra

  సాధారణంగా స్కర్ట్స్ చాలా పొడవుగా కాళ్ల వరకూ మ్యాక్సీ స్కర్ట్స్ లా ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ మీకు వెస్ట్రన్ దుస్తులు వేసుకునే అలవాటు ఉంటే సంప్రదాయబద్ధమైన దుస్తులు మీకు అంతగా నప్పవు అని మీరు భావిస్తే ప్లీట్స్ (కుచ్చులు) ఎక్కువగా ఉన్న షార్ట్ స్కర్ట్ ని ఎంచుకోవచ్చు. ఈ స్కర్ట్ పొడవు మాత్రం మోకాళ్లకు కింద వరకూ ఉండేలా చూసుకోవాలి.

  ఇక్కడ కొనండి

  కోల్డ్ షోల్డర్ డ్రస్ (Cold Shoulder Dress)

  Myntra

  చుడీదార్, స్కర్ట్, కుర్తా ఏదైనా సరే దానికి కొత్త లుక్ కావాలంటే కోల్డ్ షోల్డర్ ప్రయత్నించండి. కోల్ట్ షోల్డర్స్ లో కూడా చాలా రకాలుంటాయి. అందులో మీకు ఏ తరహా కోల్డ్ షోల్డర్ హ్యాండ్ సెట్ అవుతాయో తెలుసుకొని అలాంటి డ్రస్ ని ఎంచుకోవడం వల్ల చక్కటి లుక్ సొంతం చేసుకోవచ్చు.

  ఇక్కడ కొనండి

  కేప్ తో కొత్త లుక్ (New Look With Cape)

  Myntra

  ఏ తరహా దుస్తుల పైనైనా సరే కేప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇటు ఇండియన్ ఇటు వెస్ట్రన్ రెండు సంప్రదాయాలను కలిసేలా చూపిస్తుంది. కేప్ ని ధోతీ ప్యాంట్, మ్యాక్సీ స్కర్ట్, చుడీదార్, చీర దేనితోనైనా మ్యాచ్ చేయచ్చు. ఇండియన్ దుస్తులకు వెస్ట్రన్ టచ్ ని అందించవచ్చు. కావాలంటే చేతులు పొడుగ్గా ఉండే తరహా కేప్ ని కూడా ఎంచుకోవచ్చు.

  ఇక్కడ కొనండి

  క్రాప్ టాప్ (Crop Top)

  Myntra

  చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్ తో పాటు మ్యాక్సీ స్కర్ట్ ధరించి జుట్టును విరబోసుకొని కనిపిస్తే చాలు.. అద్భుతమైన లుక్ మీ సొంతం అవుతుంది. టాప్ ఎంబ్రాయిడరీ సింపుల్ గా ఉంటే స్కర్ట్ హెవీగా ఉండేలా.. ఒకవేళ టాప్ హెవీగా ఉంటే ప్లెయిన్ లేదా సింపుల్ గా ఉండే స్కర్ట్ ధరిస్తే చాలా అందంగా కనిపిస్తుంది.

  ఇక్కడ కొనండి

  బాల్ గౌన్ (Ball Gown)

  Myntra

  సాధారణంగా గౌన్ అంటే మనం కాక్ టెయిల్ పార్టీలు, ఎంగేజ్ మెంట్, సంగీత్ లాంటి ఫంక్షన్లకు ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాం. కానీ ఈ గౌన్ ని దీపావళి పార్టీల్లో కూడా ధరిస్తే అద్భుతంగా అందరిలోనూ మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు.

  ఇక్కడ కొనండి

  షరారా (Sharara)

  Myntra

  మామూలుగా చెప్పుకోవాలంటే షరారా అనేది ఇండియన్ వేర్ లో భాగమే.. అయితే దానికి కొద్దిగా మార్పులు చేసి షరారా పైనున్న కుర్తాని సింగిల్ స్లీవ్ లేదా స్లీవ్ లెస్ వేసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు ఓ పెద్ద లాంగ్ కోట్ వేసుకున్నా విభిన్నంగా కనిపిస్తారు.

  ఇక్కడ కొనండి

  ఎరుపు రంగుతో.. (In Red)

  Myntra

  ఎరుపు రంగు మిగిలిన అన్ని రంగుల కంటే ఎంతో విభిన్నం. ఈ రంగులో ఉన్న ఏ రకమైన దుస్తులైనా సరే అందరిలో మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. అవి సింపుల్ గౌన్ కావొచ్చు.. లేక డిజైనర్ దుస్తులు కావచ్చు. కానీ ఈ రంగులో ఏ దుస్తులు ఎంచుకున్నా సరే.. చూసేందుకు అద్భుతంగానే ఉంటాయి.

  ఇక్కడ కొనండి

  లెహెంగా విత్ షర్ట్ (Shirt With Lehenga)

  instagram

  షర్ట్ టాప్స్ ఇప్పుడు ప్రత్యేకంగా కనిపించే కొత్త ఫ్యాషన్.. మీరెంత అద్భుతంగా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు ఇండియన్ లుక్ కోసం లెహెంగా దానిపైన అద్భుతమైన షర్ట్ ఇటు వెస్ట్రన్ లుక్ ని అందిస్తుంది.

  దేశీ ప్యాంట్ సూట్ (Desi Pants Suit)

  instagram

  సాధారణంగా ప్యాంట్ సూట్ కార్పొరేట్ ఫంక్షన్లకు, మీటింగ్ లకు బాగుంటుంది. అయితే అచ్చం సూట్ లా కనిపిస్తూనే చుడీదార్ లుక్ని గుర్తుకు తెచ్చేలా ఇండియన్ ప్యాంట్ సూట్ ని ఎంచుకోవచ్చు. మీ ఆఫీస్ కి సంబంధించి ఏవైనా దీపావళి పార్టీల్లో పాల్గొంటుంటే ఇలాంటివి ఎంచుకుంటే చాలా బాగుంటుంది.

  ఆఫ్ షోల్డర్ టాప్ (Top Shoulder Off)

  Myntra

  సాధారణ చుడీదార్ కి ప్రత్యేకమైన లుక్ అందించాలంటే దాని చేతులతో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్లీవ్ టైప్స్ ఉన్నాయి. అందులో ఏవైనా ఎంచుకోవచ్చు. వీటికి బదులుగా ఆఫ్ షోల్డర్ట్స్ ఎంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీకు మోడ్రన్ దుస్తులు వేసుకోవడం బాగా అలవాటుంటే ఇలాంటివి ఎంచుకోవచ్చు.

  ఇక్కడ కొనండి

  యాక్సెసరీస్ ఇలా (Accessories)

  కేవలం దుస్తులు ధరించడం మాత్రమే కాదు.. వాటికి మ్యాచయ్యే యాక్సెసరీస్ కూడా ధరించడం వల్ల మీ లుక్ కంప్లీట్ గా అందంగా కనిపిస్తుంది.

  స్ట్రాపీ హీల్స్ (Strappy Heals)

  Myntra

  మంచి బంగారు లేదా వెండి రంగులో ఉండి రాళ్లు పొదిగిన హీల్స్ అన్ని దుస్తులపైన నప్పుతాయి. మీకు నచ్చితే పెన్సిల్ హీల్ ఎంచుకోండి. అది కాస్త ఇబ్బంది అనుకుంటే కిటెన్ హీల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు రంగుల హీల్స్ ఏ రంగు దుస్తులకైనా ఇట్టే మ్యాచ్ అవుతాయి. అంతేకాదు.. మీకు ఇన్ స్టంట్ గా పండగ లుక్ ని తెచ్చి పెడతాయి.

  ఇక్కడ కొనండి

  రింగ్ కఫ్ (Ring Cuff)

  Myntra

  చేతికి సింపుల్ రింగ్ పెట్టుకోవడం అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడంతా స్టేట్ మెంట్ రింగ్స్ కాలం నడుస్తోంది. పెద్ద ఉంగరాలతో పాటు రింగ్ కఫ్స్ కూడా ప్రయత్నించవచ్చు. ఇవి మీ చేతికి అందమైన సున్నితమైన లుక్ ని అందిస్తాయి. ఒక రింగ్ పెట్టుకున్న దానికంటే మీ లుక్ అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇవి పెట్టుకున్నప్పుడు మాత్రం గాజులు వేసుకోకూడదు.

  ఇక్కడ కొనండి

  ఇయర్ కఫ్ (Year Cuff)

  Myntra

  ఇయర్ కఫ్స్ మోడ్రన్ దుస్తులు వేసుకున్నప్పుడు పెట్టుకోవడం చాలామందికి అలవాటుంొటుంది. కానీ అవి సంప్రదాయ దుస్తులపైకి నప్పుతాయో లేదో అని సందేహిస్తుంటారు. అయితే పూర్తి సంప్రదాయబద్ధంగా కాకుండా కాస్త ట్రెండీగా సిద్ధమవ్వాలంటే వీటిని ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండో వెస్ట్రన్ దుస్తులను ఎంచుకుంటే వాటిపైకి ఇవి చక్కగా మ్యాచవుతాయి. వీటితో పాటు ఓ చక్కటి నెక్లెస్ పెట్టకుంటే చాలు.. మీ లుక్ పూర్తవుతుంది.

  ఇక్కడ కొనండి

  టెర్రాకోట జ్యుయలరీ (Terracotta Jewellary)

  amazon

  ఎత్నిక్ దుస్తులపై జ్యుయలరీ కూడా అంతలా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు టెర్రాకోట ఆభరణాలు ప్రయత్నించాల్సిందే. ఇందులో భాగంగా ఇయర్ రింగ్స్, పెద్ద గొలుసులతో పాటు గాజులు కూడా లభిస్తాయి. మీరు ఎంచుకున్న దుస్తులకు హారం మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని సెట్ లా కూడా తీసుకోవచ్చు. సంప్రదాయబద్ధమైన దుస్తులు ముఖ్యంగా చీరలకు ఇవి చక్కగా మ్యాచ్ అవుతాయి.

  ఇక్కడ కొనండి

  మాంగ్ టీకా (Mang Vaccine)

  Myntra

  మీకు ఎక్కువ ఆభరణాలు పెట్టుకోవడం ఇష్టం లేదా? రెండు మూడు ఆభరణాలతోనే అందరి లుక్ మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారా? అయితే మాంగ్ టీకా (పాపిడ బిళ్ల) తప్పనిసరి. ఓ చక్కటి స్టేట్ మెంట్ మాంగ్ టీకాతో పాటు పొడుగాటి షాండ్లియర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు.. మీరు మెడలో ఏమీ వేసుకోకపోయినా సరే.. అందమైన లుక్ మీ సొంతం అవుతుంది.

  ఇక్కడ కొనండి

  హెయిర్ క్లిప్ (Hair Clip)

  amazon

  ఓ మంచి ఫ్లోరల్ క్లిప్ పెట్టుకోవడం వల్ల మీ స్టైల్ గేమ్ ఇంకా అద్భుతంగా మారుతుంది. మీ హెయిర్ స్టైల్ ఎలాంటిదైనా.. మీ జుట్టు రకం ఏదైనా ఒక సింపుల్ ఫ్లోరల్ క్లిప్ మీ లుక్ ని మరింత పెంచుతుంది. ఇందులో భాగంగా స్టోన్స్, ముత్యాలు, రాళ్లతో చేసిన క్లిప్ వాడవచ్చు.

  ఇక్కడ కొనండి

  టెంపుల్ జ్యుయలరీ (Temple Jewellary)

  Myntra

  సాధారణంగా ట్రెడిషనల్ డ్రస్సింగ్ చీర, చుడీదార్ వంటి వాటితో ఎక్కువ మంది వేసుకోవడానికి ఇష్టపడే నగల్లో టెంపుల్ జ్యుయలరీ ముఖ్యమైనవి. చీర కట్టుకున్నప్పుడు కాసుల పేరులాంటివి వేసుకుంటే చుడీదార్ వేసుకున్నప్పుడు టెంపుల్ డిజైన్ లో మంచి లాకెట్ ఉన్న గొలుసు వేసుకోవచ్చు. సంప్రదాయబద్ధమైన దుస్తులపైకి ఇవి చాలా అందంగా ఉంటాయి.

  ఇక్కడ కొనండి

  గాజులు (Bangles)

  Myntra

  రంగురంగుల గాజుల కంటే అద్భుతమైన యాక్సెసరీ మరొకటి ఉండదేమో.. ఇటు ట్రెడిషనల్ అటు ట్రెండీ రెండు రకాల దుస్తులపై నప్పేవి గాజులు. మీ దేశీ గర్ల్ లుక్ ని అద్బుతంగా మార్చడంలో వీటి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వేసుకునే దుస్తుల రంగుకు మ్యాచ్ అయ్యే లేదా వాటికి వ్యతిరేక రంగులో ఉండే గాజులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. బంగారు, వెండి, రాగి రంగు గాజులను ట్రెండీ దుస్తుల పైకి ధరించవచ్చు.

  ఇక్కడ కొనండి

  క్లచ్ (Clutch)

  Myntra

  మెరుపులు మెరుస్తూ ఆకట్టుకునేలా ఉండే క్లచ్ అన్ని సంప్రదాయబద్ధమైన దుస్తులతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రస్ కాస్త ప్లెయిన్ గా సింపుల్ గా ఉన్నప్పుడు ఇలాంటివి పట్టుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది స్కర్ట్స్, చుడీదార్స్ వంటి వాటికి చక్కగా నప్పుతుంది. అదే చీరలైతే సింపుల్ గా ఉండే స్లింగ్ బ్యాగ్ లాంటి హ్యాండ్ బ్యాగ్ ధరిస్తే అందంగా కనిపిస్తుంది.

  ఇక్కడ కొనండి

  షాండ్లియర్ ఇయర్ రింగ్స్ (Chandelier Ear Rings)

  Myntra

  పొడవాటి ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకుంటే చాలు.. ఇంకే యాక్సెసరీస్ పెట్టుకున్నా లేకపోయినా మీ లుక్ కంప్లీట్ గా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ లో ఎక్కువగా స్టోన్స్ ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇవైతే ఏ రంగు దుస్తులకైనా నప్పుతాయి. అందంగా కూడా కనిపిస్తాయి.

  ఇక్కడ కొనండి

  POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

  క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.