ADVERTISEMENT
home / Food & Nightlife
ఈ దీపావళి పండుగ సందర్భంగా ఈ స్పెషల్ అరేబియన్ స్వీట్ కునాఫ ని ట్రై చేయండి.

ఈ దీపావళి పండుగ సందర్భంగా ఈ స్పెషల్ అరేబియన్ స్వీట్ కునాఫ ని ట్రై చేయండి.

దీపావళి (diwali) అంటే దీపాలు & టపాసులతో పాటు అందరికి గుర్తొచ్చేది ఎంతో ఇష్టమైనవి స్వీట్స్. దీపావళి పండుగ సందర్బంగా బంధువులు, స్నేహితులు & ఇరుగుపొరుగు వారితో రకరకాల స్వీట్స్  పంచుకుంటూ వారికి శుభాకాంక్షలు చెబుతుంటారు. అలా దీపావళి పండుగలో స్వీట్స్ కూడా చాలా ముఖ్యమైనవని మనం భావించవచ్చు.

హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ అనోఖి ఖీర్ టేస్ట్ చేయండి..!

స్వీట్స్ కి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ దీపావళి పండుగ సమయంలో ఒక కొత్తరకమైన స్వీట్ ని ప్రయత్నిద్దాం. అదే అరేబియన్ స్వీట్ (arabian sweet) కునాఫ. మరి ఈ కునాఫ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు

* పాలు

ADVERTISEMENT

* రెండు నిమ్మకాయలు

* చక్కెర

* రోజ్ వాటర్

* తేనె

ADVERTISEMENT

* పిస్తా పప్పులు

* సేమియా

* ఆరెంజ్ ఫుడ్ కలర్

* బటర్

ADVERTISEMENT

* చీజ్

ఇక ఇప్పుడు కునాఫ (kunafa) తయారుచేసే విధానం గురించి తెలుసుకుందాం..

ముందుగా ఒక లీటర్ పాలని బాగా మరగపెట్టాలి. అవి మరుగుతున్న సమయంలో అందులో రెండు నిమ్మకాయల రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనితో ఆ పాలు కొద్దిసేపటికి విరిగిపోతాయి. అలా విరిగిపోయిన పాలని ఒక తెల్లటి గుడ్డలోకి వడగట్టాలి. వడగట్టిన తరువాత వచ్చిన పాల ముద్దని మంచి నీటితో ఒకసారి శుభ్రంగా కడగాలి, అలా కడగడం వల్ల ఆ పాల ముద్దకి ఉన్న నిమ్మకాయ రసం తాలూకా రుచి, వాసనలు తొలిగిపోతాయి.

ఇక ఆ పాల ముద్దని మిక్సీ లో వేసుకుని పేస్ట్ లా మారే వరకు నాలుగు నుండి అయిదు సార్లు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. 

ADVERTISEMENT

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో చక్కెర పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. గిన్నెలో పావు కప్పు నీళ్లు, అర కప్పు చక్కెర వేసుకుని బాగా మరిగించాలి. చక్కెర బాగా కలిసే వరకు మనం కూడా ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. అలా బాగా మరుగుతున్న మిశ్రమంలోకి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ పోసుకొని పాకం బాగా మందంగా వచ్చే వరకు కలుపుతుండాలి. అలా చక్కెర పాకం బాగా వచ్చిన తరువాత అందులోకి 2 నుండి 4 టేబుల్ స్పూన్స్ తేనెని వేసుకోని పాకాన్ని మళ్లీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

ఇక ఇప్పుడు ఒక 50 గ్రాముల పిస్తా పప్పు తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత 400 నుండి 500గ్రాముల వేయించిన సేమియాని తీసుకుని దానిని చిన్నగా క్రష్ చేసుకోవాలి. అలా క్రష్ చేసుకున్న సేమియాలో కాచిన ఒక కప్పు వెన్న వేసుకోవాలి. అయితే వెన్న వేసే ముందే అందులో పావు స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలుపుకోవాలి. అలా ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.

సేమియా, వెన్న కలిపిన ఈ మిశ్రమాన్ని పక్కకి పెట్టుకుని, ఒక ప్యాన్ తీసుకుని దాని అడుగున వెన్నతో మొత్తం పూతలాగా పూయాలి. అలా పూసిన ప్యాన్ లోకి మనం కలిపి పెట్టిన సేమియా మిశ్రమంలో కొంత భాగాన్ని ఒక కేక్ ఆకారం వచ్చేలాగా ఆ ప్యాన్ కి మొత్తం ఒక వరుస వేసుకోవాలి. ఆ సేమియా పైన మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాల ముద్దని ఇంకొక వరుస లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఆ పాల ముద్ద పైన 100 గ్రాముల చీజ్ ని వేసుకోవాలి. (మీకు చీజ్ అదనపు రుచి కొరకు మాత్రమే, ఒకవేళ మీరు చీజ్ వద్దనుకుంటే వాడనవసరం లేదు). ఇక చివరగా మిగిలి ఉన్న సేమియాని ఆఖరి వరుసగా అదే ఆకారంలో పేర్చుకోవాలి.

ADVERTISEMENT

ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఆ ప్యాన్ పైన మూత పెట్టి స్టవ్ పైన ఉంచాలి. దీన్ని సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి, అలా ఉడికించిన సమయంలో వేడి కేక్ మొత్తానికి తగిలేలా ప్యాన్ ని తిప్పుతూ ఉండాలి. 10 నిమిషాల తరువాత ఆ ప్యాన్ లో ఉన్న కేక్ ఆకారాన్ని ఒక పల్చటి ప్లేట్ పైకి తీసుకోవాలి. అలా తీసుకునే ముందు ఆ ప్లేట్ కి సైతం వెన్న తో పూతగా రాయాల్సి ఉంటుంది. కావాలంటే కేక్ ని ఈ పల్చటి ప్లేట్ పైన ఉంచి మరలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు.

దీనితో కేక్ ని అన్ని వైపులా సమానంగా ఉడికించినట్లవుతుంది. చివరగా మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్న చక్కెర పాకాన్ని ఈ కేక్ పైన మొత్తం పోసుకోవాలి. ఈ కేక్ మనకి ఎక్కువ రుచిగా ఉండాలంటే ఆ పాకాన్ని మనం ఈ కేక్ మొత్తం కూడా వ్యాపించేలా దీని పైన పోసుకోవాల్సి ఉంటుంది. ఆఖరుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పు మిశ్రమాన్ని ఈ కేక్ పైన చల్లడం ద్వారా మనకి ఈ అరేబియన్ స్వీట్ కునాఫ సిద్దమవుతుంది. ఈ కూనాఫ వేడిగా ఉన్నప్పుడే రుచి చూస్తే ఈ పదార్ధం యొక్క అసలైన రుచిని మనం ఆస్వాదించగలుగుతాము.

తెలుసుకున్నారుగా కునాఫ ఎలా చేయాలో (recipe) , మరింకెందుకు ఆలస్యం ఈ దీపావళి సందర్భంగా ఇంటిలో తయారుచేసుకునే స్వీట్స్ లో దీన్ని కూడా చేర్చుకుని, పండుగని మరింతగా ఆస్వాదించండి.

హైదరాబాదీ ఫేమస్.. నోరూరించే పాయా ఎలా చేయాలో తెలుసుకుందామా?

ADVERTISEMENT

 

24 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT