ADVERTISEMENT
home / Finance
డబ్బు పొదుపు చేయలేకపోతున్నారా? అయితే ఇలా చేసి చూడండి..

డబ్బు పొదుపు చేయలేకపోతున్నారా? అయితే ఇలా చేసి చూడండి..

సాధారణంగా మనం ఎంత ఎక్కువగా సంపాదించినా సరే.. నెలాఖరు సమయంలో మాత్రం ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బు (money)మిగలదు. ఆన్ లైన్ షాపింగ్, డిస్కౌంట్ సేల్స్, నచ్చిన హోటల్స్.. వంటి వాటిపై మనకున్న డబ్బునంతా ఖర్చు చేస్తాం. ఇక నెలాఖరులో అది కొనకుండా ఉంటే బాగుండేది అంటూ మనల్ని మనం తిట్టుకోవడం కామన్ గా మారుతుంది. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం మన దేశంలో పొదుపు (savings)చేసేవారి శాతం గత కొన్నేళ్ల తగ్గుతూ వస్తోందట. అందుకే డబ్బు మిగుల్చుకొని వాటిని పొదుపు చేయడానికి మన వంతు ప్రయత్నం చేయడం వల్ల పొదుపు అలవాట్లను అలవర్చుకోవచ్చు. మరి, ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్బంగా రోజువారీ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేస్తే డబ్బు పొదుపు అవుతాయి అన్న విషయం తెలుసుకుందాం రండి..

1. పొదుపు చేసే యాప్స్

చాలా యాప్స్ మనకు డబ్బు పొదుపు చేయడం ఎలాగో చెప్పడంతో పాటు మన నెలవారీ ఖర్చులను, పొదుపు చేసిన మొత్తాన్ని చూపిస్తూ ఖర్చులు తగ్గించుకోవడం మనకు సులువయ్యేలా చేస్తుంది. మరికొన్ని యాప్స్ సినిమా టికెట్లు, హోటల్ ఫుడ్ పై ఆఫర్లు, డీల్స్ అందిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుంటే కొద్దిగా డబ్బు మిగులుతుంది. అయితే లగ్జరీలకు పెట్టే మొత్తాన్ని తగ్గిస్తేనే పొదుపు చేయడానికి డబ్బు మిగులుగుతుందని తెలుసుకోవాలి. అందుకే మీరు నెలలో రెండుసార్లు సినిమాలకు వెళ్తుంటే దాన్ని ఒకసారికి తగ్గించుకోండి. బయట భోజనం కూడా వీలైనంత తక్కువ చేయడం మంచిది.

2. నీళ్లు ఎక్కువగా తాగండి.

అదేంటి? నీళ్లు తాగడానికి డబ్బు పొదుపు చేయడానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది. మీరు ప్రతి పావు గంట లేదా అరగంటకోసారి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆకలిగా అనిపించకపోవడంతో పాటు జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు చాలా డబ్బును కూడా పొదుపు చేసుకోవచ్చు.

ADVERTISEMENT

3. రీసైకిల్ చేసేయండి..

రీసైకిల్ చేసిన పదార్థాలను ఉపయోగించడం వల్ల చాలా వరకూ ఖర్చులు తగ్గించుకోవచ్చు. చాలామంది ఇంటిని డెకరేట్ చేయడానికి రకరకాల వస్తువులు కొంటూ ఉంటారు. దీనికి బదులుగా మీరు ఉపయోగించిన సీసాలతో ఫ్లవర్ వేజ్ లు, ఐస్ క్రీం పుల్లలతో అలంకరణ వస్తువులు, టిష్యూ పేపర్లు, ప్లాస్లిక్ కవర్లతో పువ్వులు వంటివి తయారు చేసుకోవచ్చు. ఇలా ఆలోచించాలే కానీ అటు టైం పాస్ ఇటు అందంగా, ఆకర్షణీయంగా ఉండే డెకరేటివ్ వస్తువులు ఎన్నో తయారుచేసుకోవచ్చు. డబ్బు ఆదా అవుతుంది.

4. ఇంకాస్త నడిచేయండి..

నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. అియతే నడక అంటే ఉదయమో, సాయంత్రమో చేయాల్సిన అవసరం లేదు. వీలున్నప్పుడల్లా నడిచేయడం మంచిదే. ఒక్కోసారి తక్కువ దూరాలకు కూడా మనం ఆటోలు, క్యాబ్ లు తీసుకుంటూ ఉంటాం. మీ స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ నడిచి వెళ్తే అటు ఆరోగ్యంతో పాటు ఇటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆ మొత్తాన్ని మీరు వేరే వాటికి ఉపయోగించకుండా పొదుపు చేయడం కోసం ఓ డబ్బా లో దాచి ఉంచేయండి.

ADVERTISEMENT

5. జార్ పెట్టుకోండి.

మీరు ఏదైనా అలవాటు మానుకోవాలనుకుంటున్నారా? అలవాటు మానడం వల్ల మీకు వ్యక్తిగతంగా లేదా ఆరోగ్యపరంగా మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా ప్రయోజనం అందే ప్రయత్నం చేయండి. దీనికోసం మీరు మార్చాలనుకుంటున్న అలవాటును పాటించని ప్రతిసారి ఒక వంద రూపాయలను ఓ డబ్బాలో వేయండి. ఉదాహరణకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు ప్రయత్నిస్తున్నారనుకోండి. జంక్ ఫుడ్ తిన్న ప్రతిసారీ వంద రూపాయలను ఓ జార్ లో వేయండి. ఇలా ఓ వారం పాటు చేసిన తర్వాత అప్పటికీ అలవాటు మార్చుకోలేకపోతే ఈ మొత్తాన్ని రెట్టింపు చేయండి. ఆ మేరకు మీ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. తగ్గించిన ఖర్చులతో గడపడం కాస్త ఇబ్బందే కాబట్టి తొందరగానే ఆ అలవాటును మార్చుకుంటారు.

6. సేల్ లో కొనండి.

పొదుపు చేయమని చెబితే అస్సలు ఖర్చు పెట్టవద్దని కాదు.. కాస్త ఆలోచించి తెలివిగా ఖర్చు చేయాలని దాని అర్థం. ఉదాహరణకు ఆన్ లైన్ షాపింగ్ సైట్ లో మీకు ఓ అద్బుతమైన డ్రస్సు నచ్చిందనుకోండి. దాన్ని వెంటనే కొనేయకుండా మీ కార్ట్ లో వేసుకొని అలా ఉంచుకోండి. కొన్నాళ్లకు ఏదైనా సేల్ ఉన్నప్పుడు అది మామూలు కంటే తక్కువ ధరకే లభిస్తుంది.

7. ఇవి తగ్గించుకోండి..

ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు గాలి బయటకు పోవడం వల్ల అది మరింత పనిచేయాల్సి ఉంటుంది. తద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పెరుగుతుంది. అన్నీ తలుపులు, కిటికీలు మూయడం వల్ల గది తొందరగా చల్లారుతుంది. అలాగే ఉంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అన్ని స్విచ్చులూ ఆపేవారా? లేదా? చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు. 

ADVERTISEMENT

8. విభజించు.. ఖర్చు పెట్టు..

ఖర్చు పూర్తయిన తర్వాత పొదుపు చేయడం చాలా మందికి అలవాటు. కానీ ఇది తప్పు. ముందు పొదు పు చేసేందుకు కొంత డబ్బు పక్కకు పెట్టిన తర్వాత మాత్రమే ఖర్చులు పెట్టుకోవాలి. మీ సంపాదనలో కనీసం నలభై శాతం పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవచ్చు. మీ ఖర్చు కోసం ఓ బడ్జెట్ రాసుకొని పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులను అడ్డుకోవచ్చు. ఇందులోనే ఓ 20 శాతం అత్యవసర ఖర్చులకు కూడా పెట్టుకోవడం అవసరం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

30 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT