ADVERTISEMENT
home / Fitness
చేతుల్లో కొవ్వు తొలగించాలంటే ఈ సులువైన వ్యాయామాలు ఇంట్లోనే చేసేయండి..

చేతుల్లో కొవ్వు తొలగించాలంటే ఈ సులువైన వ్యాయామాలు ఇంట్లోనే చేసేయండి..

బరువు తగ్గాలని చాలామంది భావిస్తుంటారు. కానీ అది అంత సులభమేమీ కాదు.. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. ఎంత వ్యాయామం (exercise) చేసినా కొన్ని భాగాల్లో కొవ్వు (fat) కరగడం అంత సులభం కాదు. అయితే పొట్ట భాగం, తొడలు, పిరుదులు వంటి భాగాల్లోనే కాదు.. చేతుల్లోనూ కొవ్వు ఎక్కువగా చేరి ఇబ్బంది పెడుతుంటుంది. అయితే కొన్ని సులభమైన వ్యాయామాలు చేస్తే చాలు.. చేతుల్లో ఉన్న ఈ కొవ్వును కరిగించి.. కండలు పెరిగేలా చేసే వీలుంటుంది. ఈ వ్యాయామాలు చేయడానికి జిమ్ కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.

స్టాండింగ్ వి రైజ్

shutterstock

దీన్ని చేయడం కోసం మీరు మోయగలరు అనుకున్నంత బరువుతో ఉన్న డంబెల్స్ ని మీ చేతులోకి తీసుకోండి. కాస్త బరువు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు నిటారుగా నిలబడి మీ చేతుల్లో డంబెల్స్ పట్టుకొని వాటిని భుజాలకు సమాంతరంగా చాపాలి. ఆ తర్వాత మోచేతుల వద్ద మడుస్తూ చేతులను పైకి లేపాలి. ఇలా చేయడం వల్ల బాహు బలం చూపిస్తున్నట్లుగా పోజ్ వస్తుంది. ఇలా చేతిలోని బరువులను పైకి లేపి మళ్లీ కిందకు తీసుకురావాలి. ఆ తర్వాత డంబెల్స్ ని ముందు ఛాతీ దగ్గరికి తీసుకొచ్చి రెండు చేతులు లేదా డంబెల్స్ ఆనేలా చేసి తిరిగి మరోసారి ఇదే వ్యాయామాన్ని కంటిన్యూ చేయాలి. ఇలా పన్నెండు చేస్తే దాన్ని ఒక సెట్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి సెట్స్ మూడు చేస్తే ఈ వ్యాయామం పూర్తవుతుంది.

ADVERTISEMENT

పుషప్స్

shutterstock

ముందుగా కింద చాప వేసుకొని బోర్లా పడుకోవాలి. చేతులు ముందుకు చాపాలి. చేతులు కింద పెట్టి వాటి సాయంతో భుజాలు, ఛాతి, ముఖం వంటివి పైకి లేచేలా చూడాలి. ఇలా చేతులు, అరికాళ్లపై బరువు మోస్తూ ఐదు సెకెన్ల పాటు ఉన్న తర్వాత తిరిగి కింద పడుకోవాలి. ఇది చేతుల్లోని కొవ్వును కరిగించి కండరాలు పెరిగేలా చేయడంతో పాటు శక్తిని కూడా పెంచుతుంది. ఇలా మూడు సార్లు చేస్తే ఒక సెట్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి సెట్స్ మొత్తం మూడు సార్లు చేయాలి. అంటే తొమ్మిది సార్లు ఈ వ్యాయామం చేయాలన్నమాట.

ఈసారి ఎవ‌రైనా బ‌రువు పెరిగావ‌ని చెబితే.. వారికి ధీటుగా బ‌దులివ్వండిలా..!

ADVERTISEMENT

ఆర్మ్ సైకిల్స్

shutterstock

నిటారుగా నిలబడాలి. చేతులు భుజాలకు సమాంతరంగా చాపాలి. ఇలా నిలబడినప్పుడు నడుము నిటారుగా.. ఛాతి గట్టిగా వూపిరి పీల్చుకొని ఉంటాయి. ఆ తర్వాత సవ్య దిశలో చేతులను గుండ్రంగా తిప్పాలి. ఉన్న ప్రదేశంలోనే చేతులను తిప్పడం వల్ల చేతుల్లోని కొవ్వు కరుగుతుంది. సవ్య దిశలో తిప్పిన తర్వాత తిరిగి అపసవ్య దిశలో కాసేపు తిప్పాలి. దీన్ని ఒక సెట్ అంటారు. అంటే మూడు సార్లు సవ్య దిశలో, మూడు సార్లు అపసవ్య దిశలో తిరిగితే దాన్ని సెట్ ఇలాంటివి మూడు సెట్స్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల కూడా కొవ్వు కరుగుతుంది.

తొడలు లావుగా ఉన్నాయా? ఇలా చేస్తే సన్నగా కనిపిస్తారు..!

ADVERTISEMENT

వాల్ పుషప్స్

shutterstock

ఇందాక వ్యాయామం చేసినట్లే గోడకు ఆనించి చేయాలన్నమాట. దీనికోసం గోడకు ముఖం పెట్టి నిలబడాలి. ఇప్పుడు చేతులు గోడపై పెట్టి గోడను నెట్టే ప్రయత్నం చేయాలి. ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు మీ శరీరం మొత్తం బరువు చేతులపైనే పడాలి. అందుకే బరువు మీ కాళ్లపై ఉండకుండా కాళ్లను ఏటవాలుగా పెట్టి మునివేళ్లపై నిలబడాలి. ఇలా కాసేపు నెట్టండి. ఆ తర్వాత గోడకు దగ్గరగా వెళ్లి గోడనుంచి మీ శరీరాన్ని దూరంగా నెట్టే ప్రయత్నం చేయండి. వెనక్కి ముందుకి చేయడం వల్ల పుషప్స్ పూర్తవుతాయి. ఇలా చేయడం వల్ల చేతుల్లో ఉన్న కొవ్వు మాత్రమే కాదు. వీపులో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ఇలా పన్నెండు సార్లు చేస్తే ఒక సెట్ పూర్తయినట్లు. అలాంటి సెట్స్ రెండు చేయడం వల్ల రోజువారీ వ్యాయామం పూర్తవుతుందన్నమాట.

ట్రైసెప్ ఎక్స్ టెన్షన్స్

ADVERTISEMENT

shutterstock

దీన్ని చేయడానికి కూడా ఓ బరువైన డంబెల్ అవసరమవుతుంది. మీ కాళ్లను భుజాలంత వెడల్పుగా ఉంచి రెండు చేతులతో డంబెల్ ని పట్టుకోవాలి. ఇప్పుడు డంబెల్ ని తల వెనక్కి తీసుకువెళ్లాలి. ఇలాంటప్పుడు మీ మోచేతులు రెండూ మీ కళ్ల పక్కన వస్తాయి. ఇప్పుడు ఆ బరువుని మీకు వీలున్నంతగా కిందకు జరిపి ఆ తర్వాత తిరిగి భుజాలకు తాకేలా పైకి లేపాలి. చేతులు మొత్తం ఆడించకుండా కేవలం మోచేతి భాగం నుంచే జరుపుతూ రావాలి. ఇలా పది సార్లు చేస్తే ఒక సెట్ ఇలాంటి సెట్స్ రెండు చేయాలి.

పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!

ఈ చిట్కాలు కూడా..

ADVERTISEMENT

shutterstock

కేవలం ఆ వ్యాయామాలు చేయడం వల్లే మీ చేతుల్లోని కొవ్వు కరిగిపోదు. దానికోసం

మీ ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ క్యాలరీల ఆహారం తీసుకుంటే మంచిది.

రోజంతా చాలా ఎక్కువగా నీళ్లు తాగాలి.

ADVERTISEMENT

చక్కెర, స్వీట్లు, ఐస్ క్రీం లకు దూరంగా ఉండాలి.

అప్పుడప్పుడూ ఈత కొట్టడం, నడవడం వంటివి చేయాలి.

సరైన సైజులో ఉన్న బ్రా కూడా ఉపయోగించాలి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీమరియు బెంగాలీ

ADVERTISEMENT

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

25 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT