చేతికి గాజులు వేసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?

చేతికి గాజులు వేసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?

గాజులు (Bangles).. మన దేశంలో స్త్రీలందరికీ ఇష్టమైన ఆభరణాల్లో ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. ఇందులో భాగంగా చాలామంది గాజులు వేసుకోవడం తగ్గిపోయింది. ఇప్పుడు పది మందిని గమనిస్తే అందులో గాజులు వేసుకున్న వారు ఐదుగురు కనిపిస్తున్నారంటే ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే మామూలు సమయంలో వేసుకున్నా వేసుకోకపోయినా పండగల సమయంలో సంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గతంలో మాత్రం మహిళలు చేతి నిండా గాజులు వేసుకొని కనిపించేవారు. ఇప్పటికీ పెళ్లి, సీమంతం వంటి సందర్భాల్లో చేతి నిండా గాజులు వేసి దీవించడం ఆనవాయితీ. గాజులు సౌభాగ్యానికి సూచిక. అయితే ఇలా గాజులు వేసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం రండి..

ఒక వ్యక్తి ఆరోగ్యంగా జీవించేందుకు వారి శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడం ఎంతో అవసరం. చేతులకు గాజులు వేసుకున్నవారికి శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గాజులు వేసుకున్నాక అవి మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురి చేయడం వల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. అందుకే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ చేతులకు గాజులు వేసుకునేవారు.. పని చేస్తున్నప్పుడు అవి కిందకి పైకి జరుగుతూ రక్త నాళాలకు మసాజ్ అందించి రక్త ప్రసరణను సజావుగా చేస్తాయి. దీనికి గాజులు గాజువైనా, బంగారువైనా పెద్ద మార్పేమీ ఉండదు.

చెబితే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ గాజులు వేసుకున్న వారు అలసటకు తక్కువగా గురవుతారట. అవును.. గాజులు వేసుకోవడం వల్ల మన శరీరంలో శక్తి స్థాయులు పెరగడంతో పాటు అలసట తగ్గుతుంది. అంతేకాదు.. ఎంతటి ఒత్తిడి. నొప్పినైనా భరించే శక్తి మనకు అందుతుందట. అందుకే పూర్వకాలంలో ఐదో నెలలో గర్భిణులకు చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యేవరకూ ఉంచుకోవాలని చెప్పేవారు. గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు.. ప్రసవం సమయంలో నొప్పిని భరించే శక్తి కూడా వీటి వల్ల అందుతుందని అప్పట్లో భావించేవారు. గాజులు చేతిపై మసాజ్ చేయడం వల్ల ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి శక్తి జనరేట్ అవుతుందట.

మట్టి గాజులు వేసుకుంటే చాలు.. శరీరంలో వేడిని అది లాగేస్తుందట. అందుకే ఒకవేళ మీ శరీరం వేడి గుణాన్ని కలిగి ఉంటే మట్టి గాజులు వేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు బంగారు గాజులు వేసుకునే వారైనా సరే కనీసం ఒక్కటైనా మట్టి గాజు చేతికి ఉండాలని అందుకే చెబుతారు. ప్రస్తుత లైఫ్ స్టైల్ లో జంక్ ఫుడ్ ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే గాజులు వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందే వీలుంటుంది.

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల అసమతౌల్యత సమస్య ఎదురవుతోంది. దీనివల్ల రుతుక్రమం కూడా క్రమం తప్పుతుంది. ప్రతి స్థాయిలో మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. కానీ గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత సమస్య చాలావరకూ తగ్గుతుందట. మహిళల శరీరం మగవారితో పోల్చితే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకే వారి శరీరంలో హార్మోన్లు తరచూ మారుతూ ఉంటాయి. గాజులు వేసుకోవడం వల్ల వాటి స్థాయి బ్యాలన్స్ డ్ ఉంటుంది.

గాజులు మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయట. హార్మోన్లు సమతుల్యంగా ఉండడం వల్ల, శరీరంలో అన్ని జీవక్రియలు ఆరోగ్యంగా సాగడం వల్ల మానసికంగానూ ఆరోగ్యంగా ఉండే వీలుంటుంది. అంతేకాదు.. గాజులు సరైన మానసిక సమతుల్యత సాధించడం కోసం తోడ్పడతాయట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.