ADVERTISEMENT
home / సౌందర్యం
దీపావళి కాలుష్యం నుంచి మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

దీపావళి కాలుష్యం నుంచి మీ చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

దీపావళి (diwali).. సంవత్సరానికి ఓ సారి వచ్చే వెలుగుల పండుగ ఇది. దీపావళి పండుగ వస్తుంది అనగానే ఏ మేకప్ వేసుకోవాలి.. ఏ దుస్తులు ధరించాలి.. వంటి వాటితో పాటు ఇంటిని ఎలా డెకరేట్ చేయాలి.. ఎవరికి ఏ బహుమతులు అందించాలి.. ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. వీటన్నింటితో పాటు మిఠాయిలు, టపాసులు (crackers) అయితే తప్పనిసరి. అందుకే దీపావళి సందర్భంగా కాలుష్యం (pollution) ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కాలుష్యం వల్ల మీ చర్మం డల్ గా మారే అవకాశం ఉంటుంది. మరి, ఈ దీపావళి సందర్భంగా మీ చర్మం అలంకరణకు ఉపయోగించిన ఫెయిరీ లైట్ల కంటే అందంగా మెరవాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? దీపావళి కంటే ముందే మీ చర్మాన్ని కాస్త సిద్ధం చేసుకోవాలి. కాలుష్యం బారిన పడిన చర్మానికి రిలీఫ్ అందించేలా కొన్ని ట్రీట్ మెంట్స్ తీసుకోవాలి. అదెలాగో తెలుసుకుందాం రండి..

1. డబుల్ క్లెన్సింగ్

కాలుష్యం, మురికి మన చర్మాన్ని కప్పేస్తుంది. చర్మం డల్ గా కనిపించడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు చర్మాన్ని.. చర్మంలోని రంధ్రాలు డబుల్ క్లెన్స్ చేయడం వల్ల మురికి పూర్తిగా తొలగిపోతుంది. అందుకే దీపావళి తర్వాత రాత్రి ఇంటికి చేరినప్పుడు క్లెన్సింగ్ ఆయిల్ లేదా మిసెల్లార్ వాటర్ తో మేకప్ ని తొలగించుకోవాలి. మంచి క్లెన్సర్ ని ఉపయోగించుకోవాలి. డీప్ క్లెన్సర్ ని ఉపయోగించడం వల్ల చర్మం లోతులో ఉన్న మురికి కూడా తొలగిపోతుంది. దీనివల్ల మేకప్ తో పాటు దీపావళి టపాసులు కాల్చడం వల్ల చర్మం పై చేరుకున్న మురికి కూడా తొలగిపోతుంది.

ADVERTISEMENT

2. ఎక్స్ ఫోలియేషన్

మీ చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా.. మెరుస్తూ ఉండాలంటే చాలు.. మీ ముఖానికి మాత్రమే కాదు.. శరీరానికి మొత్తానికి మంచి స్క్రబ్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మన చర్మం పై ఎలాంటి డెడ్ స్కిన్ లేకుండా చేసుకోవచ్చు. చర్మం పొడిగా, పొలుసులుగా మారకుండా ఉంటుంది. దీనికోసం ఇంట్లోనే స్క్రబ్ ని తయారుచేసుకోవడం మంచిది. ఇందులో భాగంగా రెండు టీ స్పూన్ల వాల్ నట్ షెల్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల ఫేస్ వాష్ లేదా బాడీ వాష్ కలిపి దాంతో చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల మీ చర్మం పట్టులా మెరిసిపోతుంది. స్క్రబ్ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

3. మాస్క్ వేసేయండి.

స్క్రబ్ తర్వాత ఓ చక్కటి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కాలుష్యం వల్ల పాడైన మీ చర్మం తిరిగి కాంతిని పుంజుకుంటుంది. అంతేకాదు.. మీరు మేకప్ వేసుకున్నా.. వేసుకోకపోయినా అందంగా మారుతుంది. సల్ఫర్ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మన చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. మీ చర్మం మరీ వాడిపోయినట్లుగా కనిపిస్తుంటే ఒకటి కంటే ఎక్కువ మాస్క్ లు వేసుకోవడం కూడా చేయవచ్చు.

ADVERTISEMENT

4. ఇన్ స్టా ఫేషియల్స్

ఖరీదైన బ్యూటీ ట్రీట్ మెంట్లు చేయించుకోవడానికి మీ దగ్గర సమయం కానీ డబ్బు కానీ లేదా? అయితే దానికి బదులు మీరు సులువైన ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి మైక్రోడెర్మాబేషన్ ట్రీట్ మెంట్ చేయించుకోండి. దీనికి పెద్దగా ఖర్చు అవ్వదు. పైగా దీని వల్ల మీ డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోయి చర్మం మెరుస్తూ పట్టులా కనిపిస్తుంది. చాలామంది డెర్మటాలజిస్టులు ఇన్ స్టా ఫేషియల్స్ కూడా ఆఫర్ చేస్తారు. ఇరవై నిమిషాల్లో ఇవి మీ చర్మాన్ని చాలా అందంగా మారుస్తాయి. వీటిని కూడా ప్రయత్నించవచ్చు. ఇవి మిమ్మల్ని వెంటనే అందంగా మార్చడంతో పాటు మీ మెరుపును మూడు వారాల వరకూ నిలిచి ఉండేలా చేస్తాయి.

అయితే ట్రీట్ మెంట్స్ ఎన్ని తీసుకున్నా దీపావళి కంటే ముందే చర్మాన్ని కాపాడుకోవడం వల్ల హానికరమైన కెమికల్స్ మీ చర్మంలోకి ప్రవేశించకుండా కాపాడుకోవచ్చు. దీనికోసం నీళ్లు ఎక్కువగా తాగడం, విటమిన్ ఇ ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోవడం, చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం, సన్ స్క్రీన్ రాసుకోవడం.. అన్నింటి కంటే ముఖ్యంగా చర్మాన్ని కవర్ చేసుకోవడం మంచిది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ADVERTISEMENT
25 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT