ADVERTISEMENT
home / వినోదం
తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా…

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా…

తెలుగు ప్రజలకి సినిమాలంటే ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ ఫేవరెట్ హీరో సినిమా విడుదలను కూడా ఓ పండగలా చేయడం తెలుగు ప్రేక్షకులకే చెల్లింది. తెలుగు ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చితే, అది తెలుగులో రూపొందిన చిత్రమా? లేక డబ్బింగ్ సినిమా నా? అని కూడా చూడకుండా దానిని ఆదరించడం ఒక్క తెలుగు ఆడియన్స్ (telugu audience)కే చెల్లింది. ఇందుకు సాక్ష్యంగా ఎంతోమంది తమిళ డైరెక్టర్స్ (directors) కి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ చూస్తే తెలిసిపోతుంది. అలాగే ప్రముఖ తమిళ దర్శకులు తీసే చిత్రాలు ఇక్కడ భారీ స్థాయిలో విడులవుతుండడం & అంతే భారీ వసూళ్లు రాబట్టడం కూడా జరుగుతుంది. శంకర్, మురుగదాస్, ఎస్ జె సూర్య, కేవీ ఆనంద్, అట్లీ వంటి దర్శకుల తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగు సినిమాలతో పోటీగా వసూళ్లు అందుతాయంటే అతిశయోక్తి కాదు.

ట్విట్టర్ లో కలిశారు.. జీవితంలో ఒక్కటయ్యారు.. రాహుల్ – చిన్మయి ల అందమైన ప్రేమ కథ..

ఇలాగే తమిళ దర్శకులకి ఏ స్థాయిలో అయితే తెలుగు సినీ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ (following) ఉందో అదే స్థాయిలో తమిళ హీరోలకి ఉంది. వారిలో రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ, విజయ్, అజిత్ వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఒకప్పుడు కేవలం రజినీకాంత్ & కమల్ హాసన్ లకి మాత్రమే పరిమతమైన ఈ తమిళ హీరోల (tamil heroes) క్రేజ్ 2004 నుండి విక్రమ్ & సూర్య లకి కూడా పెరిగింది. ఆ సమయంలో శివపుత్రుడు, అపరిచితుడు, గజినీ వంటి చిత్రాలు హిట్టవ్వడంతో వారికి ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తరువాత కాలంలో అజిత్, విజయ్ కొన్ని చిత్రాలతో తెలుగు లో మార్కెట్ పెంచుకోగా.. వారి తరువాత లైన్ లోకి వచింది కార్తీ, విజయ్ సేతుపతి వంటి యువ హీరోలు.

మధ్యమధ్యలో తెలుగు (telugu) అభిమానులని పలకరించిన కొందరు హీరోలు తరువాత కాలంలో నిలబడలేకపోయారు. అయితే ప్రస్తుతం తెలుగు మార్కెట్ లో కార్తీ & విజయ్ సేతుపతి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల్లో కూడా వీరి చిత్రాలకి సంబంధించి మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉన్నట్టుగా చెబుతున్నారు.

ADVERTISEMENT

కార్తీ కెరీర్ తొలినాళ్ళలో వచ్చిన యుగానికొక్కడు, నా పేరు శివ, ఆవారా వంటి చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందగా ఆ తరువాత కాలంలో తెలుగులో ఊపిరి అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నాగార్జున తో కలిసి చేశాడు. ఆ మరుసటి ఏడాదే ఖాకీ చిత్రం హిట్ అవ్వడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. దీపావళికి విడుదలైన కార్తీ చిత్రం ఖైదీ తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి విజయాన్నే సాధించింది. 

ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా – సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?

ఇక కార్తీ తరువాత తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ (following) ఉన్న మరో తమిళ నటుడు విజయ్ సేతుపతి (vijay sethupathi). ఆయనకి తెలుగులో ఉన్న క్రేజ్ కి తాజా ఉదాహరణ  – ఎంతో బిజీగా తమిళ చిత్రాల షూటింగ్ లో ఉన్నప్పటికి, ఏరి కోరి మరి మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రంలో నటించేందుకు విజయ్ సేతుపతిని తీసుకురావడమే.. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ & సుకుమార్ కలయికలో రాబోతున్న #AA20 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కనిపించేందుకు విజయ్ సేతుపతి అంగీకారం తెలపడం జరిగిందట. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా విజయ్ సేతుపతి కి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆయనని కావాలని ఎంపిక చేసుకుని మరి తెలుగులో నటించడానికి తీసుకురావడం జరిగింది.

తాజాగా విజయ్ నటించిన బిగిల్ చిత్రం తెలుగులో విజిల్ గా విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఫంక్షన్లో భాగంగా విజయ్ తో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసిన దర్శకుడు అట్లీ.. ఎన్టీఆర్ సార్ నన్ను బాగా ప్రోత్సహిస్తుంటారు. నా ప్రతి చిత్రం విడుదలవ్వగానే ఫోన్ చేసి మరి అభినందిస్తుంటారు. దానివల్లే నాకు తెలుగులో ఒక చిత్రం తీయాలని అనిపిస్తుంది. అన్ని కుదిరితే తెలుగులో ఎన్టీఆర్ సార్ తో సినిమా తీస్తాను అంటూ ఒక పెద్ద హింట్ ఇచ్చేసి వెళ్ళాడు.

ADVERTISEMENT

వీటిని బట్టి తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ఎందరో నటులు & దర్శకులని ఇక్కడి తెలుగు వారు ఎంతలా ఆదరిస్తారో అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక పైన చెప్పిన వారే కాకుండా భవిష్యత్తులో మరింతమంది మన తెలుగు లో మార్కెట్ పెంచుకుంటారు అనేది కూడా అర్ధమవుతుంది. ప్రస్తుతం ఒకే భాషలో కాకుండా మల్టీ లాంగ్వేజెస్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో తెలుగు సినిమాలకు తమిళం, మలయాళంలో.. ఆ భాషల హీరోలకు తెలుగులో క్రేజ్ పెరగడం మంచి పరిణామమే.. దీనివల్ల భవిష్యత్తులో చక్కటి కథలతో రూపొందిన సినిమాలను అన్ని భాషల అభిమానులు చూసే వీలుంటుందని చెప్పుకోవచ్చు. 

జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే

31 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT