ఈ మాటలు చెబుతోంటే మీ భర్త కి కాస్త అసూయ (jealousy) ఉన్నట్లే..

ఈ మాటలు చెబుతోంటే మీ భర్త కి కాస్త అసూయ (jealousy) ఉన్నట్లే..

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని గొడవలు అసూయ (jealousy)కారణంగా కూడా వస్తాయి. సాధారణంగా మన సమాజంలో మగవారు(guys) తమ ఫీలింగ్స్ ని తమ వరకూ ఉంచుకోవడానికి అలవాటు పడి ఉంటారు. ఇతరులతో పంచుకోవడానికి వారు పెద్దగా ఇష్టపడరు. అయితే వారిలో అసూయ పెరిగిపోతే మాత్రం అది మీ బంధంపై ప్రభావం చూపుతుంది. అందుకే వారు అసూయ పడుతున్నారో లేదో అన్నది వారు మాట్లాడే కొన్ని మాటల ఆధారంగా వారు మీ పట్ల అసూయగా ఫీలవుతున్నారని తెలుసుకోవచ్చు. మరి, వాళ్లు దాచాలనుకున్నా.. దాచలేని అసూయ చిహ్నాలేంటంటే..

1. ఓహ్.. అయితే నువ్వు.. ఆ అబ్బాయి ఇద్దరేనా?

మీ భర్త మిమ్మల్ని నమ్ముతాడు. కానీ మీతో పాటు ఉన్న అబ్బాయి ని నమ్మడం తనకు కాస్త కష్టమేనని చెప్పాలి. అలాంటిది కేవలం మీరు, మరో అబ్బాయి మాత్రమే ఎక్కడికైనా వెళ్తున్నారంటే తప్పక అసూయ పడతారు. మీపై నమ్మకం ఉన్నా తనూ ఓ అబ్బాయి కాబట్టి అబ్బాయిలు తనతో పాటు వచ్చే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడుకుంటారో తనకి తెలుసు కాబట్టి మీరు అలా వెళ్తానంటే తను కంగారు పడడం సహజం. 

2. ఒకవేళ నువ్వు అదే కోరుకుంటే నువ్వు తప్పక వెళ్లాలి..

తనకు మీరు వెళ్లడం ఇష్టం లేదు. మీరు తనతో ఉండడాన్ని తను ఇష్టపడుతున్నాడు. కానీ మిమ్మల్ని ఆపడం కూడా తనకి ఇష్టం లేదని ఈ మాటతో అర్థం అవుతుంది. మీరు తనతో సమయం గడపట్లేదని.. ఆ సమయం ఎవరితో గడుపుతున్నారో వారి పట్ల అసూయ పెంచుకోవడం కూడా మీరు చూడొచ్చు. 

3. ఓహ్.. ఏం ఫర్వాలేదు. నేను కూడా ఈ వీకెండ్ నా స్నేహితురాలితో బయటకు వెళ్తున్నా..

మీరు అబ్బాయిలతో బయటకు వెళ్తున్నా అని చెబితే ఈ సమాధానం వస్తే తప్పక మీ భర్త అసూయ పడుతున్నట్లే.. తను నిజంగా ఏమీ వెళ్లడు. కానీ తను మీపై ఎంతలా అసూయపడుతున్నడో మీకు తెలియాలని.. మీరు అలాగే అసూయపడాలని భావించి అలా అబద్ధం చెబుతుంటాడు. 

4. నువ్వు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుకుంటావు?

సాధారణంగా మీరు ఆలస్యంగా వస్తే తను కంగారు పడతాడు. కానీ మీరు అబ్బాయిలతో ఉన్నప్పుడు రాత్రి 8 దాటినా తనకు చాలా ఆలస్యంగానే అనిపిస్తుంది. అబ్బాయిలతో ఉన్నారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆలోచనే దీనికి కారణం. 

5.నేను అసూయపడట్లేదు కానీ చాలా లేటవుతుందని చెబుతున్నా.

తను అసూయ పడట్లేదు అంటూ చెప్పడం చూస్తేనే తను అసూయ పడుతున్నాడని అనుమానం వస్తుంది. అయితే మీ గురించి శ్రద్ధ కూడా దీనికి కారణం కావచ్చు. కానీ మీరు తనతో సమయం గడపట్లేదని మాత్రం తప్పక మీ భర్త అసూయపడుతున్నట్లే..

6. నిన్ను పికప్ చేసుకోవడానికి రమ్మంటావా?

అర్థ రాత్రి మీరు స్నేహితులతో సమయం గడిపి అలసిపోకుండా లాంగ్ డ్రైవ్ లాగా తనతో సమయం గడపాలన్నది తన కోరిక.

7. అదేంటి? నేను ఇప్పటివరకూ తనని కలవనే లేదు..

మీకు ఎవరైనా అబ్బాయి స్నేహితుడిగా ఉంటే మాత్రం మీ భర్త అసూయపడుతున్నారనడానికి ఇదో సంకేతం..

8. నువ్వు బయల్దేరాక నాకు ఫోన్ చేయి.. నేను సినిమా చూస్తుంటా. నీకోసం వెయిట్ చేస్తా..

మీ సమయం కోసం తను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు.. తను సినిమా చూస్తా అని చెప్పినా.. మీరెప్పుడు ఫోన్ చేస్తారా? అని వేచి చూస్తూ కూర్చుంటారనేది మాత్రం నిజం. సినిమా చూసినా చూడకపోయినా డోర్ తీసి బయటకు వచ్చి మీకోసం మాత్రం కనీసం ఓ పదిసార్లయినా చూస్తారనేది అక్షర సత్యం. 

9. వావ్.. ఈ రోజు నా భార్య చాలా అందంగా ఉంది.

నా భార్య అని చెప్పడంలో తన ప్రేమను మీకు వెల్లడించడంతో పాటు మీరు తనకు మాత్రమే సొంతం అని తను మీకు చెబుతున్నట్లు.. ప్రపంచంలో తన భార్య అందంగా ఉందని భావించే ప్రతి వ్యక్తి ఆమె కేవలం తనని మాత్రమే చూడాలి.. తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకోవడం సహజం. 

10. అవునా.. అంతే మాట్లాడుకున్నారా? ఇంకేం మాట్లాడలేదా?

కుటుంబ విషయాలు మాట్లాడుకోలేదా? ఇంకేమైనా రొమాంటిక్ మాటలు రాలేదా? ఏమీ లేవంటే నేనే అనవసరంగా కంగారు పడినట్లున్నా.. అన్నది తన ఫీలింగ్.. మీరు ఇలా చెప్పినా సరే.. మీరు మాట్లాడుకున్న మాటలన్నీ చెప్పలేదేమో అనే భావించడం తన అసూయకు తార్కాణం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.