ADVERTISEMENT
home / Humour
పెళ్లయ్యాక పండగ సందర్భంగా అమ్మాయి ఎలా ఫీలవుతుందో మీకు తెలుసా?

పెళ్లయ్యాక పండగ సందర్భంగా అమ్మాయి ఎలా ఫీలవుతుందో మీకు తెలుసా?

పెళ్లి (marriage) తర్వాత మొదటి ఏడాది ఎన్నో అద్భుతమైన అనుభూతులను అందిస్తుంది. అత్తారింట్లో కొత్త కోడలు మొదటి సంవత్సరం వచ్చే పండగలన్నీ ఎంతో అద్బుతంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే అదే సమయంలో తన కుటుంబాన్ని మిస్సయిన ఫీలింగ్ మాత్రం అంత సంతోషంలోనూ తనలో చిన్న బాధను మాత్రం అలాగే నిలుపుతుంది. కొత్త కుటుంబంతో కలిసిపోవాలని వారితో కొత్త జీవన శైలిని అలవర్చుకొని పండగలను వారి కుటుంబం జరుపుకునే రీతిలో కొనసాగించాలని ఆశ ఎంతగానో ఉంటుంది. అయితే చిన్నతనం నుంచి కొనసాగించిన కొన్ని పద్ధతులు వదిలేసి కొత్త పద్ధతులు అలవాటు చేసుకోవడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. మామూలుగా మన కుటుంబాన్ని మిస్సవ్వడం వేరు.. కుటుంబం అంతా ఆనందంగా జరుపుకునే పండగ సందర్భంగా వారిని తలచుకొని.. చిన్ననాటి రోజులు గుర్తుచేసుకొని బాధపడడం వేరు.. అందుకే , దీపావళి (diwali) సందర్భంగా కొత్తగా పెళ్లయిన అమ్మాయి మనసులో మెదిలే ఆలోచనలు ఎలా ఉంటాయంటే..

1. మా అమ్మానాన్నలను మిస్సవుతున్నా.

పండగంటేనే నాన్న ఎంతో హడావిడి చేసేవారు. ఈరోజు మామూలు రోజుల కంటే వారిని ఎక్కువగా మిస్సవుతున్నా. వారి పిలుపు వింటూ నిద్రలేవడాన్ని మిస్సవుతున్నా. ఉదయాన్నే లేవమంటూ నాన్న పదే పదే పిలిచినా బద్ధకంగా ఆలస్యంగా నిద్రలేవడం.. నాన్న చూసేలోపు రడీ అయిపోయి ముగ్గు పెట్టడం ప్రారంభించడం ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతులు..

2. ఇళ్లు శుభ్రం చేయడం గురించి అమ్మ ఇంకెవరిని తిడుతోందో?

ఇళ్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదంటూ అమ్మ ఇంటిని మొత్తం శుభ్రం చేయించేది.. ఇప్పుడు ఆ బాధ్యతను ఇంకెవరిపై పడేసిందో.. లేక ఇళ్లంతా ఒక్కతే శుభ్రం చేసుకుంటుందేమో పాపం.. అందుకే నాకు పెళ్లి కాకపోయి ఉంటే నేను తనకు సాయం చేసేదాన్ని.

ADVERTISEMENT

3. ఈ కొత్త సంప్రదాయాలు కూడా బాగున్నాయి..

ఈ కొత్త సంప్రదాయాల్లో కొన్ని బాగున్నాయి. కానీ మా ఇంట్లోవాళ్లు కూడా ఇక్కడ నాతో పాటు ఉండి.. వీటిని చూస్తూ ఉంటే ఇంకా బాగుండేది కదా.. వాళ్లు అక్కడ పూజలో బిజీగా ఉంటారు. ఇక్కడికొచ్చినా నాలా ఎంజాయ్ చేయలేరేమో..

4. ఇక్కడ కూడా ముగ్గు, దీపాలు నా బాధ్యతే అన్నమాట.

చిన్నతనం నుంచి అమ్మ ముగ్గు పెట్టడం దానిలో రంగులు, పూలు నింపడంతో పాటు దీపాలు పెట్టడం కూడా నాకే అప్పజెప్పేది. తనకు వంటగదిలో చాలా పనులుంటాయి కదా మరి.. ఇప్పుడు ఇక్కడ కూడా అవే పనులు.. సరేలే.. కనీసం నాకు వచ్చిన పనులు చేయగలుగుతున్నా..

5. నేను ఇంట్లో తిన్నట్లు ఉదయం నుంచి స్వీట్లు తినొచ్చా? లేక ఇక్కడేమైనా రూల్స్ ఉంటాయా?

మా ఇంట్లో అయితే నాకు పూర్తిగా స్వేచ్ఛ ఉండేది. అమ్మా నాన్న నేనేం చేసినా ఏమీ అనలేదు. ఇక్కడ అలా తింటే ఏమనుకుంటారో.. హా.. ఫర్లేదు. నేను తింటాను. నాకు మిఠాయిలంటే ఇష్టమని ముందే చెప్పాను కదా..

ADVERTISEMENT

6. నేను పండగ రోజు చాలా అందంగా తయారవుతాను. ఇది నా మొదటి దీపావళి కదా..

అమ్మానాన్న నేను ఇంత అందంగా.. ఇంత సంప్రదాయబద్ధంగా సిద్ధమవడం చూసి ఉంటే ఎంతో ఆనందించేవాళ్లు.. అయినా కొత్త కోడలిని కాబట్టి ఆమాత్రం సింగారించుకోవడం తప్పదు కదా మరి..

7. నేను మా అమ్మానాన్నలనే కాదు.. బంధువులను కూడా మిస్సవుతున్నా..

కేవలం అమ్మానాన్నలనే మా మేనత్తలు, మామయ్యలు, ముఖ్యంగా నా కజిన్స్ వీళ్లు లేకుండా దీపావళి పండగ చాలా బోరింగ్ గా ఉంటుంది. నా భర్త బంధువులు వాళ్లంత కలుపుగోలుగా ఉండలేరు. ఇక కోడలిని కాబట్టి వారితో నేను అంత బాగా కలిసిపోయి మాట్లాడలేను కూడా.

ADVERTISEMENT

8. పూజయ్యే వరకూ ఏమీ తినకుండా ఉండాలా? అబ్బా ఎలాగో..

నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి.. అదే మా ఇంట్లో ఉంటేనా? పూజ అయ్యే వరకూ కాదు.. అసలు లేచిన తర్వాత కొన్ని నిమిషాలు కూడా ఆగేదాన్ని కాదు.. కనీసం నా భర్తయినా ఈ సమయంలో నా మూడ్ బాగుచేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.

9. అబ్బా.. ఎన్ని రకాల వెరైటీలో.. నోరూరిపోతోంది..

కనీసం కొన్ని సంతోషాలైనా సరే.. ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. అందులో ఫుడ్ ఒకటి. నోరూరించే ఆహారం తినడంలోని మజా అక్కడైనా.. ఇక్కడైనా.. ఇంకెక్కడైనా ఒకేలా ఉంటుంది. ఆహారానికి నా మూడ్ మార్చే శక్తి ఉంది.

10. ఇలాంటి సందర్భాల్లోనే నేను పెళ్లి ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది..

ఇలాంటప్పుడే ఇంటికి ఫోన్ చేసి అమ్మా నాకు ఎందుకు పెళ్లి చేసి పంపించేశారు.. నన్ను అత్తారింటికి పంపించేసి మీరు ఇంట్లో సంతోషంగా ఉన్నారు కదా అంటూ వారితో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

22 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT