"ప్రేమికుల రోజు" కోసం ఎదురు చూస్తున్న.. నాగ చైతన్య, సాయిపల్లవి

"ప్రేమికుల రోజు" కోసం ఎదురు చూస్తున్న.. నాగ చైతన్య, సాయిపల్లవి

(Naga Chaitanya and Sai Pallavi's Valentines Day Gift to their Fans)

ఏ మాయ చేశావె, 100 % లవ్, ప్రేమమ్, మజిలీ లాంటి సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు నాగ చైతన్య. ఎంతో చరిత్ర కలిగిన అక్కినేని వారి కుటుంబం నుండి వచ్చినా.. తన కష్టం తానూ పడ్డాడు. వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకోవడానికీ ప్రయత్నించాడు. ఇప్పుడు మరోమారు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి సంసిద్ధుడవుతున్నాడు. ఓ ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి వస్తున్నాడు.

ఇంతకీ ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తున్న నటి ఎవరో తెలుసా..? ఆమే సాయిపల్లవి. మలయాళంలోని 'ప్రేమమ్' చిత్రంతో కుర్రకారు మనసు దోచిన ఈమె.. వరుణ్ తేజ్ నటించిన "ఫిదా" చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా నటించడం మాత్రమే కాదు.. ఆ పాత్రకు తగిన న్యాయం కూడా చేసి.. అందరి మనసులనూ గెలుచుకుంది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల.. మళ్లీ తన తదుపరి చిత్రంలో కూడా సాయిపల్లవికే ఛాన్స్ ఇవ్వడం విశేషం.

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

'ఆనంద్' చిత్రంతో తన టాలీవుడ్ కెరీర్ ప్రారంభించిన శేఖర్ కమ్ముల.. 'హ్యాపీడేస్' చిత్రంతో యూత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. గోదావరి, లీడర్ లాంటి చిత్రాలలో డిఫరెంట్ సబ్జెక్టులను కూడా డీల్ చేశాడు. ఇప్పుడు తన నాగచైతన్య, సాయిపల్లవి నటీ నటులుగా.. ఓ వినూత్న ప్రేమకథను తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14, 2020 తేదిన (ప్రేమికుల రోజు  సందర్భంగా) విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని కూడా వినికిడి. ఈ లవ్ స్టోరీ కోసం అక్కినేని అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

పిల్లల గురించి తన మనసులోని.. మాటను బయటపెట్టిన నాగ చైతన్య..!

 

View this post on Instagram

#lisilake#dreamy#inlove

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

ఇక నాగచైతన్య ఇప్పుడు.. వెంకటేష్‌తో కలిసి "వెంకీ మామ" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య నటించిన మనం, ఒక లైలా కోసం, ఆటోనగర్ సూర్య.. అలాగే వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.ఈ చిత్రానికి కోన వెంకట్ కథా సహకారం అందిస్తున్నారు. మల్టీస్టారర్ చిత్రాలు చేయడం నాగచైతన్యతో పాటు వెంకటేష్‌కు కూడా కొత్తేమీ కాదు.

మరోసారి ప్రేక్షకులని 'ఫిదా' చేస్తామంటున్న సాయి పల్లవి - శేఖర్ కమ్ముల

మనం, తడాఖా లాంటి మల్టీ స్టారర్ చిత్రాలలో గతంలో చైతూ నటిస్తే.. గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలలో వెంకటేష్ నటించారు. 2019 ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలుగా నటిస్తున్న.. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి స్థాయి పల్లెటూరి నేపథ్యంతో పాటు.. ఆర్మీ టచ్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.